Home /News /international /

CHINA DAILY COVID CASES CLIMB TO 2 YEAR HIGH PVN

Covid In China : చైనాలో మళ్లీ కరోనా విజృంభణ..రెండేళ్ల గరిష్ఠానికి కేసులు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

china Daily Covid Cases : చైనాలో మళ్లీ ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. దేశంలో కొవిడ్‌ కేసులను సున్నాకు తేవాలనే చైనా ప్రత్నాన్ని కరోనా వమ్ము చేస్తోంది. ఆ దేశంలోని పలు నగరాల్లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి

Covid Cases In China : చైనాలో మళ్లీ ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. దేశంలో కొవిడ్‌ కేసులను సున్నాకు తేవాలనే చైనా ప్రయత్నాన్ని కరోనా వమ్ము చేస్తోంది. ఆ దేశంలోని పలు నగరాల్లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. 2020 మార్చి తర్వాత రోజువారీ అత్యధిక కేసులు గత రెండు రోజులుగా నమోదవుతున్నాయి. చైనాలో ఆదివారం 312 కరోనా కేసులు నమోదుకాగా సోమవారం మరో 214 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. 2020 మార్చి తర్వాత చైనాలో నమోదైన అత్యధిక రోజువారీ కరోనా కేసులు ఇవే కావడం గమనార్హం.

చైనా రాజధాని బీజింగ్‌లో మాత్రం కొత్త కేసులేమీ వెలుగు చూడలేదు. గ్వాంగ్‌ డాంగ్, జిలిన్ మరియు షాన్‌ డాంగ్ ప్రావిన్సులలో మెజారిటీ కేసులు నమోదయ్యాయి. ఇక, 2019 నుంచి మార్చి 6 నాటికి చైనాలో 1,11,195 కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయి. ప్రపంచ దేశాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. చైనాలో ఇప్పటికే 80 శాతం మందికి కోవిడ్ వ్యాక్సినేషన్‌ పూర్తి అయింది. మరోవైపు,చైనా ప్రత్యేక పరిపాలనా ప్రాంతం హాంకాంగ్​లో భారీగా కేసులు వెలుగుచూస్తున్నాయి. హాంకాంగ్ లో రోజువారీ కోవిడ్ కేసులు 50 వేలకుపైగా నమోదవుతున్నాయి.
Published by:Venkaiah Naidu
First published:

Tags: China, Corona, Covid cases, COVID-19 cases, Vaccinated for Covid 19

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు