CHINA GETTING READY TO TIES WITH TALIBANS WHO CAPTURED AFGHANISTAN AK
China-Talibans: చైనా వక్రబుద్ధి.. తాలిబన్లతో స్నేహానికి అప్పుడే తహతహ..
తాలిబన్లు, జిన్‌పింగ్ (ఫైల్ ఫోటో)
China Ties With Talibans: కాబూల్‌లో చైనా రాయబార కార్యాలయం యథాతథంగా పని చేస్తుందని అక్కడి అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఆఫ్ఘనిస్థాన్‌లోని తమ పౌరులు వెనక్కి వచ్చేయాలని చైనా నెల నుంచే సూచనలు జారీ చేస్తూ వచ్చింది.
ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయింది. అమెరికా సేనలు ఆ దేశాన్ని వీడి వెళ్లిపోవడంతో... తాలిబన్లు మళ్లీ ఆఫ్ఘన్‌ను తమ చేతుల్లోకి తీసుకున్నారు. దేశానికి వారికి అప్పగిస్తూ.. దేశాధ్యక్షుడు ఘనీ దేశం విడిచి వెళ్లిపోయారు. ఆఫ్ఘనిస్థాన్ మళ్లీ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోవడంతో.. ఆ దేశంతో ఏ రకంగా వ్యవహరించాలనే అంశంపై ఇంకా ఏ దేశం ఓ నిర్ణయానికి రాలేదు. అయితే ఈ విషయంలో అప్పుడు చైనా తన వక్రబుద్ధిని ప్రదర్శించింది. తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్న తరువాత కూడా ఆ దేశంలో స్నేహ, పరస్పర సహకారం అందించుకునే సంబంధాలు కొనసాగిస్తామని చైనా అధికార ప్రతినిధి తెలిపారు. అమెరికా బలగాలు ఆఫ్ఘనిస్థాన్‌ను విడిచి వెళ్లాలని నిర్ణయించుకున్నప్పటి నుంచి తాలిబన్లతో చైనా అనధికార బంధం కొనసాగించేందుకు సిద్ధమైంది.
చైనాతో ఆఫ్ఘనిస్థాన్‌కు76 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. జిన్జాంగ్లోని ముస్లిం మైనార్టీ వేర్పాటువాదులైన ఉయ్గర్లకు ఆఫ్ఘనిస్థాన్ ఆశ్రయం కల్పిస్తుందని చైనా అనుమానించింది. అయితే ఈ విషయంలో తాము వారికి ఎలాంటి సహకారం అందించబోమని కొద్దిరోజుల క్రితం తాలిబన్లు చైనాతో చర్చలు జరిపారు. ఇందుకు బదులుగా ఆఫ్ఘనిస్థాన్ పునర్ నిర్మాణానికి చైనా ఆర్థిక సాయం చేయడానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే ఆఫ్ఘనిస్థాన్‌తో మరింత లోతైన బంధాన్ని ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నిస్తామని పేర్కొంది. తాలిబన్లు సైతం చైనాతో సత్సంబంధాలు కొనసాగించేందుకు సుముఖంగా ఉన్నారు.
మరోవైపు ఆఫ్ఘనిస్థాన్‌లో శాంతియుతంగా అధికార మార్పిడి జరగాలని చైనా తెలిపింది. కాబూల్‌లో చైనా రాయబార కార్యాలయం యథాతథంగా పని చేస్తుందని అక్కడి అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఆఫ్ఘనిస్థాన్‌లోని తమ పౌరులు వెనక్కి వచ్చేయాలని చైనా నెల నుంచే సూచనలు జారీ చేస్తూ వచ్చింది. ఆఫ్ఘనిస్థాన్‌లోని చైనా పౌరులు భద్రత నడుమ ఉండాలని.. ఇంట్లోనే ఉండాలని సూచించింది. అమెరికాలో రెండు దశాబ్దాలుగా ఉన్న అమెరికా బలగాలను సెప్టెంబర్ 11 నాటికి వెనక్కి రప్పిస్తామని ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. అందుకు తగ్గట్టే అమెరికా బలగాలు వెనక్కి వెళుతున్నాయి. దీంతో తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.