CHINA BUILDS BRIDGE ACROSS LADAKH PANGONG LAKE AT KEY FLASHPOINT DEPLOYED 60000 TROOPS NEAR BORDER MKS
China దూకుడు.. Ladakhలో 60వేల సైనికులు.. Pangong సరస్సుపై వంతెన నిర్మాణం
పాంగాంగ్ సరస్సుపై చైనా బ్రిడ్జి శాటిలైట్ చిత్రం
తూర్పు లదాక్ లో చైనా మళ్లీ యాక్టివ్ అయింది. బలగాల ఉపసంహరణ తర్వాత కూడా డ్రాగన్ తన 60 వేల మంది సైనికులను సరిహద్దుకు సమీపంగానే నిలిపి ఉంచింది. మరోవైపు పాంగాంగ్ సరస్సుపై ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకు చైనా కొత్త వంతెన నిర్మాణాన్ని చేపట్టింది. వివరాలివి..
శీతాకాలం ముగింపు దిశగా వెళుతున్నకొద్దీ భారత్-చైనా సరిహద్దులో ఉద్రిక్తతలకు అవకాశామిచ్చే కలాపాలు ఉధృతం అవుతున్నాయి. తోక జాడింపును అలవాటుగా మార్చుకున్న చైనా ప్రస్తుతం తూర్పు లదాక్ లో మళ్లీ యాక్టివ్ అయింది. బలగాల ఉపసంహరణ తర్వాత కూడా డ్రాగన్ తన 60 వేల మంది సైనికులను సరిహద్దుకు సమీపంగానే నిలిపి ఉంచింది. చైనా బుద్ది బాగా తెలిసిన భారత్ కూడా అంతే సంఖ్యలో బలగాలను మోహరింపజేసింది. చైనా సరిహద్దును పరిరక్షిస్తోన్న 14 కార్ప్స్‌ను బలోపేతం చేసేందుకు అదనంగా ఉగ్రవాద నిరోధక రాష్ట్రీయ రైఫిల్స్ యూనిఫాం ఫోర్స్ ఏర్పాటుకు భారత్ నిర్ణయం తీసుకుందని సైనిక వర్గాలు పేర్కొన్నాయి. ఇదిలా ఉంటే, తూర్పు లదాక్ లో మరో అత్యంత కీలకమైన ప్రాంతం పాంగాంగ్ సరస్సుపై చైనా కొత్తగా వంతెన నిర్మాణాన్ని చేపట్టింది..
కైలాస్ పర్వత శిఖరాన్ని భారత్ ఆక్రమించుకోవడం ద్వారా పాంగాంగ్ సరస్సు వద్ద మన ఆధిపత్యం పెరిగింది. ఇండియాను ఎలాగైనా నిలువరించాలనే లక్ష్యం, తన సైన్యాన్ని వేగంగా సరిహద్దులకు తరలించగలిగే ఉద్దేశంతో చైనా ఈ మేరకు పాంగాంగ్ సరస్సుపై భారీ వంతెన నిర్మాణాన్ని చేపట్టింది. జియోలాజికల్ ఇంటెలిజెన్స్ నిపుణుడు డామియన్ సైమన్ బయటపెట్టిన శాటిలైట్ చిత్రాల్లో ఈ విషయం నిరూపితమైంది. పాంగాంగ్ సరస్సు చైనా భూభాగంలో ఉన్న ప్రాంతం(నిజానికి అది టిబెట్ కు చెందినది)లో ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకు కొత్త వంతెనను నిర్మిస్తున్నారు.
పాంగాగ్ సరస్సులో చైనా ఆధీనంలోని ఖురాంక్ ప్రాంతంలో కొత్త వంతెన నిర్మాణాన్ని చేపట్టారు. అత్యంత ఇరుకుగా ఉండే ఈ ప్రదేశంలో రెడీమేడ్ సామాగ్రితో చైనా బ్రిడ్జి నిర్మిస్తున్నది. ఖురాంక్ నుంచి సరస్సు దక్షిణ సరిహద్దుకు చేరుకునేలా ఈ నిర్మాణం జరుగుతోంది. ఇది పూర్తయితే చైనా బలగాలు 180 కిలోమీటర్లు చుట్టూ తిరిగి రావాల్సిన అవసరం తప్పుతుంది.
భారత బలగాలు 2020 ఆగస్టులో కైలాశ్ శిఖరంపై పట్టు బిగించాయి. చైనా బలగాలు మనకంటే 24 గంటలు ఆలస్యంగా అక్కడికి వచ్చాయి. కైలాశ్ రేంజ్ లో భారత్ ఆపరేషన్లను అడ్డుకోడానికి చైనా పలు రకాల ప్రయత్నాలుచేస్తోంది. కొత్త బ్రిడ్జి నిర్మాణం కూడా అందులో భాగమే.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.