జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్‌పై నిషేధానికి ... మరోసారి చైనా అడ్డుపుల్ల

గతంలోనూ భారత్‌ యత్నాలను చైనా అడ్డుకుంది. పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై దాడి సూత్రధారి, పాకిస్థాన్ కు చెందిన ఉగ్రవాద సంస్థ జైస్ ఇ మహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజహార్ ను బ్యాన్ చేయాలన్న భారత్ డిమాండ్ ను కారణం తెలపకుండా చైనా వ్యతిరేకింది.

news18-telugu
Updated: March 14, 2019, 10:56 AM IST
జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్‌పై నిషేధానికి ... మరోసారి చైనా అడ్డుపుల్ల
మసూద్ అజర్(File)
news18-telugu
Updated: March 14, 2019, 10:56 AM IST
పాకిస్తాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్ర సంస్థ జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని గత కొంతకాలంగా భారత్ ప్రయత్నాలు చేస్తుంది. అయితే చైనా మరోసారి ఇండియా చేస్తున్న ఈ ప్రయత్నాలకు అడ్డుతగిలింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆంక్షల కమిటీ ప్రకారం మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలని ఫ్రాన్స్, యూకే, అమెరికాలు ఫిబ్రవరి 27న ప్రతిపాదించాయి. ఈ విషయంలో ఏమైనా అభ్యంతరాలుంటే సభ్యదేశాలు పది పని దినాల్లోగా లేవనెత్తాలి. దీనికి బుధవారంతో గడువు ముగిసింది. చివరి నిమిషంలో సాంకేతిక కారణాలను చూపుతూ ఈ ప్రతిపాదనపై చైనా అభ్యంతరం వ్యక్తం చేయడంతో వీగిపోయింది. మసూద్‌ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని ఐక్యరాజ్య సమితిలో ఇలాంటి ప్రయత్నాలు చేయడం పదేళ్ల కాలంలో ఇది నాలుగోసారి కావడం గమనార్హం.

అంతకుముందు కూడా జైషే మహ్మద్ చీఫ్ మసూదేనని నిరూపించడానికి సరైన ఆధారాలు లేవని చైనా ఆరోపించింది. మార్చి 13న డెడ్‌లైన్ విధిస్తూ... మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని భారత్ చేసిన ప్రతిపాదనను ... ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశమైన చైనా మాత్రం నిరాకరించింది. ఈ నేపథ్యంలో జైషే చీఫ్ మసూద్ అజరేనన్న తన వాదనకు బలం చేకూర్చేందుకు ఐరాస భద్రతా మండలికి భారత్ ఆడియో టేప్స్ సమర్పించినట్లు తెలుస్తోంది. గతంలోనూ భారత్‌ యత్నాలను చైనా అడ్డుకుంది. పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై దాడి సూత్రధారి, పాకిస్థాన్ కు చెందిన ఉగ్రవాద సంస్థ జైస్ ఇ మహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజహార్ ను బ్యాన్ చేయాలన్న భారత్ డిమాండ్ ను కారణం తెలపకుండా చైనా వ్యతిరేకింది.అయితే ఈ విషయంలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ సహా 15దేశాలకు గాను 14 దేశాలు గట్టిగా మద్దతు పలికాయి. అణు సదస్సు -2016కు ముందు భారత్ మసూద్ అజహార్ ను పఠాన్ కోట్ ఉగ్రదాడికి సంబంధించి ఐక్యరాజ్య సమితి విచారించాలని గట్టిగా కోరింది.

చైనా నిబంధల ప్రకారమే నడుచుకుంటుందని, మసూద్ అజర్‌పై అంతర్జాతీయ ఉగ్రవాది ముద్ర వేసే ప్రయత్నాలను అడ్డుకోబోతున్నట్లు ఆ దేశ అధికార ప్రతినిధి లు కాంగ్‌ అంతకుముందే సంకేతాలిచ్చారు. అంతర్జాతీయ ఉగ్రవాది ముద్ర వేసేందుకు అజర్‌ తగిన వ్యక్తేనని అమెరికా పేర్కొంది. తాజా పరిణామంపై భారత విదేశాంగ శాఖ స్పందిస్తూ..భారత పౌరులపై దాడికి పాల్పడిన వారిని శిక్షించేందుకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాల్ని అనుసరిస్తామని ప్రకటించింది. తమ ప్రయత్నాలకు చైనా మరోసారి అడ్డుపడటంపట్ల విచారం వ్యక్తం చేసింది.



First published: March 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...