ఇండియాని చైనా బ్లాక్‌మెయిల్ చేస్తోందా? డ్రాగన్ వేస్తున్న ఎత్తుగడ ఏంటి?

India Vs China : భారత్‌ను చైనా బ్లాక్‌మెయిల్ చేస్తోందన్న ప్రకటన ఒకటి ఇప్పుడు అమెరికా నుంచీ భారత్, చైనా వరకూ కలకలం రేపుతోంది. చైనా మాత్రం ఈ ఆరోపణలను ఖండించింది.

Krishna Kumar N | news18-telugu
Updated: August 8, 2019, 7:24 AM IST
ఇండియాని చైనా బ్లాక్‌మెయిల్ చేస్తోందా? డ్రాగన్ వేస్తున్న ఎత్తుగడ ఏంటి?
ప్రతీకాత్మక చిత్రం (Image : Reuters)
Krishna Kumar N | news18-telugu
Updated: August 8, 2019, 7:24 AM IST
అమెరికా కాంగ్రెస్‌ సభ్యుడైన జిమ్ బ్యాంక్... ఓ సంచలన ప్రకటన చేశారు. అదేంటంటే... చైనాకు చెందిన కంపెనీ హువావేని అడ్డం పెట్టుకొని... చైనా... ఇండియాని బ్లాక్ మెయిల్ చేస్తోందని ఆయన అన్నారు. ఇదెలా అంటే... హువావే దగ్గర గూఢచర్యం చేయగలిగే టెక్నాలజీ ఉందనీ... భారత్ గనక తాను చెప్పినట్లు వినకపోతే... హువావే ద్వారా... చైనా... గూఢచర్యానికి పాల్పడగలదన్నది ఆయన ఆరోపణ. హువావేకి చెందిన 5జీ టెక్నాలజీ పరికరాల్ని భారత్ వాడుకోవాలని చైనా బ్లాక్ మెయిల్ చేస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఆరోపణలను చైనా సున్నితంగా తిరస్కరించింది. నిజానికి భారత్‌లో హువావే తన 5జీ టెక్నాలజీకి సంబంధించి ట్రయల్స్ నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలని చైనా కోరింది. దీనిపై భారత ప్రభుత్వం స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. ఇదే విషయంలో బ్లాక్‌మెయిల్ జరుగుతోందని జిమ్ బ్యాంక్ అంటున్నారు.


చైనా బెదిరింపులు ఇండియా దగ్గర పనిచెయ్యవన్న జిమ్ బ్యాంక్... ఈ విషయం చైనా పెద్దలకు కూడా తెలుసన్నారు. ప్రపంచంలో టెలికం పరికరాల తయారీ, మార్కెటింగ్‌లో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్న హువావే... స్మార్ట్ ఫోన్ల తయారీలో రెండో స్థానంలో ఉంది. ఈ పరిస్థితుల్లో హువావేపై ఆరోపణలు చేస్తూ ఆమెరికా... ఆ సంస్థ టెలికం పరికరాల్ని నిషేధించింది. ప్రపంచ దేశాలన్నీ తమలాగే ఆంక్షలు విధించాలని డిమాండ్ చేస్తోంది.4జీ కంటే 5జీ టెక్నాలజీ చాలా పవర్‌ఫుల్. 5జీ వల్ల డౌన్‌లోడ్ వేగం 10 రెట్లు పెరుగుతుంది. పది నిమిషాల్లో డౌన్‌లోడ్ అయ్యే వీడియో... ఒక్క నిమిషంలో డౌన్‌లోడ్ అయిపోతుంది. ఐతే... ఈ టెక్నాలజీలో చైనా భాగస్వామ్యం ఉండకూడదని అమెరికా కోరుకుంటోంది. ఇదే సమయంలో... 5జీ నెట్‌వర్క్ విషయంలో ఇతర దేశాలపై ఆధారపడకుండా... సొంత వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటామని కేంద్ర సమాచార శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్... మొన్ననే ప్రకటించారు. అందువల్ల చైనా ఆఫర్‌ను భారత్ తిరస్కరిస్తుందని అనుకోవచ్చు.
First published: August 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...