China Covid 19 : ఒకసారి కరోనాతో ప్రపంచ దేశాల్ని ముంచిన చైనా.. మరోసారి అదే విపత్తును నెట్టేలా కనిపిస్తోంది. ఆ దేశంలో ఆరు నెలల తర్వాత మళ్లీ కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. దాంతో అసలు డ్రాగన్ దేశంలో ఏం జరుగుతోందనే ప్రశ్న తెరపైకి వచ్చింది. కరోనా నుంచి ప్రపంచ దేశాలన్నీ కోలుకున్నాయి. ఆంక్షల్ని ఎత్తేశాయి. చైనాలో మాత్రం కఠిన ఆంక్షలున్నాయి. ముఖ్యంగా రాజధాని బీజింగ్ (Beijing)లో ప్రజలకు ఏమాత్రం స్వేచ్ఛలేదు. కరోనా టెస్టుల విషయంలో పాలకులు అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం బీజింగ్‌లోని కొన్ని ప్రాంతాల్లో లాక్డౌన్ (lock down) అమల్లో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
తమ దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయని స్వయంగా చైనా ప్రభుత్వమే ప్రకటించింది. తాము కఠినమైన టెస్టులు చేస్తూ.. కంట్రోల్ చెయ్యడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపింది. శనివారం నుంచి ఇప్పటివరకూ ఆ దేశంలో (బీజింగ్‌లో) 3 కరోనా మరణాలు సంభవించాయి. అధికారిక మరణాల లెక్క 5,229కి చేరింది. వ్యాక్సిన్లు వచ్చాక కూడా 3 మరణాలు సంభవించడంతో.. ఇప్పుడు 2 కోట్ల 10 లక్షల మంది లాక్డౌన్లో ఉన్నారు. లాక్డౌన్ అమల్లో ఉన్న ప్రాంతాల్లో షాపులు, స్కూళ్లు, రెస్టారెంట్లను మూసేశారు.
చైనా ప్రభుత్వం జీరో కోవిడ్ పాలసీ (zero-Covid policy) పేరుతో ఆంక్షలు అమలు చేస్తోంది. పూర్తిగా కరోనా పోయేవరకూ ఆంక్షలు తొలగించేది లేదని చెప్పింది. ఈ పాలసీ వల్ల కరోనా లక్షణాలు ఉన్నవారిని క్వారంటైన్లో ఉంచుతోంది. దీనిపై ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు.
ఇప్పుడు విదేశాల నుంచి ఎవరైనా బీజింగ్‌కి వెళ్తే.. మొదటి మూడు రోజుల్లో కరోనా టెస్ట్ చేయించుకోవాలి. ఫలితం వచ్చేవరకూ ఇళ్లలోనే ఉండాలి. ఇంత కఠినంగా వ్యవహరిస్తున్నా.. ఆ దేశంలో కరోనా కేసులు బాగా పెరుగుతున్నాయి. ఆదివారం కొత్తగా 24,730 కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్‌లో ఈ స్థాయిలో వచ్చేవి. మళ్లీ ఇప్పుడు వస్తున్నాయి.
Courtney Tailor : బాయ్‌ఫ్రెండ్‌ని పొడిచి.. విల్లా కొనుక్కుంది.. మర్డర్ కేసులో ట్విస్ట్
చైనాలో చలి ఎక్కువ. ఆ వాతావరణం కరోనా వైరస్ వృద్ధి చెందేందుకు వీలుగా ఉంది. అందుకే అక్కడ ఎంతకీ వైరస్ తగ్గట్లేదు. ఒకప్పుడు అమెరికా తుమ్మితే.. ప్రపంచానికి జ్వరం వచ్చేది అనేవారు.. ఇప్పుడు చైనా తుమ్మితే.. ప్రపంచానికి కరోనా వచ్చే పరిస్థితి ఉంది. అందుకే ప్రపంచ దేశాలు.. అక్కడ కరోనా తగ్గాలని కోరుకుంటున్నాయి. మరి ఆ రోజు ఎప్పుడొస్తుందో....
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: China, Corona alert, Covid 19 restrictions