హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

China - Covid 19 : చైనాలో భారీ క్వారంటైన్ క్యాంప్ .. జోరుగా కొత్త కేసులు

China - Covid 19 : చైనాలో భారీ క్వారంటైన్ క్యాంప్ .. జోరుగా కొత్త కేసులు

చైనాలో తీవ్రంగా కరోనా (image credit - reddit - esberat)

చైనాలో తీవ్రంగా కరోనా (image credit - reddit - esberat)

China - Covid 19 : సహజంగానే చైనా చాలా విషయాల్ని రహస్యంగా ఉంచుతుంది. ఈ కరోనా విషయంలోనూ అసలు నిజాల్ని దాచేస్తోందనే వాదన వినిపిస్తోంది. ఓ భారీ క్వారంటైన్ క్యాంప్‌ని నిర్మిస్తున్న వీడియో తీవ్ర కలకలం రేపుతోంది. చైనాలో ఏం జరుగుతోంది? కరోనా మళ్లీ ప్రపంచంపై పడుతుందా?

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

China - Covid 19 : చైనా తుమ్మితే ప్రపంచానికి కరోనా సోకుతుందనే విషయం ఆల్రడీ ఓసారి రుజువైంది. ఇప్పుడు అది రిపీట్ అయ్యేలా కనిపిస్తోంది. గత వారం నుంచి ఆ దేశంలో కొత్త కేసులు వేలల్లో నమోదవుతున్నాయి. తాజాగా 40,052 వేల కొత్త కేసులు నమోదవ్వడంతో.. చైనాలో కరోనా తీవ్ర స్థాయిలో ఉందనే విషయం అర్థమైపోతోంది. ఇప్పుడు మరో సమస్య ఏంటంటే.. అది మళ్లీ ఇతర దేశాలకు విస్తరిస్తుందా అనే భయాలున్నాయి. డ్రాగన్ ప్రభుత్వం.. లాక్‌డౌన్, క్వారంటైన్ వంటివి విధిస్తున్నా.. కరోనా పెరుగుతోందే తప్ప తగ్గట్లేదు. ఒమైక్రాన్ వేరియంట్ (Omicron strain) వల్ల కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇదే ప్రపంచ దేశాలకు ఆందోళన కలిగిస్తోంది.

మరోవైపు చైనాలోని గ్వాంగ్‌జౌ నగరంలో... అతి పెద్ద క్వారంటైన్ క్యాంప్ (quarantine camp) ని నిర్మిస్తున్నారు. ఇందులో ఒకేసారి 90వేల మందిని ఐసోలేషన్‌లో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆ వీడియోని ఇక్కడ చూడండి

కరోనాను పూర్తిగా పోగొట్టేవరకూ ఆంక్షలు ఉంటాయని ప్రకటించిన చైనా ప్రభుత్వం జీరో-కోవిడ్ పాలసీని అమల్లోకి తెచ్చి.. కఠిన ఆంక్షలు విధించడంతో.. రాజధాని బీజింగ్‌లో ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. అధ్యక్షుడు జిన్ పింగ్.. పదవి నుంచి దిగిపోవాలని నినాదాలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఆ వీడియోని ఇక్కడ చూడండి

ఈ ఆందోళనలపై బ్రిటన్ ప్రభుత్వం స్పందించింది. ప్రజల అభిప్రాయాలను లెక్కలోకి తీసుకోవాలని కోరింది. "చైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరగడం అరుదు.. కానీ అవి జరుగుతున్నాయి. దీన్ని ప్రపంచ దేశాలు లెక్కలోకి తీసుకోవాలి. వాళ్లు కాకపోయినా.. నా అభిప్రాయం ప్రకారం చైనా ప్రభుత్వమైనా వీటిని పరిగణన లోకి తీసుకోవాలి" అని బ్రిటన్ విదేశాంగ శాఖ కార్యదర్శి జేమ్స్ క్లెవెర్లీ సోమవారం తెలిపారు. "చైనా ప్రభుత్వ ఆంక్షలపై ప్రజలు సంతోషంగా లేరు" అని ఆయన అన్నారు.

Bandi Sanjay : పాదయాత్ర ప్రారంభం.. నేడు భైంసా శివారులో బహిరంగ సభ

ప్రపంచ దేశాలన్నీ ఆంక్షలు ఎత్తేశాయి. ఆ దేశాల్లో కరోనా కూడా దాదాపు పోయింది. కానీ ఆంక్షలు ఏమాత్రం ఎత్తేయని చైనాలో మాత్రం కరోనా తగ్గలేదు. ఇదే ప్రపంచ దేశాల్ని ఆశ్చర్యపరుస్తోంది. డ్రాగన్ కూడా ఆంక్షలు ఎత్తివేసి ఉంటే.. కరోనా పోయేదేమో అనే అభిప్రాయం ఉంది. ఏదేమైనా ఇప్పుడు చైనా వల్ల ప్రపంచ దేశాలకు కరోనా ముప్పు కనిపిస్తోంది. అసలే ఆర్థిక మాంద్యం వైపు దేశాలు అడుగులు వేస్తున్న సమయంలో.. ఈ కరోనా మీద పడితే.. పెద్ద సమస్యే అవుతుంది.

First published:

Tags: China, Corona, Covid -19 pandemic

ఉత్తమ కథలు