• HOME
  • »
  • NEWS
  • »
  • INTERNATIONAL
  • »
  • CHINA RELEASES GALWAN VALLEY CLASH VIDEO WHILE INDIA CHINA TO HOLD 10TH ROUND OF TALKS TODAY NK

India-China: గాల్వాన్ ఘర్షణ వీడియో రిలీజ్ చేసిన చైనా... నేడు 10వ రౌండ్ చర్చలు

India-China: గాల్వాన్ ఘర్షణ వీడియో రిలీజ్ చేసిన చైనా... నేడు 10వ రౌండ్ చర్చలు

గాల్వాన్ ఘర్షణ వీడియో రిలీజ్ చేసిన చైనా (image credit - twitter)

India-China: గాల్వాన్ ఘర్షణలో తమ సైనికులు నలుగురు చనిపోయినట్లు చెప్పిన చైనా... తాజాగా ఆ ఘర్షణకు సంబంధించిన వీడియోను రిలీజ్ చేసింది.

  • Share this:
    India-China: జిత్తుల మారి నక్క కంటే దారుణమైన కుట్రలు, కుతంత్రాలు పన్నే చైనా... తాజాగా గాల్వాన్ ఘర్షణకు సంబంధించిన వీడియోని తనకు సంబంధించిన మీడియా ద్వారా రిలీజ్ చేసింది. అందులోనూ తమ సైనికులు వీరోచితంగా పోరాడి అమరులు అయ్యారని గొప్పగా చెప్పుకుంది. గతేడాది జూన్‌లో... లఢక్ తూర్పున సరిహద్దు ప్రాంతమైన గాల్వాన్ లోయలో... భారత్, చైనా సైనికుల మధ్య ఈ ఘర్షణ జరిగింది. 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై అప్పటి నుంచి సైలెంట్‌గా ఉన్న డ్రాగన్ ప్రభుత్వం... తాజాగా తమ సైనికులు నలుగురు చనిపోయారని చెప్పుకొచ్చింది. అందులో ఎంతవరకూ నిజం ఉందన్నది చైనాకే తెలియాలి. ఆ నలుగురినీ మెచ్చుకుంటూ... ఓ వీడియో చేసి... అందులో ఘర్షణ విజువల్స్ మిక్స్ చేసింది.

    ఈ వీడియోని చూస్తేనే అర్థమవుతుంది చైనా ఎంత కుట్రపూరితంగా ఈ ఘర్షణకు దిగిందో. వీడియోలో భారత సైనికుల కంటే చైనా సైన్యం ఎన్నో రెట్లు ఎక్కువ సంఖ్యలో ఉంది. పొలోమంటూ సరిహద్దుల్లోకి చొచ్చుకొచ్చి కావాలనే ఘర్షణకు దిగినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. తన తప్పును కూడా గొప్పగా చెప్పుకోవడం చైనాకే చెల్లుతోంది.


    తాజాగా గాల్వాన్ లోయ ఘర్షణల్లో ప్రాణ త్యాగం చేసిన నలుగురు సైనికులకు హానరరీ టైటిల్‌తో చైనా సెంట్రల్ మిలటరీ కమిషన్ గౌరవించింది. ఆ రోజు సైనా జవాన్లకు నాయకత్వం వహించిన కల్నల్‌కు కూడా అవార్డును ప్రకటించింది. ప్రాణత్యాగం చేసిన వారిలో చెన్ హాంగ్‌జున్, చెన్ జియాన్‌గ్రాంగ్, గ్జియో సియువాన్, వాంగ్ జోరాన్ ఉన్నట్లు తెలిపింది.

    10వ సారి చర్చలు:
    తాజాగా ఇండియా-చైనా మధ్య పదోసారి చర్చలు జరగబోతున్నాయి. ఈ చర్చల్లో కార్ప్స్ కమాండర్ స్థాయి అధికారులు పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు వాస్తవాధీన రేఖకు అవతల చైనా సరిహద్దులోని మాల్డో ప్రాంతంలో ఇవి జరుగుతాయి. రెండు దేశాల మధ్య సరిహద్దు, వాస్తవాధీన రేఖ సమస్యలు, ఘర్షణలను తగ్గించేందుకే ఈ చర్చలు జరుగుతున్నాయి.

    ఇది కూడా చదవండి: lizard vastu: ఇంట్లోకి ఆ దిశ నుంచి బల్లి వస్తే... ఏం జరుగుతుందో తెలుసా?

    గాల్వాన్ ఘర్షణ తర్వాత... చైనా చాలాసార్లు కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. మరోవైపు చర్చలు జరుగుతున్నాయి. ఈ మధ్య రెండువైపులా సైన్యం వెనక్కి వెళ్లింది. అయినప్పటికీ జిత్తులమారి చైనాను నమ్మే పరిస్థితి లేదు. ఘర్షణల కంటే శాంతి చర్చలే మేలు కాబట్టి... భారత్ ఈ చర్చలకు ప్రాధాన్యం ఇస్తోంది.
    Published by:Krishna Kumar N
    First published: