హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Gas Explosion: ఘోర ప్రమాదం.. గ్యాస్ పైప్‌లైన్ పేలిపోయి.. 12 మంది దుర్మరణం..

Gas Explosion: ఘోర ప్రమాదం.. గ్యాస్ పైప్‌లైన్ పేలిపోయి.. 12 మంది దుర్మరణం..

ప్రతీకాత్మక చిత్రం(Image-Reuters)

ప్రతీకాత్మక చిత్రం(Image-Reuters)

శనివారం గుయ్జు ప్రావిన్స్‌లలోనూ ఇలాంటి ప్రమాదమే జరిగింది. ఓ రసాయన పరిశ్రమలో విషవాయువులు లీకై 8 మంది మరణించారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి.

  చైనాలో ఘోర ప్రమాదం జరిగింది. హుబే ప్రావిన్స్‌లోని షియాన్ నగరంలో గ్యాస్ పైప్‌లైన్ పేలింది. భారీ శబ్ధంతో పేలుడు సంభవించి.. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 12 మంది మరణించారు. మరో 150 మందికి పైగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 06.30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. జనావాసాల్లో పైప్ లైన్ పేలడంతో పలు ఇళ్లు కుప్పకూలిపోయాయి. సమాచారం అందిన వెంటనే రెస్క్యూ బృందాలు చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. ముందుజాగ్రత్తగా చుట్టు పక్కల ప్రాంతల ప్రజలను వేరొక చోటికి తరలించారు. పలువురు శిథిలాల కింద చిక్కుకుపోయారు. వారిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద మృతదేహాలు ఉండవచ్చని.. మృతుల సంఖ్య మరింతగా పెరగవచ్చని అధికారులు తెలిపారు.


  కాగా, శనివారం గుయ్జు ప్రావిన్స్‌లలోనూ ఇలాంటి ప్రమాదమే జరిగింది. ఓ రసాయన పరిశ్రమలో విషవాయువులు లీకై 8 మంది మరణించారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. ఆ దుర్ఘటనను మరవక ముందే హుబే ప్రావిన్స్‌లో మరో దారుణం జరిగింది. గ్యాస్ లీక్ కావడంతో భారీ పేలుడు సంభవించి.. 12 మంది మరణించారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: China, Gas blast

  ఉత్తమ కథలు