హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Ukraine-Russia: ఉక్రెయిన్ యుద్ధం యూరప్‌ను చైనా నుంచి దూరం చేస్తోందా..?జపాన్ వ్యూహం అదేనా..?

Ukraine-Russia: ఉక్రెయిన్ యుద్ధం యూరప్‌ను చైనా నుంచి దూరం చేస్తోందా..?జపాన్ వ్యూహం అదేనా..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రచ్ఛన్న యుద్ధం(War) పరిస్థితులను కల్పిస్తున్న ఉక్రెయిన్‌పై(Ukraine) రష్యా యుద్దం, ఆసియా(Asia)లో ఇప్పటికే ఆర్థిక, భద్రతాపరమైన ప్రభావం చూపుతోంది. ఉక్రెయిన్‌పై దాడులను సమర్థించుకొన్న రష్యా.. క్రెమ్లిన్‌ను చైనా(China) వెనకేసుకొచ్చింది. చైనా తటస్థ వైఖరి, రష్యాతో బలమైన సంబంధాల నేపథ్యంలో ఆసియాలో ఇతర దేశాల వైపు యూరప్‌ చూస్తుంది.

ఇంకా చదవండి ...

ప్రచ్ఛన్న యుద్ధం(War) పరిస్థితులను కల్పిస్తున్న ఉక్రెయిన్‌పై(Ukraine) రష్యా యుద్దం, ఆసియా(Asia)లో ఇప్పటికే ఆర్థిక, భద్రతాపరమైన ప్రభావం చూపుతోంది. ఉక్రెయిన్‌పై దాడులను సమర్థించుకొన్న రష్యా.. క్రెమ్లిన్‌ను చైనా(China) వెనకేసుకొచ్చింది. చైనా తటస్థ వైఖరి, రష్యాతో బలమైన సంబంధాల నేపథ్యంలో ఆసియాలో ఇతర దేశాల వైపు యూరప్‌ చూస్తుంది. రెండు ఆసియా దేశాలతో సంబంధాలను బలోపేతం చేయడానికి జపాన్(Japan), భారతదేశానికి పర్యటనలు యూరోపియన్ నాయకులు ప్రారంభించారు. చైనాకు వ్యతిరేకంగా ఐరోపాలోని ఇండో- పసిఫిక్‌కు ఈ రెండు దేశాలు చాలా ముఖ్యమైనవని రాజకీయ నాయకులు చెబుతున్నారు. మొదటి అధికారిక పర్యటన కోసం బెర్లిన్(Berlin) అగ్ర వాణిజ్య భాగస్వామి చైనాకు బదులుగా జపాన్‌ను జర్మన్ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ సందర్శించారు. జర్మన్ ఛాన్సలర్ అయిన తర్వాత జపాన్‌ను మొదటి ఆసియా గమ్యస్థానంగా ఎంచుకోవడం యాదృచ్చికం కాదని స్కోల్జ్ చెప్పారు. చైనాను విమర్శించనప్పటికీ, జర్మన్ వ్యాపారాలలో వైవిధ్యత అవసరాన్ని స్కోల్జ్ స్పష్టం చేశాడు. సరఫరా గొలుసులు వ్యక్తిగత దేశాలపై ఆధారపడకుండా చూసుకోవడంపై జర్మనీ దృష్టి సారిస్తోందని ప్రకటించారు.

Imran Khan : పాక్ లో కొత్త పరిణామం..ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ కు రంగం సిద్ధం!

ఒక దేశం నుంచి సరఫరా గొలుసులపై ఎవరూ ఆధారపడకుండా ఉండటానికి మా కంపెనీలు, మేము చేయగలిగినంత చేస్తామని స్కోల్జ్‌ పేర్కొన్నారు. ఉక్రెయిన్ సంక్షోభంతో ఈ పరిస్థితి ఏర్పడిందని, పెద్దపాత్ర పోషించాల్సి వచ్చిందని జర్మన్‌ ఛాన్సలర్‌ తెలిపారు. ఇండో-పసిఫిక్ ప్రాంతానికి సంబంధించిన చర్చలపై కూడా ఇరు దేశాలు దృష్టి సారించాయి. సంయుక్త వార్తా సమావేశంలో ఇండో-పసిఫిక్ ప్రాంతంలో జర్మనీ ఆసక్తిని ప్రమేయాన్ని జపాన్ PM కిషిదా స్వాగతించారు. చైనా వైఖరికి స్పందనతో పాటు ఇతర సవాళ్లను ఎదుర్కోవడానికి ఇరు దేశాలు కలిసి పని చేస్తాయని కిషిదా ప్రకటించారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి పశ్చిమ దేశాలతో సన్నిహిత భాగస్వామిగా జపాన్‌కు ప్రశంసలు వస్తున్నాయి. రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసిన సమయం నుంచి G-7 దేశాలతో జపాన్ సన్నిహితంగా ఉంటోంది.

జపాన్‌ను ఈయూకు దగ్గర చేస్తున్న కిషిదా..

ఉక్రెయిన్, దాని యూరోపియన్ పొరుగు దేశాలతో ప్రత్యక్ష సంబంధాలను కిషిదా క్యాబినెట్ పెంచుకుంటోంది. రష్యాపై ఆంక్షలు విధించడంలో పశ్చిమ దేశాలతో కలిసిన అతికొద్ది ఆసియా దేశాలలో జపాన్ ఒకటి. స్కోల్జ్ రిటర్న్ ఫ్లైట్‌లో ఉక్రెయిన్ కోసం కొంత సహాయాన్ని కూడా టోక్యో పంపింది. జపాన్‌ను చైనా ప్రాథమిక ప్రాంతీయ శత్రువుగా పాశ్చాత్య దేశాలు కూడా పరిగణించాయి. చైనా ఎదుగుదల, ఇండో-పసిఫిక్‌లో మారుతున్న పరిస్థితులపై యూరోపియన్ దృష్టిని చూసి టోక్యో సంతోషంగా ఉంది. ఇండో-పసిఫిక్‌లో వాషింగ్టన్ భద్రతా సహకారంపై జపాన్ ఆధారపడింది. చైనా నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో సంయుక్తంగా సైనిక కసరత్తులు ఇరు దేశాలు చేశాయి. ఇండో-పసిఫిక్‌లో చైనా ప్రాబల్యానికి కౌంటర్‌గా జపాన్, ఇండియా, ఆస్ట్రేలియాల నేతృత్వంలోని క్వాడ్ కూటమి ఏర్పడిని సంగతి తెలిసిందే.

రష్యా నుంచి ఇండియాను తమవైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్న పశ్చిమ దేశాలు..?

ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధంతో ఇది నిమగ్నమై ఉండగా, ఇండో-పసిఫిక్‌లో పరిస్థితులపై యూరప్ దృష్టి పెట్టింది. జపాన్‌తో పోలిస్తే భారత్‌కు చైనా నుంచి పెద్ద ముప్పు ఉందని నిపుణులు చెబుతున్నారు. 2020 గాల్వాన్ వ్యాలీ స్టాండ్‌ ఆఫ్ నుంచి చైనా ముప్పుపై భారతదేశం ఎక్కువగా దృష్టి సారించింది. లడఖ్‌లో చైనా చొరబాట్లు, చర్చల ప్రతిష్టంభనతో చైనా చర్యలు స్పష్టవమయ్యాయి. రష్యా యుద్ధంపై భారతదేశం తటస్థ వైఖరిని కొనసాగించినప్పటికీ, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఇది కీలకంగా మారింది. న్యూ ఢిల్లీ కూడా QUAD కూటమిలో భాగం, దీన్ని బీజింగ్ వ్యూహకర్తలు పెద్ద ముప్పుగా భావించే అవకాశం ఉంది. AUKUS ఒప్పంద ఘటన తర్వాత భారతదేశంతో నౌకాదళ సంబంధాలను మరింతగా పెంచుకోవాలని ఫ్రాన్స్ చూస్తోంది.

భారత పర్యటన సందర్భంగా, రష్యాతో భాగస్వామ్యం కారణంగా చైనాపై విరుచుకుపడిన EC చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్. తన సమయంలో భారతదేశంతో బలమైన వాణిజ్య సంబంధాల ప్రాముఖ్యత గురించి కూడా EU నాయకురాలు మాట్లాడారు. పశ్చిమ, రష్యా మధ్య కీలకమైన సమతుల్యతను కొనసాగించాలని చూస్తుండగా, EUతో తన వాణిజ్యాన్ని విస్తరించాలని కూడా భారతదేశం కోరుకుంటుంది. భారతదేశం, యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్యంపై జూన్‌లో ఒప్పందం చేసుకోవడానికి చర్చలకు సిద్ధం చేస్తున్నాయి. 2007లో 27 దేశాల ఆర్థిక సంఘంతో FTA కోసం భారతదేశం చర్చలు ప్రారంభించింది.

అయితే కీలక అంశాలపై ఇరుపక్షాలు ఒక అంగీకారానికి రాకపోవడంతో 2013లో చర్చలు నిలిచిపోయాయి.

IT Jobs: ఫ్రెషర్స్‌కి అదిరిపోయే గుడ్ న్యూస్... ఎంట్రీ సాలరీ భారీగా పెంచిన ఐటీ కంపెనీలు

వాణిజ్యం, భద్రత, సాంకేతికతలో సవాళ్లపై ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసేందుకు కూడా ఇరుపక్షాలు అంగీకరించాయి. వాన్ డెర్ లేయన్ మాదిరిగానే, రక్షణ సహకారాన్ని బలోపేతం చేయడానికి భారతదేశంలో యూకే పీఎం బోరిస్ జాన్సన్ పర్యటించారు. ఇటీవల భారత్‌ను ఆకర్షించేందుకు అగ్రశ్రేణి దౌత్యవేత్తలను న్యూఢిల్లీకి అమెరికా, బ్రిటన్‌ పంపాయి. ఇంతలో లిథువేనియాలో కొత్త రాయబార కార్యాలయాన్ని ప్రారంభించిన భారతదేశం, ప్రస్తుతం బీజింగ్‌ వాణిజ్యాన్ని EU దేశం లక్ష్యంగా చేసుకుంది. ఉక్రెయిన్‌లో యుద్ధం నేపథ్యంలో ఈ వారం యూరప్‌లో ప్రధాని మోదీ, పీఎం కిషిదా పర్యటించనున్నారు.

First published:

Tags: China, Eu, Japan, Russia, Russia-Ukraine War

ఉత్తమ కథలు