అంతర్జాతీయంగా అమెరికా-చైనాల మధ్య ఇంకా మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. కరోనా మూలాలు చైనాలోనే ఉన్నాయని అమెరికా వాదన. అవి కూడా చైనా ల్యాబ్ నుంచే వచ్చాయనేది అమెరికా (America) అనుమానం. దీనిపై దర్యాప్తు చేయాలని.. అందు కోసం అంతర్జాతీయ బృందం చైనా (China) పర్యటించాలని అమెరికా కోరుతోంది. ఇందుకు చైనా సహకరించాలని పేర్కొంది. దీనిపై చైనా మండి పడింది. అమెరికా తప్పడు నివేదికలు చెబుతుందని తమపై దాడులు మానుకోవాలని అంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) ఆధ్వ ర్యంలో మరోసారి దర్యాప్తునకు అంతర్జాతీయ నిపుణుల బృందం సిద్ధమవుతోన్న వేళ చైనా ఈ వ్యాఖ్యలు చేసింది. ఇది అమెరికా దురుద్దేశ పూర్వకంగా చేస్తున్న పనే అని తిరిగి వాదిస్తోంది.
అమెరికా తాజా వాదనపై చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి వాంగ్‌వెన్‌బిన్ మాట్లాడారు. కొవిడ్ మూలాలపై ఆగస్టులో విడుదలైన నివేదికను చైనా వ్యతిరేకించిందని అన్నారు.
International Travel : తొలగుతున్న ఆంక్షలు.. ఇక పెరగునున్న అంతర్జాతీయ ప్రయాణాలు
ఆ నివేదిక ఎన్ని సార్లు ప్రచురితమైనా, వాటిని మార్పు లు చేసి ఎన్ని రకాల కట్టుకథలు అల్లినా.. అమెరికా తప్పుడు స్వభావం అర్థమవతుందని అన్నారు. కొవిడ్ మూలాలను గుర్తించే పేరుతో అమెరికా నిఘా విభాగం చేసిన ప్రయత్నాలను ఆయన తప్పు పట్టారు. అమెరికా ఇలా చైనాపై దాడులు చేయడం సరికాదన్నారు. తమను దోషులను చేసే ప్రయత్నాలను విరమించుకోవాలని సూచించారు.
అమెరికా వాదన ఏమిటీ?
కరోనా కారణంగా అంతర్జాతీయ (International) సమాజం ఎంతో ఇబ్బంది పడింది. కరోనా మూలాలు చైనాలోనే ఉన్నాయని అమెరికా వాదనా ఈ వ్యాధి జంతువుల నుంచి మనుషులకు సోకిందా లేదా ల్యాబ్ నుంచి లీకయ్యిందా అనేది నిగ్గుతేలాలని అమెరికా వాదిస్తోంది. అంతర్జాతీయ బృందం చైనాలో పర్యటించి ఈ విషయాలు తేల్చాని అమెరికా కోరుతుంది. ఇటీవలే కొవిడ్ (Covid 19) మూలాలపై 90రోజుల్లో నివేదిక ఇవ్వా లంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (US President Joe Biden) అక్కడి నిఘా విభాగాన్ని ఆదేశించారు. దీనిపై ఇప్పటికే నిఘా విభాగం నివేదిక రూపిందించి. ఈ నివేదికలో కోవిడ్ మూలలాపై ఎటువంటి సమాచారం లేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయం బృందం చైనాలో పర్యటించేలా అమెరికా పావులు కదుపుతోంది. దీనికి చైనా ససేమిరా అంటూ ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: America, China, Corona, United states, WHO