అమెరికాలో జిన్‌పింగ్ కూతురు.. భయపడుతున్న చైనా అధ్యక్షుడు..

తన కూతురు జి మింగ్జే గురించి భయం పట్టుకుంది చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కు. వుహాన్‌లో కరోనా వైరస్ ఎఫెక్ట్ ప్రారంభం కాగానే ఆయన తన కూతుర్ని అమెరికా పంపించారని సమాచారం.

news18-telugu
Updated: April 29, 2020, 6:50 AM IST
అమెరికాలో జిన్‌పింగ్ కూతురు.. భయపడుతున్న చైనా అధ్యక్షుడు..
గతంలో మాదిరిగా ఈ సారి ప్రభుత్వం బహిరంగంగా ఈ విషయాన్ని ప్రకటించలేదు. Xiaomi's Mi Browser Pro, Baidu's సెర్చ్ యాప్స్ మీద బ్యాన్ విధించినట్టు రాయిటర్స్ తెలిపింది. అయితే, మొత్తం ఎన్ని యాప్స్ మీద బ్యాన్ ఉందనే విషయం చెప్పలేదు.(Image : AP)
  • Share this:
కరోనా వైరస్ చైనాలో పుట్టడంతో ప్రపంచం మొత్తం ఆ దేశాన్నే నిందిస్తోంది. ఇంతటి విలయానికి కారణమైన డ్రాగన్ దేశంపై తమ అక్కసు వెళ్లగక్కుతున్నాయి. ఇప్పటికే ఆ దేశంపై ఆగ్రహంతో ఉన్న దేశాలన్నీ.. సరైన అవకాశం కోసం ఎదురు చూస్తున్నాయి. ఈ వైరస్ అంతానికి వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి రాలేదు. అయితే, ఇప్పుడు ఆ భయం కంటే.. తన కూతురు జి మింగ్జే గురించి భయం పట్టుకుంది చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కు. వుహాన్‌లో కరోనా వైరస్ ఎఫెక్ట్ ప్రారంభం కాగానే ఆయన తన కూతుర్ని అమెరికా పంపించారని సమాచారం. బీజింగ్ కంటే అమెరికా సేఫ్ అని ఆయన భావించి ఉండవచ్చు. వాస్తవానికి జిన్‌పింగ్‌కు జి మింగ్జే ఒక్కగానొక్క కూతురు. జిన్‌పింగ్‌కు ఆమె అంటే అమితమైన ప్రేమ. తన ఆశలన్నీ ఆమెపైనే ఉన్నాయి.

జీ మింగ్జే (Twitter Photo)


జి మింగ్జే తన డిగ్రీని అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలోనే పూర్తి చేసింది. 2010లో అమెరికాకు వెళ్లి 2014 వరకు అక్కడే చదువుకుంది. ఆ సమయంలో ఆమె జిన్‌పింగ్ కూతురు అని ఎవ్వరికీ తెలీదు. చైనాకు చెందిన రాజకీయ నాయకుడి కూతుర్ని అని మింగ్జే చెప్పుకుంది. ఆ తర్వాత స్వదేశానికి తిరిగి వెళ్లింది. తాజాగా 2019లో మసాచుసెట్స్‌లోని ఓ కాలేజీలో ఉన్నత చదువుల కోసం ఎన్‌రోల్ చేసుకుంది. దీని దృష్ట్యా కరోనా వైరస్ విజృంభించగానే తన కూతుర్ని ఆయన యూఎస్ పంపించేశాడు.

కూతురితో జిన్‌పింగ్ (File) (Twitter Photo)


అయితే, ఇప్పుడు అమెరికా చైనా సంబంధాలు అంత బాగోలేదని తెలిసిందే. మింగ్జే ఇప్పుడు అమెరికాలో ఉన్న తరుణంలో ఇలాంటి సంబంధాలు ఆమెపై ప్రభావం చూపుతాయేమోనని జిన్‌పింగ్ భయపడుతున్నట్లు తెలుస్తోంది. అదీకాక.. ఇప్పుడామె అందరికీ సుపరిచితురాలు.
Published by: Shravan Kumar Bommakanti
First published: April 29, 2020, 6:47 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading