హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

China: డ్రాగన్‌ దేశంలో మందుల కొరత.. ఇండియా ఔషధాలను బ్లాక్‌లో కొంటున్న చైనా ప్రజలు..

China: డ్రాగన్‌ దేశంలో మందుల కొరత.. ఇండియా ఔషధాలను బ్లాక్‌లో కొంటున్న చైనా ప్రజలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

China: చైనాలో కరోనా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే.  అక్కడ అత్యవసర సేవలు, మందుల కొరత వేధిస్తున్నట్లు తెలిసింది. దీంతో చైనా ప్రజలు ఇండియా మందుల వైపు చూస్తున్నారు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

చైనా (China)లో మొదలైన కరోనా (Corona) సంక్షోభం ప్రపంచాన్ని కుదిపేసింది. చాలా దేశాలు ఇంకా పూర్తిగా కొవిడ్‌ ప్రభావం నుంచి కోలుకోలేదు. ఇండియా (India)కు చెందిన ఫార్మా కంపెనీలు తయారు చేసిన కొవిషీల్డ్, కొవాగ్జిన్‌ వ్యాక్సిన్లు సమర్థంగా పని చేశాయి. ప్రస్తుతం ఇండియాలో దాదాపు కరోనా అదుపులోనే ఉంది. అయితే ఇటీవల చైనాలో కేసులు మళ్లీ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. అక్కడ అత్యవసర సేవలు, మందుల కొరత వేధిస్తున్నట్లు తెలిసింది. దీంతో చైనా ప్రజలు ఇండియా మందుల వైపు చూస్తున్నారు. చైనాలో కొవిడ్ వ్యాక్సిన్లు అయిన పాక్స్లోవిడ్, అజ్వుడిన్ కొన్ని ఆసుపత్రిలో మాత్రమే లభిస్తున్నాయి. పైగా అధిక ధరకు విక్రయిస్తుండటంతో చైనా ప్రజలు ఇండియన్ జనరిక్ డ్రగ్స్‌పై ఆధారపడుతున్నారు.

* బ్లాక్ మార్కెట్లో ఇండియా ఔషధాలు

నియంత పాలనకు పెట్టింది పేరైన చైనా, ఇండియాకు చెందిన ఔషధాల విక్రయాలను అనుమతించలేదు. చైనాలో ఇప్పుడు తిరిగి కొవిడ్‌ 19 ప్రభావం పెరిగిపోవడంతో ప్రజలు బ్లాక్ మార్కెట్లో ఇండియన్ డ్రగ్స్‌ను కొనుగోలు చేస్తున్నారు. ఇటువంటి సమయంలో చైనా వ్యాక్సిన్‌ల కొరత ఉండడం, అధిక ధరకు విక్రయిస్తుండటంతో.. అక్రమంగా రవాణా చేస్తూ బ్లాక్ మార్కెట్లో తక్కువ ధరకు దొరికే ఇండియన్ డ్రగ్స్ అయిన యాంటీ కొవిడ్‌ ఇండియన్ జనరిక్ డ్రగ్స్ బాక్సును 144 డాలర్లకు అమ్ముతున్నారు.

ఈ విషయం చైనీస్ సోషల్ మీడియా ప్లాట్ ఫారం అయిన వెయిబో లో ఇది ట్రెండింగ్ అయింది. యూజర్లు మెడిసిన్ పొందడానికి టిప్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నట్లు రిపోర్టు పేర్కొంది. ఇండియన్ యాంటీ కొవిడ్‌ డ్రగ్స్ అయిన ప్రీమోవిర్, పాక్సిస్ట , మొల్నునట్, మొల్నట్రిస్ తదితర ఔషధాలను చైనీస్ బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నట్లు ఇంకొక ఆన్‌లైన్‌ పోర్టల్ పేర్కొంది. లాన్సెట్ కమిషన్ మెంబర్ అయిన సునీల్ గర్గ్ మాట్లాడుతూ.. వైరస్‌కి సరిహద్దులతో సంబంధం లేదని, ఇప్పటికే ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవడం ప్రారంభించిందని తెలిపారు. కరోనా ఫోర్త్ వేవ్‌పై చైనా నుంచి స్పష్టత కావాలని అన్నారు. ప్రస్తుతం వ్యాక్సినేషన్‌పై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.

* నోరు మెదపని జిన్‌ పింగ్

చైనాలో కరోనా ప్రభావంతో మెడిసిన్‌ షార్టేజ్ రావడంతో జనం ఆస్పత్రుల దగ్గర క్యూలో నిలబడి ఉన్న వీడియోలు వైరల్ అయ్యాయి. అలాగే శ్మశానం వద్ద శవాలు గుట్టలు కూడా కనిపించాయి. కానీ ఇప్పటివరకు కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు గురించి చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్‌ నోరు మెదపలేదు. పెరుగుతున్న కేసుల గురించి స్పందించలేదు.

ఇది కూడా చదవండి : న్యూ ఇయర్‌ పార్టీలకి టికెట్లు బుక్ చేసుకుంటున్నారా? వన్ మినిట్ ఆగండి

ఈ పరిస్థితిపై ఏం చేయాలి? అనే దానిపై అధికారులకు ఎటువంటి స్పష్టత లేదని చైనీస్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫ్యాంగ్ కెచెంగ్ తెలిపారు. మారుమూల ప్రాంతాలకు వైరస్ వ్యాప్తి చెందినప్పుడు ఒక మేజర్ టెస్ట్ మాత్రం వస్తుందని దానికి కూడా మెడికల్ షార్టేజ్ ఉండవచ్చు అని తెలిపారు. కొన్ని ఈ కామర్స్ సంస్థలు ఆన్‌లైన్‌లో జనరిక్ మెడిసిన్‌ని సేల్‌కి పెట్టాయి. ఇల్లీగల్ చానల్ నుంచి లైసెన్స్ లేని వ్యక్తుల నుంచి మెడిసిన్‌లు కొనవద్దని చైనీస్ డాక్టర్లు ప్రజలను వేడుకుంటున్నారు.

* చైనాలో పారాసిటమాల్‌ కొరత

ప్రస్తుతం చైనాలో పారాసిటమాల్‌, ఐబుప్రోఫిన్ టాబ్లెట్లు కొరత ఉండడంతో డిమాండ్ ఎక్కువగా ఉందని, చైనా నుంచి ఈ టాబ్లెట్లు ఉత్పత్తి కోసం కొటేషన్లు వస్తున్నాయని ఫార్మేక్సిల్ చైర్మన్ షాహిల్ ముంజల్ తెలిపారు. ఈ పరిస్థితిపై స్పందించిన ఇండియన్ ఫారెన్ మినిస్ట్రీస్ స్పోక్స్ పర్సన్ ఆరిందం బాగచి.. ప్రపంచంలోనే అతిపెద్ద జనరిక్ మెడిసిన్ తయారీదారులుగా ఉన్న ఇండియా ఈ పరిస్థితుల్లో చైనాకి సహాయం చేయడానికి ముందుంటుందని తెలిపారు. చైనాలో కరోనా పరిస్థితిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నా మన్నారు. ఫార్మేక్సిల్ రిపోర్ట్ ప్రకారం.. 2021-22 సంవత్సరంలో చైనాకి ఇండియా మెడికల్ ఉత్పత్తులు కేవలం 1.4% మాత్రమే ఎగుమతి అయ్యాయని తెలిపారు.

First published:

Tags: China, Corona cases, Covid, India, International news

ఉత్తమ కథలు