China New Rules: చైనాలో కొత్త నిబంధనలు.. ఇకపై అలాంటివి కనిపించవు.. ఎందుకంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రపంచంలోనే అతి ఎత్తైన భవనాలు ఉన్న దేశంగా చైనా గుర్తింపు తెచ్చుకుంది. 632 మీటర్ల పొడవైన షాంఘై టవర్‌తో సహా ప్రపంచంలోని చాలా ఎత్తైన భవనాలు చైనాలోనే ఉన్నాయి. అయితే ఇకపై కొత్తగా ఆకాశాన్ని తాకే అత్యంత ఎత్తైన భవనాలు చైనాలో కనిపించవని స్పష్టమవుతోంది.

  • Share this:
ప్రపంచంలోనే అతి ఎత్తైన భవనాలు ఉన్న దేశంగా చైనా గుర్తింపు తెచ్చుకుంది. 632 మీటర్ల పొడవైన షాంఘై టవర్‌తో సహా ప్రపంచంలోని చాలా ఎత్తైన భవనాలు చైనాలోనే ఉన్నాయి. అయితే ఇకపై కొత్తగా ఆకాశాన్ని తాకే అత్యంత ఎత్తైన భవనాలు చైనాలో కనిపించవని స్పష్టమవుతోంది. ఇందుకు కారణం అక్కడి ప్రభుత్వం ఎత్తైన భవనాల(skyscrapers) నిర్మాణాలపై కఠిన రూల్స్ తీసుకురావడమే! ఇటీవల కాలంలో చైనా ప్రభుత్వం తీసుకొస్తున్న నియమ నిబంధనలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఇది భవన నిర్మాణాలపై తెచ్చిన రూల్స్ కూడా ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి.

వృథా ప్రాజెక్టులపై అణచివేతలో భాగంగా చిన్న నగరాల్లో ఇకపై ఆకాశహర్మ్యాలను నిర్మించకూడదని చైనా(China) కొత్త నియమాలను తీసుకొచ్చింది. వానిటీ ప్రాజెక్టులపై అణిచివేతలో భాగంగా చిన్న నగరాల్లో అత్యంత ఎత్తైన ఆకాశహర్మ్యాల నిర్మాణాలను పరిమితం చేయనుంది చైనా ప్రభుత్వం. ఈ మేరకు స్థానిక ప్రభుత్వాలు ఎత్తైన ఆకాశహర్మ్యాలను నిర్మించకూడదంటూ హౌసింగ్, పట్టణ-గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. ప్రత్యేక ఆమోదం పొందకుండా 3 మిలియన్ల కంటే తక్కువ జనాభా ఉన్న నగరాలు 150 మీటర్ల (492.13 అడుగుల) కంటే ఎక్కువ ఎత్తైన ఆకాశహర్మ్యాలను నిర్మించకూడదు. 3 మిలియన్ల కంటే అధిక జనాభా గల నగరాలు 250 మీటర్ల కంటే ఎత్తైన భవనాలను(Buildings) నిర్మించకూడదని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు..
చైనీస్ సోషల్ మీడియా సైట్ వీబోలో చాలా మంది ఎత్తయిన ఆకాశహర్మ్యాలు అవసరం లేదని.. అవి ఎవరికీ ఉపయోగపడవని పేర్కొన్నారు. దాంతో చైనా ప్రభుత్వం నిర్మాణాలపై ఆంక్షలను ప్రకటించింది. నగరాలు కిక్కిరిసిన భవనాలతో నిండిపోకూడదంటే భవనాలు నిర్మించాల్సిన అవసరం ఉందని స్థానిక నగరపాలక సంస్థలు ప్రభుత్వానికి విన్నవించుకున్నాయి.అయితే ఈ నిర్మాణాలు డాంబికం చూపించడానికి కట్టినవే తప్ప ప్రజలకు ఉపయోగపడవని చైనా స్పష్టం చేసింది. మూడు మిలియన్ల కంటే తక్కువ పట్టణ జనాభా(Population) గల నగరాలు 150 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తయిన భవనాలు నిర్మించాలనుకుంటే ప్రత్యేక మినహాయింపులు కోరాల్సి ఉంటుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

అయితే చిన్న నగరాలు 250 మీటర్ల కంటే ఎత్తైన భవనాలను నిర్మించడానికి ఎట్టి పరిస్థితులలోనూ అనుమతి ఇవ్వమని పేర్కొంది. మూడు మిలియన్ల కంటే ఎక్కువ జనాభా గల నగరాలు 250 మీటర్ల కంటే ఎత్తైన భవనాలు నిర్మించుకోవడానికి అనుమతి ఇస్తామని వివరించింది. అది కూడా అత్యంత అవసరమైతేనే నిర్మాణాలకు అంగీకరిస్తామని.. అలాంటి పరిస్థితులలో ఆకాశహర్మ్యాన్ని నిర్మించడానికి దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది.

Etela Rajendar: పిచ్చి పట్టిందా హరీశ్ ?.. దానితో నాకేం సంబంధం.. మండిపడ్డ ఈటల రాజేందర్

Revanth Reddy ముందస్తు వ్యూహం.. KCR ప్లాన్‌కు కౌంటర్.. Congress హైకమాండ్ ఓకే చెబుతుందా ?

వాస్తవానికి చైనా ప్రభుత్వం ఇప్పటికే దేశవ్యాప్తంగా ఏ ప్రాంతంలోనూ 500 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తయిన భవనాలను నిర్మించకూడదని కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. అసహ్యంగా ఉండే ఆర్కిటెక్చర్ తో భవనాలు కూడా నిర్మించకూడదు అని హుకుం జారీ చేసింది. తాజాగా మరోసారి భవనాలపై ఇంకాస్త కఠినమైన రూల్స్ ప్రకటించింది. ఈ కొత్త నియమాలను ఎవరైతే ఉల్లంఘించి భారీ ప్రాజెక్ట్‌లను ఆమోదిస్తారో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
Published by:Kishore Akkaladevi
First published: