Home /News /international /

China Floods: చైనాలో వరదలు. నదుల్లా రోడ్లు. 12 మంది దుర్మరణం

China Floods: చైనాలో వరదలు. నదుల్లా రోడ్లు. 12 మంది దుర్మరణం

China Floods: చైనాలో వరదలు. (image credit - twitter)

China Floods: చైనాలో వరదలు. (image credit - twitter)

China Floods: అభివృద్ధిలో అమెరికాతో పోటీ పడుతున్న చైనా... వరదల విషయంలో మాత్రం ఏటా తలవంచుతూనే ఉంది. ఈసారి వరదలు మామూలుగా లేవు. రోడ్లు, రైల్వే ట్రాకులూ అన్నీ నదులైపోయాయి.

    China Floods: చైనా ఈ సంవత్సరం ఎప్పుడూ చూడనంత భారీ వరదల్ని చూస్తోంది. సెట్రంల్ చైనా వరద నీటిలో మునిగిపోయింది. ఇప్పటికే 12 మంది చనిపోయారు. ఇంకా చాలామంది ఆచూకీ లేదు. రోడ్లు, ఇళ్లు, షాపింగ్ మాళ్లు, రైల్వే ట్రాకులు..., అదీ ఇదీ అని లేదు... అన్నీ వరద నీటిలోనే ఉన్నాయి. అక్కడి నుంచి వస్తున్న వరద వీడియోలు చూసేందుకే భయంకరంగా ఉన్నాయి. రాత్రికి రాత్రి పడిన కుండపోత వానతో... వాహనాలన్నీ వరదల్లో కొట్టుకుపోయాయి. చాలా మంది నైట్ షిఫ్టు కోసం ఉద్యోగానికి వెళ్లి.. అక్కడే చిక్కుకుపోయారు. ముఖ్యంగా హెనాన్ ప్రావిన్స్ రాజధాని జెంగ్ఝౌలో ఏకంగా 20 సెంటీమీటర్ల వర్షం పడింది.

    వర్షం కారణంగా... సెంట్రల్ చైనాలో ప్రజలు ఇళ్లు వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాల్సి వచ్చింది. రైల్వే ప్రయాణికులు, రోడ్డు ప్రయాణికులూ అంతా పనులన్నీ మానేసుకొని... ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. పది వేల మందికి పైగా హెన్ ప్రావిన్స్ వదిలి తలో దిక్కుకూ వెళ్లిపోయారు. కార్లు మునిగిపోయేంత వరదలు వస్తున్నాయి. ఎంత మంది చనిపోయారో లెక్క తెలియట్లేదు. అధికారులకు టెన్షన్ పెరిగిపోతోంది.

    డజనుకుపైగా నగరాలు వరద నీటిలో మునిగిపోయాయి. విమానాల రాకపోకలు రద్దయ్యాయి. హెనాన్ ప్రావిన్స్‌లో 9.4 కోట్ల మంది ఉంటున్నారు. వారందరికీ నిన్న హై లెవెల్ వాతావరణ హెచ్చరిక జారీ అయ్యింది. చాలా మంది వాతావరణ అధికారుల హెచ్చరికను తేలిగ్గా తీసుకున్నారు. భారీగా వర్షాలు కురవడం వల్లే వరదలు వచ్చాయని అధికారులు అంటున్నారు.


    ఇప్పుడు హెనాన్ ప్రావిన్స్ వారికి మరో సమస్య పొంచి ఉంది. అదే... దగ్గర్లోని డ్యామ్. ఈమధ్య వరుస తుఫాన్ల వల్ల అది దెబ్బతింది. ఇప్పుడు వరదల దాటికి అది ధ్వంసమైతే... ఇక జల ప్రళయమే. అక్కడి వీడియోలను బట్టి భుజాల వరకూ వరద నీరు ఉన్నట్లు తెలుస్తోంది.




    కొంత మంది తాళ్లను ఉపయోగించి వరద బాధితుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న దృశ్యాలున్నాయి. ఎంత మంది వరదల్లో చిక్కుకున్నారో తెలియదు. వందల మంది ఉండొచ్చని అంచనా. కొంత మంది తమను కాపాడమని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.



    ఇది కూడా చదవండి: Girl Scheme: ఆ ప్రభుత్వం సంచలన నిర్ణయం... ప్రతి బాలికకు రూ.15,000

    హెనాన్ ప్రావిన్స్ రాజధాని జెంగ్ఝౌలో సంవత్సరమంతా వాన పడుతూనే ఉంటుంది. మూడేళ్లుగా ఇది మరింత ఎక్కువైంది. వచ్చే 24 గంటలపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు.
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: China, Heavy Rains

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు