కశ్మీర్ అంశం.. ఐక్యరాజ్యసమితిలో చైనా, పాక్‌కు షాక్..

ఐక్యరాజ్యసమితిలో చైనా, పాకిస్తాన్‌ భంగపాటుకు గురయ్యాయి. చైనా మద్దతుతో కశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో చర్చించేందుకు పాక్ చేసిన ప్రయత్నం మరోసారి బెడిసికొట్టింది.

news18-telugu
Updated: January 16, 2020, 12:31 PM IST
కశ్మీర్ అంశం.. ఐక్యరాజ్యసమితిలో చైనా, పాక్‌కు షాక్..
ఇమ్రాన్ ఖాన్, నరేంద్ర మోదీ (ఫైల్)
  • Share this:
ఐక్యరాజ్యసమితిలో చైనా, పాకిస్తాన్‌ భంగపాటుకు గురయ్యాయి. చైనా మద్దతుతో కశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో చర్చించేందుకు పాక్ చేసిన ప్రయత్నం మరోసారి బెడిసికొట్టింది. ఆఫ్రికాకు చెందిన ఓ అంశంపై బుధవారం నాడు రహస్య సమావేశానికి యూఎన్‌ఎస్సీ పిలుపునిచ్చింది. అయితే కశ్మీర్ అంశాన్ని కూడా ఈ సమవేశ అజెండాలో చేర్చాలని చైనా కోరగా, మెజారిటీ సభ్యదేశాలు నిరాకరించాయి. కశ్మీర్ అంశం పూర్తిగా భారత్-పాక్ ద్వైపాక్షిక అంశమని సభ్య దేశాలు తేల్చి చెప్పాయి. కాగా, పాక్ ప్రయత్నంపై ఇండియా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి ప్రయత్నాలు మానుకొని, ఉద్రవాదుల ఆశ్రయం వంటి కీలక అంశాలపై దృష్టి సారించాలని హితవు పలికింది.

ఐక్యరాజ్యసమితిలో తప్పుడు ప్రతిపాదనలను చేర్చాలని చూసిన చైనా, పాక్‌కు మన మిత్రదేశాలు దీటైన జవాబిచ్చాయని యూఎన్‌లో భారత శాశ్వత ప్రతినిధి సైయద్ అక్బరుద్దీన్ మీడియాకు తెలిపారు. పాక్ కుయుక్తులు చెల్లలేదని స్పష్టం చేశారు.

First published: January 16, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>