CHINA PRAISES INDIA FOR HELPING SRI LANKA DEAL WITH ECONOMIC CRISIS PVN
China Praises India : భారత్ పై చైనా ప్రశంసలు..ఇండియాతో కలిసి పనిచేస్తామన్న చైనా
ప్రతీకాత్మక చిత్రం (Image:Istock)
China Praises India :భారత్‌పై చైనా ప్రశంసలు గుప్పించింది. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి చరిత్రలో కనీవినీ ఎరుగని సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంకకు సహాయం చేయడంలో భారత్ ఎంతో కృషి చేసిందంటూ చైనా ప్రశంసలు కురిపించింది.
China Praises India :భారత్‌పై చైనా(India-China) ప్రశంసలు గుప్పించింది. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి చరిత్రలో కనీవినీ ఎరుగని సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంక(Sri Lanka)కు సహాయం చేయడంలో భారత్ ఎంతో కృషి చేసిందంటూ చైనా ప్రశంసలు కురిపించింది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జావో లిజియాన్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ... సంక్షోభ సమయంలో శ్రీలంకకు భారత్(India) చేస్తున్న సహాయ ప్రయత్నాలు ప్రశంసనీయమని అన్నారు. "శ్రీలంక విషయంలో భారత ప్రభుత్వం చాలా చేసిందని మేం గమనించాం. ఆ ప్రయత్నాలను మేం అభినందిస్తున్నాం. శ్రీలంక, ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలు వీలైనంత తర్వగా కష్టాల నుంచి బయటపడేందుకు సహాయం చేయడానికి భారతదేశం, ఇతర అంతర్జాతీయ సమాజంతో కలిసి పనిచేయడానికి చైనా సిద్ధంగా జావో లిజియన్ అన్నారు.
కాగా, దుర్భర పరిస్థితుల్లో చైనా(China) నుంచి ఆశించిన మద్దతను పొందలేకపోతున్నామని ఇటీవల శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సప్రస్తావించారు. అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స.."గతంలో మాదిరిగా చైనా ఈ ప్రాంతంపై ఆసక్తి చూపడం లేదు. వారి వ్యూహాత్మక దృష్టి దక్షిణాసియా నుంచి ఆగ్నేయాసియా దేశాలైన ఫిలిప్పైన్స్, వియత్నాం, కాంబోడియాతోపాటు ఆఫ్రికా దేశాల వైపు మళ్లించిందని అనుకుంటున్నాను. పాకిస్తాన్‌పైనా చైనా ఆసక్తి తగ్గిందని భావిస్తున్నా"అని అన్నారు. అయితే శ్రీలంక అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలను ఖండించిన చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జావో లిజియాన్ .. అటువంటిదేమీ లేదని వ్యాఖ్యానించారు. దక్షిణాసియా తమకు ప్రాధాన్యత కలిగిన ప్రాంతమేనని స్పష్టం చేశారు. చైనా ప్రభుత్వం తమ వంతు కృషి చేస్తుందని, శ్రీలంక సమాజానికి సహాయం అందించడానికి అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగిస్తుందని చెప్పారు.
శ్రీలంక(Sri Lanka), పాకిస్తాన్(Pakistan) దేశాల్లో చైనా భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టడంతోపాటు ఆ రెండు దేశాలకు భారీ మొత్తాల్లో రుణాలు అందించిన విషయం తెలిసిందే. దాదాపు 8 నుంచి 10వేల బిలియన్ డాలర్లను పెట్టుబడులు, రుణాల రూపంలో చైనా నుంచి శ్రీలంక తీసుకుంది. మరోవైపు పాకిస్థాన్‌లోనూ చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ పేరిట భారీ ప్రాజెక్టును చైనా చేపడుతోన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఆ రెండు దేశాలు తీవ్ర సంక్షోభాలు ఎదుర్కొంటున్న సమయంలో మాత్రం చైనా వారివైపు చూడడం లేదన్న విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.