వెయ్యేళ్లలో చూడని వరద బీభత్సం.. రైళ్లలో నడుము లోతు నీరు.. పడవల్లా కొట్టుకుపోయిన కార్లు

హెనాన్‌లో వరదలు

Henan Floods: జెంగ్ఝూలో మంగళవారం ఒక్క రోజే 457.5 మిల్లీ మీటర్ల అతి భారీ వర్షం కురిసింది. శనివారం నుంచి సగటున 640.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. గత 1000ఏళ్లలో ఇంత భారీ స్థాయిలో వర్షం ఎప్పుడూ పడలేదని అధికారులు చెబుతున్నారు.

 • Share this:
  కనుచూపు మేరలో ఎక్కడ చూసినా నీరే. వరద నీటిలో కార్లు పడవల్లా కొట్లుకుపోతున్నాయి. సబ్ వే రైలు బోగీల్లో నడుము లోతు నీరు నిలిచిపోయింది. సముద్రంలో భవనాలు కట్టారా? అన్నట్లుగా అన్ని ప్రాంతాలను వరద ముంచెత్తింది. చైనాలోని హెనన్ ప్రావిన్స్ వరద విలయం ధాటికి విలవిల్లాడింది. గత వెయ్యేళ్లలో ఎప్పుడూ చూడని జలప్రళయం ముంచెత్తింది. ఐఫోన్‌ సిటీగా పేరున్న హెనన్‌ ప్రావిన్స్‌ రాజధాని జెంగ్ఝూలో మంగళవారం ఒక్క రోజే 457.5 మిల్లీ మీటర్ల అతి భారీ వర్షం కురిసింది. శనివారం నుంచి సగటున 640.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. గత 1000ఏళ్లలో ఇంత భారీ స్థాయిలో వర్షం ఎప్పుడూ పడలేదని అధికారులు చెబుతున్నారు. వరద విలయం ధాటికి హెనన్‌లోని చాలా నగరాలు చెరువుల్లా మారిపోయింది. జల దిగ్బంధంలో చిక్కుకొని జనాలు వణికిపోతున్నారు. జెంగ్ఝూ సహా చాలా చోట్ల విద్యుత్, మంచినీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. వారిని సురక్షిత ప్రాంతాలు తరలించేందుకు సైన్యం రంగంలోకి దిగింది.


  ఎల్లో నది మహోగ్రరూపం దాల్చడంతో వరదలు పోటెత్తాయి. హెనన్లోని అన్ని డ్యామ్‌లు నిండుకుండల్లా మారిపోయాయి. వరదల కారణంగా జెంగ్ఝూలోని సబ్‌వేల్లోకి నీరు చేరింది. పలు రైళ్లలో నడుము లోతు వరకు నీరుచేరింది. ఒక రైలులో 12 మంది ప్రయాణికులు మరణించారు. ఇతర ప్రాంతాల్లో మరో 13 మంది చనిపోయారు. 12.4 లక్షల మందిపై వరదల ప్రభావం పడింది. ఇప్పటి వరకు 1.60 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వర్షాలు, వరదల కారణంగా 160 వరకు రైళ్లు, 260 విమాన సర్వీసులను రద్దు చేశారు.

  జెంగ్ఝూలో వరద బీభత్సం దృశ్యాలు ఇక్కడ చూడండి.  వరద నీటిని మళ్లించడానికి హెనన్‌ ప్రావిన్స్‌లోని యిహెతన్‌ ఆనకట్టను చైనా ఆర్మీ పేల్చేసింది. ఆనకట్టకు 20 మీటర్ల మేర పగుళ్లు ఏర్పడ్డాయని, ఏ సమయంలోనైనా కొట్టుకుపోవచ్చునని అంతకు ముందే సైన్యం చెప్పింది. జెంగ్ఝూలో ఇంకా భయానక పరిస్థితులు నెలకొన్నాయి. బాధితుల తరలింపు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది.
  Published by:Shiva Kumar Addula
  First published: