హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Plane Crash: ఘోర విమాన ప్రమాదం.. 133 మంది ప్రయాణికులతో పర్వతాల్లో కుప్పకూలిన బోయింగ్ .. బూడిదేనా?

Plane Crash: ఘోర విమాన ప్రమాదం.. 133 మంది ప్రయాణికులతో పర్వతాల్లో కుప్పకూలిన బోయింగ్ .. బూడిదేనా?

పర్వతాల్లో కుప్పకూలిన విమానం ఇదే

పర్వతాల్లో కుప్పకూలిన విమానం ఇదే

పౌర విమానయాన చరిత్రలో మరో ఘోర ప్రమాదం నమోదైంది. నైరుతి చైనాలో 133 మందితో ప్రయాణిస్తోన్న బోయింగ్ విమాంనం పర్వతాల్లోకి కుప్పకూలింది. పూర్తి వివరాలివే..

పౌర విమానయాన చరిత్రలో మరో ఘోర ప్రమాదం నమోదైంది. నైరుతి చైనాలో 133 మందితో ప్రయాణిస్తోన్న బోయింగ్ విమాంనం పర్వతాల్లోకి కుప్పకూలింది. ఒక్కసారిగా విమానం నేల కూలడంతో భారీగా మంటలు చెలరేగాయి. అవికాస్తా అడవంతా వ్యాపించి అడవి మటలుగా మారాయి. దీంతో బాధితుల రెస్క్యూ కష్టంగా మారింది. సోమవారం మధ్యాహ్నం 1గంట తర్వాత ఈ ఘటన చోటుచేసుకున్నట్లు చైనా అధికారిక మీడియా వెల్లడించింది.

నైరుతి చైనాలోని గ్వాంగ్జి ప్రావిన్స్ లో ఇవాళ మధ్యాహ్నం ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్ సంస్థకు చెందిన బోయింగ్ - 737 విమానం వుజా గ్రామ సమీపంలోని కొండల్లో కుప్పకూలిపోయింది. ప్రమాద సమయంలో విమానంలో 133 మంది ఉన్నాయి. 129 మంది ప్రయాణికులు, 9 మంది సిబ్బంది. విమానం కూలిన ప్రాంతంలో భారీ మంటలు చెలరేగాయి. అవి మెల్లగా విస్తరిస్తూ అటవీప్రాంతమంతటా వ్యాపించాయి. ఎత్తైన కొండలు, పైగా రాకాసి మంటల నడుమ విమాన ప్రయాణ బాధితులను గాలించడం రెస్క్యూ సిబ్బందికి సవాలుగా మారింది.

Rajya Sabhaకు AAP భల్లే ఎంపిక: హర్భజన్ సింగ్ ఇక ఎంపీ.. పెద్దలసభలో చిన్నోడు రాఘవ్ చద్దా.. పూర్తి జాబితా ఇదే

చైనా ఈస్టర్న్ ఎయిర్ లైన్స్ ( ఫ్లైట్ నంబర్ MU5735) సోమవారం మధ్యాహ్నం 1:00 (0500 GMT) గంటలకు కున్మింగ్ నగరం నుంచి గయాంఝా నగరానికి బయలుదేరింది. నిర్దేశిత గమ్యాన్ని చేరకముందే విమానం కుప్పకూలింది. క్షేత్రస్థాయిలో కనిపిస్తోన్న దృశ్యాలను బట్టి ప్రయాణికులు ప్రాణాలతో బయటపడటం అసాధ్యమేనని, కార్చిచ్చు కారణంగా అక్కడంతా బూడిదయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కానీ సహాయక సిబ్బంది మాత్రం ప్రాణాలకు తెగించి మంటలతో పోరాడుతూ ఘటనస్థలికి చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా,

ప్రమాదానికి గురైన చైనా ఈస్టర్న్ ఎయిర్ లైన్స్ బోయింగ్ 737 ఇదే..

Petrol Diesel Price: లీటర్‌ డీజిల్‌పై రూ.25 పెంపు.. బల్క్‌ యూజర్లపై భారీ బాదుడు..

అమెరికాకు చెందిన ప్రఖ్యాత బోయింగ్ సంస్థ తయారు చేసిన భారీ విమానం ఘోర ప్రమాదానికి గురికావడం ఇది నాలుగోసారి. గతంలో బోయింగ్ విమాన ప్రమాదాల్లో మరణాల సంఖ్య కూడా భారీగానే ఉంది.  బోయింగ్ విమానాల్లో సాంకేతిక లోపాల వల్లే గత ప్రమాదాలు తలెత్తినట్లు తేలడంతో కొన్నేళ్ల కిందట ఆ సంస్థ విమానాలను కొద్ది రోజులపాటు పూర్తిగా నిలిపేశారు. సాంకేతికత, పైలట్లకు శిక్షణ తర్వాత మళ్లీ బోయింగ్ భారీ విమానాలు గాల్లోకి ఎగిరాయి. తాజా ఘటన మరోసారి బోయింగ్ సర్వీసుల వైఫల్యాన్ని ఎత్తిచూపినట్లయిందనే కామెంట్లు వస్తున్నాయి..

First published:

Tags: Boeing, China, Flight, Plane Crash

ఉత్తమ కథలు