హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

హిమాలయాల్లో చైనా ఆటలు సాగవు... డ్రాగన్‌కు అమెరికా హెచ్చరిక...

హిమాలయాల్లో చైనా ఆటలు సాగవు... డ్రాగన్‌కు అమెరికా హెచ్చరిక...

హిమాలయాల్లో చైనా ఆటలు సాగవు... డ్రాగన్‌కు అమెరికా హెచ్చరిక...

హిమాలయాల్లో చైనా ఆటలు సాగవు... డ్రాగన్‌కు అమెరికా హెచ్చరిక...

భారత్‌కి స్నేహ హస్తం అందించిన అమెరికా... తన శత్రువైన చైనాకు షాకుల మీద షాకులిస్తోంది. హిమాలయాల్లో డ్రాగన్‌కు అంత సీన్ లేదని తాజాగా తీసిపారేసింది.

ఆసియాలో చైనాకు బోలెడంత భూభాగం ఉంది. అయినా ఆ దేశం చుట్టుపక్కల దేశాల్ని ఆక్రమించుకోవాలని కుట్రలు పన్నుతూ ఉంటుంది. ముఖ్యంగా శాంతిమార్గంలో వెళ్లే ఇండియాను రెచ్చగొడుతూ... లేని ధైర్యాన్ని ప్రదర్శించడానికి కుయుక్తులు పన్నుతూ ఉండటం మనం చూస్తూనే ఉన్నాం. ఈమధ్య లడక్‌లో కొండంత రాగం తీసి... తోకముడుచుకొని డ్రాగన్ వెనక్కి వెళ్లింది కదా... దీన్ని ఉద్దేశిస్తూ... అమెరికా... డ్రాగన్‌కు చురకలు అంటించింది. హిమాలయాల్లో చైనా చేసేదేమీ ఉండదనీ... చుట్టుపక్కల దేశాలను భయపెట్టలేదని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో అన్నారు. లండన్‌లోని ఓ న్యూస్ కాన్ఫరెన్స్‌లో ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బ్రిటన్ విదేశాంగ మంత్రితో తాను జరిపే చర్చల్లో చైనా ప్రస్తావన కూడా ముఖ్యమైనదేనని పాంపియో అన్నారు.

చైనా ఎంత డేంజరస్ అంటే... చుట్టుపక్కల చిన్న చిన్న దేశాలపై పెత్తనం చెలాయిస్తోంది. వాటికి ఉన్న సముద్ర జలాల్ని లాగేసుకోవడానికి కుట్రలు పన్నుతోంది. ఇవన్నీ గమనిస్తున్న ఆమెరికా... చైనాకి చెక్ పెట్టడానికి ఎప్పటికప్పుడు ట్రై చేస్తోంది. కరోనా విషయంలో చైనాపై ప్రపంచ దేశాలన్నీ చాలా ఆగ్రహంగా ఉన్నాయి. ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ... పాపింయో ఓ మాట అన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థను చైనా కప్పిపుచ్చగలదేమోగానీ... ప్రపంచ దేశాల్ని మోసం చేయలేదని అన్నారు. కరోనా వైరస్ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ... చైనాకు మద్దతుగా మాట్లాడుతుండటమే ఆయన ఈ డైలాగ్ అనడానికి కారణం.

తాజా అంచనాల ప్రకారం... ఆసియాలో చైనాను కంట్రోల్ చెయ్యడానికి అమెరికా బ్రిటన్ సహా యూరప్ దేశాలకు దగ్గరవుతోంది. మరోవైపు ఇండియాతో కలిసి ముందుకు సాగుతోంది. అటు ఆస్ట్రేలియాకి సైతం హాని చేసి చైనా... శత్రుత్వాన్ని తెచ్చుకుంది. ఈ పరిస్థితుల్లో చైనాకి అనుకూలంగా రష్యా, ఉత్తర కొరియా మాత్రమే ఉన్నాయి. ఉత్తరకొరియా ఆల్రెడీ లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం కూడా లేని దేశం. రష్యా ఆర్థిక పరిస్థితి ఆల్రెడీ దారుణంగా ఉంది. ఆ దేశం చైనాకి అండగా ఉన్నా డ్రాగన్‌కి కలిసొచ్చేదేమీ లేదు.

ప్రపంచ దేశాలను చైనా గౌరవించాలన్న మైక్ పాంపియో... అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా చైనా నడచుకోవాలన్నారు. హాంకాంగ్ ప్రజల స్వేచ్ఛను చైనా హరిస్తోందన్న ఆయన... దక్షిణ చైనా సముద్రంలో మిలిటరీ పవర్‌ను పెంచడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇండియాతోనూ యుద్ధానికి దిగి... భారత సైన్యం అమరులయ్యేలా చేసిందని పాంపియో ఫైర్ అయ్యారు.

మే 5న భారత్-చైనా లడక్ సరిహద్దుల్లో గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో... భారత సైనికులు 20 మంది అమరులయ్యారు. ఈ ఘటనతో అంతర్జాతీయంగా చైనా అప్రతిష్టపాలైంది. అమెరికా ఒత్తిడి పెంచడంతో... సరిహద్దుల నుంచి సైన్యాన్నీ, ఆయుధాల్నీ వెనక్కి తీసుకుంది.

First published:

Tags: China, US-China

ఉత్తమ కథలు