హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Spy Balloon: భారత్‌‌ను చైనా టార్గెట్‌ చేసిందా? స్పై బెలూన్‌పై అమెరికా మీడియా ఏమంటోంది?

Spy Balloon: భారత్‌‌ను చైనా టార్గెట్‌ చేసిందా? స్పై బెలూన్‌పై అమెరికా మీడియా ఏమంటోంది?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అమెరికా గగనతలంపై చైనాకు చెందిన స్పై బెలూన్ విహరించడం ఇటీవల సంచలనంగా మారింది. అమెరికాకు సంబంధించిన మిలటరీ రహస్యాలను ఈ స్పై బెలూన్ ద్వారా చైనా తెలుసుకుంటోందని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అయితే, తాజాగా మరో విషయం కలకలం రేపుతోంది. చైనా భారత్‌పై కూడా ఏనాటి నుంచో ఇలా స్పై బెలూన్లను ఉపయోగిస్తోందని అగ్రరాజ్య పత్రికల కథనాలు వెల్లడించాయి.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

అమెరికా గగనతలంపై చైనాకు చెందిన స్పై బెలూన్ విహరించడం ఇటీవల సంచలనంగా మారింది. అమెరికాకు సంబంధించిన మిలటరీ రహస్యాలను ఈ స్పై బెలూన్ ద్వారా చైనా తెలుసుకుంటోందని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అయితే, తాజాగా మరో విషయం కలకలం రేపుతోంది. చైనా అమెరికాను మాత్రమే టార్గెట్ చేయలేదట. భారత్‌పై కూడా ఏనాటి నుంచో ఇలా స్పై బెలూన్లను ఉపయోగిస్తోందని అగ్రరాజ్య పత్రికలు సంచలన కథనాలు వెల్లడించాయి. ఇండియాతో పాటు మరిన్ని దేశాలపై చైనా కన్నేసిందని కథనాల్లో పేర్కొన్నాయి.

* మిలటరీ స్థావరాలపై కన్ను

అమెరికాలోని మిలటరీ స్థావరాలు ఉన్న ప్రాంతాల్లో ఈ స్పై బెలూన్‌ని చైనా ప్రయోగించింది. సైన్యంలోని మిలటరీ బేస్‌లలో ఉన్న ఆయుధాలు, రక్షణ పరికరాల గురించి ఈ స్పై బెలూన్ చైనాకు ఎప్పటికప్పుడు చేరవేస్తోందనే అనుమానాలు ఉన్నాయి. దీంతో అమెరికా ఆ బెలూన్‌ని కూల్చేసింది. ఇది అట్లాంటిక్ మహాసముద్రంలో పడిపోయింది. ఈ బెలూన్ గురించి పూర్తిగా తెలుసుకోవడానికి సముద్రంలో అన్వేషణ చేపట్టింది. సముద్రపు డ్రోన్లు, ప్రత్యేక సర్వేలియన్స్ బోట్లను అమెరికా ఉపయోగిస్తోంది. ఈ క్రమంలోనే అమెరికా పత్రికలు ఇతర దేశాలకు హెచ్చరికలు చేయడం కలకలం రేపింది. భారత్‌తో పాటు జపాన్ సహా మరో 40 దేశాలు, 5 ఖండాలపై చైనా ఈ కుయుక్తులకు పాల్పడుతోందని పేర్కొన్నాయి.

* అలర్ట్ చేసిన అమెరికా

చైనా స్పై బెలూన్ వ్యవహారంపై అమెరికా డిప్యూటీ సెక్రటరీ వెండీ షెర్మన్ కూడా తగు సూచనలు చేసినట్లు ‘వాషింగ్టన్ పోస్ట్’ కథనం పేర్కొంది. 40 దేశాల ఎంబెస్సీ ప్రతినిధులను పిలిపించుకుని చైనా స్పై బెలూన్ గురించి వివరించారట. అయితే, భారత మిలిటరీ స్థావరాలపై చైనా స్పై బెలూన్ నిఘా పెట్టినట్లు ఇప్పటివరకు అధికారికంగా ధ్రువీకరణ కాలేదు. దీనిపై భారత సైన్యం కూడా స్పందించలేదు. అయితే, గత కొన్నేళ్లుగా చైనా ఈ కుయుక్తులకు పాల్పడుతోందని అమెరికా చెప్పడం గమనార్హం.

* చైనా ఆధ్వర్యంలోనే..!

స్పై బెలూన్‌ని చైనాలోని హైవాన్ ప్రావిన్సు నుంచి చాలా ఏళ్లుగా ఆపరేట్ చేస్తున్నట్లు పేర్కొంది. ఈ తతంగమంతా చైనా అధికారిక పార్టీ.. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా(PRC) ఆధ్వర్యంలో జరుగుతోందని అనుమానం వ్యక్తం చేసింది. అమెరికానే కాకుండా ఐదు ఖండాల్లో ఇలాంటి స్పై బెలూన్లను గుర్తించినట్లు కథనం తెలిపింది. ఇవన్నీ పీపుల్ లిబరేషన్ ఆర్మీ(చైనా సైన్యం) నడిపిస్తోందని పేర్కొనడం గమనార్హం. ఇటీవల సంవత్సరాల్లో అమెరికాలోని హవాలి, ఫ్లోరిడా, టెక్సాస్, గువమ్ ప్రాంతాల్లో 4 స్పై బెలూన్లను గుర్తించినట్లు తెలిసింది. ఇందులో మూడు ఘటనలు ట్రంప్ పాలనా సమయంలోనే జరిగినట్లు తెలిపింది.

Man Digs: రెండు రోజులుగా ఆ ఒక్కడే శిథిలాలు తవ్వుతున్నాడు! హృదయాలను మెలిపెడుతున్న శవాల గుట్టలు

భూమిపై విచిత్రమైన ప్రదేశం.. మహిళలకు ప్రత్యేకం.. గిన్నీస్ బుక్‌లో రికార్డ్ నమోదు

* దొరికిన స్పై బెలూన్

మరోవైపు, ఎట్టకేలకు చైనా స్పై బెలూన్‌ని అమెరికా దళాలు గుర్తించాయని పెంటగాన్ వెల్లడించింది. ఈ మేరకు స్పై బెలూన్‌కి సంబంధించిన చిత్రాలను విడుదల చేసింది. అమెరికా, చైనా మధ్య సంబంధాలు బలపరుచుకుంటున్న సమయంలోనే ఈ స్పై బెలూన్ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.

First published:

Tags: America, China, India

ఉత్తమ కథలు