Modi Xi Meet | మోదీ, జిన్‌పింగ్ ఓ తమిళ సినిమా.. ఏంటా కథ..

Modi Xi Meet | భారత ప్రభుత్వం ఆహ్వానం మేరకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్.. మన దేశానికి విచ్చేసిన సంగతి తెలిసిందే కదా. మన దేశంలో ఎన్నో నగరాలు.. చారిత్రక ప్రాంతాలు ఉండగా.. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్.. తమిళనాడు‌లోని సముద్రతీర పట్టణమైన మహాబలిపురం ఎందుకు ఎంచుకున్నాడు.

news18-telugu
Updated: October 12, 2019, 2:47 PM IST
Modi Xi Meet | మోదీ, జిన్‌పింగ్ ఓ తమిళ సినిమా.. ఏంటా కథ..
భారత ప్రధాని మోదీ,జిన్‌పింగ్ (ANI Photo)
news18-telugu
Updated: October 12, 2019, 2:47 PM IST
భారత ప్రభుత్వం ఆహ్వానం మేరకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్.. మన దేశానికి విచ్చేసిన సంగతి తెలిసిందే కదా. మన దేశంలో ఎన్నో నగరాలు.. చారిత్రక ప్రాంతాలు ఉండగా.. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్.. తమిళనాడు‌లోని సముద్రతీర పట్టణమైన మహాబలిపురం ఎందుకు ఎంచుకున్నాడు. ఈ పట్టణంలోనే భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఈ ప్రాంతంలోనే కలవాలని భావించడం వెనక పెద్ద కారణమే ఉంది. దాదాపు 1200 సంవత్సరాల క్రితం సుమారు.. 7, 8 శతాబ్ధాల సమయంలో మహాబలిపురాన్ని పల్లవ రాజులు పరిపాలించారు. వారు ఈ ప్రాంతాన్ని ఎంతో అందంగా తీర్చిదిద్దారు. దీన్ని ఒక  మహా నగరంగా మలచారు.ఈ  చారిత్రక నగరానికి చైనాకు విడదీయరాని అనుబంధం ఉంది. మూడో పల్లవ రాజు కుమార విష్ణువు ఎన్నో యుద్ధ కళల్లో, వైద్యవృత్తిలో నిపుణుడు. ఆయన రాజుగానే ఉన్నపుడు బౌద్ద మతాన్ని ఆరాధించాడు. అంతేకాదు స్వయంగా తాను బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. ఆ తర్వాత ఓ పని  నిమిత్తం ఆయన చైనా దేశానికి వెళ్లిపోయి.. అక్కడ స్థిర పడిపోయాడు. ఆయనే ఆ తర్వాత భోధి ధర్ముడుగా ప్రఖ్యాతి గాంచాడు. అక్కడ ప్రజలు ఆయన్ని నిత్యము ఆరాధిస్తునే ఉన్నారు.

china president xi jinping to meet indian prime minister narendra modi at mahabalipuram due to these reasons,xi jinping,pm modi,narendra modi,pm modi meets xi jinping,chinese president xi jinping,xi jinping modi,pm modi and xi jinping,pm modi in china,modi,xi jinping,president xi jinping welcomes pm modi,xi jinping pm modi,modi xi jinping summit,modi meets xi jinping,modi-xi jinping meeting,india pm meets xi jinping,modi with china president xi jinping,pm modi-xi jinping,modi in china,suriya shruti haasan 7th sense,7th sense,మామల్లపురం,జిన్ పింగ్,ప్రధాని మోదీ,తమిళనాడు,భేటీ,మహాబలిపురం,7th సెన్స్,శృతి హాసన్,సూర్య ఏ ఆర్ మురుగదాస్,టాలీవుడ్,కోలీవుడ్,తమిళ సినిమా,
మోదీ, జిన్‌పింగ్ (ANI Photo)


తమకు ఆరాధ్యడైన కుమర విష్ణువు నడియాడన ప్రాంతాన్ని తిలకించాలని భావించిన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మహాబలి పురాన్ని ఎంచుకున్నారు. ఇక బోధి ధర్ముడి కథపై ఆ మధ్య సూర్య, శృతి హాసన్ జంటగా మురగదాస్ దర్శకత్వంలో ‘7Th సెన్స్’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే కదా. మరోవైపు జిన్‌పింగ్ రాక వెనక మరో కారణం ఉంది. చైనాకు సంబంధించిన చాలా కంపెనీలు తమ పెట్టుబడులను తమిళనాడు రాష్ట్రంలో పెట్టాయి. ఈ సందర్భంగా స్వామి కార్యం, స్వకార్యం నెరవేరేలా జిన్‌పింగ్ మన దేశ పర్యటనలో మహాబలి పురాన్ని ఎంచుకున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు.

First published: October 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...