ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ సారథి మసూద్ అజరే... ఇదిగో సాక్ష్యం

పుల్వామా ఉగ్రదాడి ఘటన తర్వాత దీనికి సూత్రదారి అయిన జైషే చీఫ్ మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ భారత చేస్తున్న డిమాండ్‌ను ఐరాస భద్రతా మండలిలో శాశ్విత సభ్యదేశం చైనా వ్యతిరేకిస్తోంది. గత దశాబ్దకాలంగా మసూద్ అజరే .. జైషే కార్యకలాపాల్లో ఉన్నాడనటానికి ఎలాంటి ఆధారాలు లేవని చైనా అడ్డమైన వాదన వినిపిస్తోంది. అయితే అజరే జైషే చీఫ్ అని నిరూపించేందుకు అవసరమైన పక్కా ఆధారాలు భారత్ దగ్గరున్నాయి.

news18-telugu
Updated: March 13, 2019, 12:51 PM IST
ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ సారథి మసూద్ అజరే... ఇదిగో సాక్ష్యం
మసూద్ అజర్ (ఫైల్ ఫొటో)
news18-telugu
Updated: March 13, 2019, 12:51 PM IST
పుల్వామా ఉగ్రదాడికి ప్రధాన కారకుడైన జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని గత కొన్ని రోజులుగా భారత్ డిమాండ్ చేస్తోంది. అయితే జైషే మొహమ్మద్‌తో మసూద్ అజర్‌కు సంబంధాలున్నాయనడానికి సాక్ష్యాలు లేవని  చైనా అడ్డంగా వాదిస్తోంది. మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ భారత చేస్తున్న డిమాండ్‌ను వ్యతిరేకిస్తోంది. గత దశాబ్దకాలంగా మసూద్ అజర్ .. జైషే కార్యకలాపాల్లో ఉన్నాడనటానికి ఎలాంటి ఆధారాలు లేవన్నది చైనా అడ్డగోలు వాదన. మార్చి 13న డెడ్‌లైన్ విధిస్తూ... మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని భారత్ చేసిన ప్రతిపాదనను ... ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశమైన  చైనా మాత్రం నిరాకరించింది. ఈ నేపథ్యంలో జైషే చీఫ్ మసూద్ అజరేనన్న తన వాదనకు బలం చేకూర్చేందుకు ఐరాస భద్రతా మండలికి భారత్ ఆడియో టేప్స్ సమర్పించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పలు జాతీయ మీడియా ఛానల్స్‌లో కథనాలు వెలువడ్డాయి. ఈ ఆడియో టేపుల్లో జైషే ఉగ్రవాద సంస్థ నాయకుడిగా మసూద్ అజహర్ చేసిన ప్రసంగాలు ఉన్నట్లు సమాచారం.

మరోవైపు జైషే మొహమ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న భారత్‌ డిమాండ్‌కు అమెరికా పూర్తి బాసటగా నిలిచింది. మసూద్‌ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో మూడు శాశ్వత సభ్య దేశాలు అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌లు ఇప్పటికే మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ ఉగ్రవాదిగా మసూద్‌ను ప్రకటించేందుకు విస్పష్ట ఆధారాలు ఉన్నాయని అగ్రదేశం ప్రకటించింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి కీలక భేటీకి ఒక రోజు ముందు జైషే చీఫ్‌పై అమెరికా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. పుల్వామా దాడితో భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. దీంతో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు... చైనా కూడా ఈ విషయం పట్ల వివేకంతో వ్యవహరిస్తుందని ఆశించాయి. అజర్‌కు వ్యతిరేకంగా తమ చర్యలను చైనా వ్యతిరేకించదని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు భావిస్తున్నాయి.First published: March 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...