Home /News /international /

CHINA PRESIDENT XI JINPING DAUGHTER XI MINGZE LIVING IN AMERICA SAYS US SENATOR HARTZLER PVN

Xi jinping : చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కు రెండో భార్య..అమెరికాలో కూతురు!

జిన్ పింగ్,కూతురు జి మింగ్జే(ఫైల్ ఫొటో)

జిన్ పింగ్,కూతురు జి మింగ్జే(ఫైల్ ఫొటో)

Xi jinping Daughter In USA : US సెనేటర్ బిల్లు... "చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ యొక్క నేషనల్ కాంగ్రెస్‌ లో పనిచేస్తున్న వ్యక్తులు మరియు వారి కుటుంబ సభ్యులు.. విద్యార్థి లేదా పరిశోధన వీసాలు పొందకుండా" నిషేధిస్తుంది. అయితే రీసెర్చ్ విద్యార్థిగా జి మింగ్జే

ఇంకా చదవండి ...
Xi Jinping's Daughter Xi Mingze : ఆర్థిక, సైనిక, రాజకీయ బలాల పరంగా ప్రపంచంలోనే టాప్-2 అగ్రదేశాలు అమెరికా, చైనా అన్న విషయం తెలిసిందే. అయితే ప్రపంచంలో రెండవ అత్యంత శక్తివంతమైన దేశంగా ఉన్న చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ ఏకైక కూతురు జి మింగ్జే ప్ర‌స్తుతం అమెరికాలో నివ‌సిస్తున్నార‌ంట‌. చైనా క‌మ్యూనిస్టు పార్టీ చ‌ట్టం నుంచి ఉన్న‌త విద్య‌ను ప‌రిర‌క్షిస్తున్న‌ట్లు జి మింగ్జే చెప్పేవారంట. అమెరికా కాంగ్రెస్ సెనెట‌ర్ వికీ హార్ట్జ్‌ల‌ర్ ఈ విషయాన్ని బయటపెట్టారు. ఆదివారం అమెరికాలో నివ‌సిస్తున్న‌ ఓ చైనీస్ కరంట్ అఫైర్స్ కామెంటేట‌ర్ ప్రారంభించిన యూ-ట్యూబ్ చానెల్‌ కు హార్ట్జ్‌ల‌ర్ ఈ విషయాన్ని చెప్పాడు. జీ మెంగ్జీ.. జిన్‌ పింగ్‌కు, ఆయ‌న‌ ద్వితీయ భార్య, ప్ర‌సిద్ధ జాన‌ప‌ద గాయ‌కురాలు పెంగ్ లియువాన్‌ కు జ‌న్మించిన కూతురని సమాచారం.

జిన్‌పింగ్‌,కు జి మింగ్జే ఒక్కగానొక్క కూతురు. జిన్‌పింగ్‌కు ఆమె అంటే అమితమైన ప్రేమ. తన ఆశలన్నీ ఆమెపైనే ఉన్నాయి. 1992 జూన్ 27న జ‌న్మించిన జి మింగ్జే హ్యాంగ్‌ జౌ ఫారిన్ లాంగ్వేజెస్ స్కూ ల్‌లో ఫ్రెంచ్ అభ్య‌సించారు. 2010లో అమెరికా వెళ్లిన జి మింగ్జే తన డిగ్రీని అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలోనే పూర్తి చేసింది. 2010లో అమెరికాకు వెళ్లి 2014 వరకు అక్కడే చదువుకుంది. ఆ సమయంలో ఆమె జిన్‌పింగ్ కూతురు అని ఎవ్వరికీ తెలీదు. చైనాకు చెందిన రాజకీయ నాయకుడి కూతుర్ని అని మింగ్జే చెప్పుకుంది. ఆ తర్వాత స్వదేశానికి తిరిగి వెళ్లింది. చైనాలో 5 సంవత్సరాలు నివసించిన తర్వాత జిన్ పింగ్ కుమార్తె అమెరికాకు తిరిగి వచ్చిందని 2019లో తాను చెప్పినట్లు ఆ కామెంటేటర్ తాజాగా గుర్తుచేశారు.

ALSO READ NSE Chitra Ramakrishna : తెరవెనుక ఉండి స్టాక్ మార్కెట్ ను నడిపించిన హిమాలయ బాబా అతడే!

US సెనేటర్ బిల్లు... "చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ యొక్క నేషనల్ కాంగ్రెస్‌ లో పనిచేస్తున్న వ్యక్తులు మరియు వారి కుటుంబ సభ్యులు.. విద్యార్థి లేదా పరిశోధన వీసాలు పొందకుండా" నిషేధిస్తుంది. అయితే రీసెర్చ్ విద్యార్థిగా జి మింగ్జే ప్ర‌స్తుతం కేంబ్రిడ్జి ప్రాంతంలోనే నివ‌సిస్తున్నార‌ని ఆ కామెంటేట‌ర్ చెప్పారు. కాగా,గతంలో చైనా జాతీయుడైన వెబ్‌సైట్ టెక్నీషియ‌న్.. జీ జిన్‌పింగ్ కూతురు వ్య‌క్తిగ‌త స‌మాచారం లీక్ చేసినందుకు 14 ఏండ్ల జైలుశిక్షకు గుర‌ైన విషయం తెలిసిందే.
Published by:Venkaiah Naidu
First published:

Tags: China, US-China, Xi Jinping, Younger daughter

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు