హోమ్ /వార్తలు /international /

Lockdown : మరిన్ని నగరాల్లో కఠిన లాక్‌డౌన్.. సరుకులు దొరక్క జనం ఆకలి కేకలు.. ఇదీ తాజా సీన్

Lockdown : మరిన్ని నగరాల్లో కఠిన లాక్‌డౌన్.. సరుకులు దొరక్క జనం ఆకలి కేకలు.. ఇదీ తాజా సీన్

కరోనా పుట్టిన తొలినాళ్లలో వూహాన్ సిటీలో అమలు చేసిన తరహాలోనే.. జియాన్ నగరంలో అత్యంత కట్టుదిట్టమైన లాక్ డౌన్ గడిచిన వారం రోజులుగా కొనసాగుతోంది. సరుకులు దొరక్క ప్రజలు ఆకలి కేకలు పెడుతున్నారు. తాజాగా జియాన్యాంగ్, యునాన్ నగరాల్లోనూ లాక్ డౌన్ విధించారు..

ఇంకా చదవండి ...

    కరోనా వైరస్ పుట్టినిల్లయిన చైనాలో మరోసారి మహమ్మారి ప్రతాపాన్ని చూపుతోంది. రోజువారీ కేసులు అమాంతం పెరగడంతో జిన్ పింగ్ సర్కారు కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. కరోనా పుట్టిన తొలినాళ్లలో వూహాన్ సిటీలో అమలు చేసిన తరహాలోనే.. జియాన్ నగరంలో అత్యంత కట్టుదిట్టమైన లాక్ డౌన్ గడిచిన వారం రోజులుగా కొనసాగుతోంది. కనీసం నిత్యావసరాలకు కూడా జనాన్ని బయటికి రానీయకపోవడంతో సరుకులు దొరక్క ప్రజలు ఆకలి కేకలు పెడుతున్నారు. తమ దుస్థితిపై వారు సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. కొత్త కేసులు వస్తుండటంతో షాంగ్సీ ప్రావిన్స్ లోని జియాన్యాంగ్, యునాన్ నగరాల్లోనూ తాజాగా లాక్ డౌన్ విధించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చైనాలో వింటర్ ఒలంపిక్స్ జరుగనున్న నేపథ్యంలో కరోనా విషయంలో డ్రాగన్ దేశం అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నది. వివరాలివి..

    చైనాలో కరోనా పరిస్థితులు రోజురోజుకూ అధ్వాన్నంగా మారుతున్నాయి. 21 నెలల తర్వాత మళ్లీ అత్యధిక రోజువారీ కేసులు నమోదవుతుండటంతో పలు నగరాలు తిరిగి ఆంక్షల్లోకి వెళుతున్నాయి. ప్రధానంగా షాంగ్సీ ప్రావిన్స్ లో పరిస్థితి విపత్కరంగా మారింది. ఈ రాష్ట్రంలో 1.3 కోట్ల జనాభా కలిగిన జియాన్ నగరంలో కఠిన లాక్ డౌన్ కొనసాగుతుండగా, తాజాగా అదే ప్రావిన్స్ లోని జియాన్యాంగ్, యునాన్ నగరాల్లోనూ కఠిన ఆంక్షలు విధించారు. జనం ఇళ్లకే పరిమితం కావాలని సర్కారు ఆదేశాలు జారీ చేసింది. నిజానికి..

    Denver shooting : అమెరికా డెన్వర్ కాల్పుల్లో 5గురు మృతి, టెక్సాస్‌లో ముగ్గుర్ని చంపిన బాలుడు

    ఒమిక్రాన్ వ్యాప్తి తర్వాత ఇతర దేశాలతో పోల్చితే చైనాలో కొవిడ్ కొత్త కేసులు తక్కువగానే నమోదవుతున్నా, ఫిబ్రవరిలో జరుగనున్న వింటర్ ఒలంపిక్స్ నేపథ్యంలో డ్రాగన్ దేశం ‘జీరో కొవిడ్’ విధానాన్ని అవలంభిస్తూ పకడ్బందీ లాక్ డౌన్లు అమలు చేస్తున్నది. చైనాలో శనివారం కొత్తగా 209 పాజిటివ్ కేసులు రాగా, ప్రస్తుతం దేశమంతా కలిపి 2200కుపైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి.

    Telangana రికార్డు.. ఫస్ట్ డోస్ టీకా 100% పూర్తి -కొత్తగా 7 Omicron కేసులు -228 covid కేసులు

    జియాన్ నగరంలో లాక్ డౌన్ విధించి మంగళవారం నాటికి వారం పూర్తయింది. వాహనాల రాకపోకలు, జనం కదలికలపై పూర్తి నిషేధం విధించిన ప్రభుత్వం.. అత్యవసర సరుకులు తెచ్చుకునేందుకు మూడు రోజులకు ఒకసారి మాత్రమే అది కూడా కొద్ది సమయమే అనుమతి ఇస్తున్నది. దీంతో సరుకులు దొరక్క వేల కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నాయి. ‘ఇంట్లో సరుకులు నిండుకున్నాయి.. మరోవైపు మమ్మల్ని బయటికి రానివ్వడంలేదు.. ఆకలితో చనిపోయేలా ఉన్నాం.. దయచేసి సహాయం చేయండి..’ అంటూ స్థానికుడు ఒకరు సోషల్ మీడియా వేదిక ‘విబో’ ద్వారా అభ్యర్థించిన వైనం అక్కడి పరిస్థితికి అద్దంపట్టేలా ఉంది.

    First published:

    ఉత్తమ కథలు