హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

గృహ నిర్బంధంలో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్?.. సంచలనంగా మారిన సుబ్రమణ్యస్వామి ట్వీట్..

గృహ నిర్బంధంలో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్?.. సంచలనంగా మారిన సుబ్రమణ్యస్వామి ట్వీట్..

చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, సుబ్రమణ్యస్వామి (ఫైల్)

చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, సుబ్రమణ్యస్వామి (ఫైల్)

China: బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. SCO సమ్మిట్ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చాక.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను సైన్యం అరెస్టు చేసినట్లు పలు వాదనలు వినిపిస్తున్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Haryana, India

చైనా అధ్యక్షుడు (China) జిన్ పింగ్ ను హౌస్ అరెస్టు చేసినట్లు పలువార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. SCO సమ్మిట్ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చాక.. చైనా సైన్యం.. అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను అరెస్టు చేసినట్లు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉండగా బీజేపీ నేత, తన ప్రకటనల కారణంగా తరచూ వార్తల్లో నిలిచే సుబ్రమణ్యస్వామి (subramanian swamy) చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో (Social media) సంచలనంగా మారింది.

జిన్‌పింగ్ (xi jinping) ఇటీవల సమర్‌కండ్‌లో ఉన్నప్పుడు, చైనా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఆర్మీ చీఫ్‌ని ఆ పదవి నుండి తొలగించారని వార్తలు వస్తున్నాయి. ఆ తర్వాత ఆయనను సైన్యం.. జిన్ పింగ్ ను గృహనిర్బంధంలో ఉంచినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ట్వీట్‌తో పాటు ఓ వీడియోను కూడా షేర్ చేశాడు. చైనాకు కాబోయే కొత్త అధ్యక్షుడు జనరల్ లీ కయోమింగ్ అంటు వార్తలు వైరల్ గా (Viral news)  మారాయి.  ఈ వార్తలపై ఇంకా అధికారిక ధృవీకరణ లేదు.

ఇదిలా ఉండగా సిరియా(Syria) తీరంలో ఘోర ప్రమాదం జరిగింది.

దాదాపు 150 మంది అక్రమ వలసదారులతో లెబనాన్(Lebanon)​ నుంచి ఐరోపాకు వెళ్తున్న పడవ గురువారం మధ్యాహ్నం సిరియా తీరంలో బోల్తా పడింది(Boat capsizes). ఈ ఘటనలో 77 మంది వలసదారులు మరణించినట్లు సిరియా ఆరోగ్య మంత్రి శుక్రవారం చెప్పారు. సిరియాలోని టార్టస్ నగరం సమీపంలో బోల్తా పడిన చిన్న పడవలో దాదాపు 150 మంది, ఎక్కువగా లెబనీస్ మరియు సిరియన్లు ఉన్నారని తెలిపారు.తూర్పు మధ్యధరా సముద్రంలో జరిగిన ఘోరమైన పడవ ప్రమాదాలలో ఇదొకటని తెలిపారు.

నీట మునిగిన కొన్ని మృతదేహాలను వెలికితీశామని, 20 మందిని రక్షించి చికిత్స కోసం తీరప్రాంత నగరమైన టార్టస్‌లోని హాస్పిటల్ కు తరలించారని సిరియన్ పోర్ట్ అథారిటీ అధిపతి జనరల్ సమీర్ కోబ్రోస్లీని తెలిపారు. అదే సమయంలో సిరియన్ ద్వీపం అర్వాద్ సమీపంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని, బాధితుల కోసం అధికారులు వెతుకుతున్నారని ఆయన చెప్పారు.

బోటు మనిగిపోయి 77మంది మరణించగా, 20 మంది ప్రాణాలతో బయటపడి చికిత్స పొందుతున్నారని, ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉంద ని సిరియా ఆరోగ్య మంత్రి హసన్ అల్-గబాష్ టార్టస్‌ లోని అల్-బాసెల్ ఆసుపత్రి నుండి చేసిన టెలివిజన్ ప్రసంగంలో తెలిపారు. రక్షించబడిన వారిలో ఐదుగురు లెబనీస్ ఉన్నారని లెబనాన్ కేర్ టేకర్ రవాణా మంత్రి అలీ హమీ తెలిపారు. కాగా,టార్టస్.. సిరియా యొక్క ప్రధాన నౌకాశ్రయాలకు దక్షిణాన ఉంది. వలసదారులు పడవ ఎక్కిన నార్త్ లెబనీస్ ఓడరేవు నగరమైన ట్రిపోలీకి ఉత్తరాన 50 కిలోమీటర్లు (30 మైళ్ళు) దూరంలో ఉంది.

Published by:Paresh Inamdar
First published:

Tags: China

ఉత్తమ కథలు