హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

అక్కడ రంజాన్ ఉపవాసం ఉండకూడదు.... ఒకవేళ ఉన్నారో?

అక్కడ రంజాన్ ఉపవాసం ఉండకూడదు.... ఒకవేళ ఉన్నారో?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రంజాన్‌ మాసం సందర్భంగా అక్కడి రెస్టారెంట్లను తెరచిఉంచాలంటూ ఆదేశాలు ఇచ్చింది. ఈ పవిత్ర మాసంలో సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ముస్లింలు ఉపవాసం చేస్తారు.

    రంజాన్... ముస్లీంలు అంతా అతి పవిత్రంగా పాటించే మాసం. మైనర్ పిల్లల నుంచి ... వృద్ధుల వరకు ప్రతీ ఒకరు ఈ  కఠిన ఉపవాస దీక్షలను నెలంతా అత్యంత భక్తి శ్రద్ధలతో పాటిస్తారు. రంజాన్ నెలలో ఉపవాసం చేయని ముస్లీంలు మన దేశంలోనే కాదు... ప్రపంచంలో ఎక్కడా ఉండరు. కానీ చైనాలో మాత్రం ఉపవాసం చేయడం నిషేధం. కమ్యూనిస్టు ప్రభుత్వ అభిప్రాయం ప్రకారం ఇలాంటి ఉపవాసాలు ఎవరైనా పాటిస్తే అవి తీవ్రవాదానికి దారితీస్తాయి. 2015లో తొలిసారిగా చైనాలో రంజాన్ మాసం ఉపవాసాలపై నిషేధం విధించారు.రంజాన్‌ వేళల్లో ఉపవాసం ఉండరాదని ఆదేశాలు జారీ చేసింది. దీంతో అక్కడ ఉన్న ముస్లింలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయం చైనాలో వివాదాస్పదంగా మారింది. ముఖ్యంగా చైనాలో ఉయ్‌ఘర్లు, ఇతర ముస్లీం గ్రూపులు ఎక్కువగా ఉన్న వాయువ్య ప్రాంత జిన్‌జియాంగ్ ప్రావిన్సులో దీన్ని కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. ఇక్కడ ఉన్న దాదాపు కోటిమంది ఉయ్‌ఘర్లు ముస్లీంలపై పూర్తి నిఘా కొనసాగుతోంది.


    ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతంలో పనిచేసే ముస్లిం ప్రభుత్వ అధికారులు, విద్యార్ధులు, టీచర్లు దీక్ష చేయడాన్ని నిషేధిస్తున్నట్లు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు రంజాన్‌ మాసం సందర్భంగా అక్కడి రెస్టారెంట్లను తెరచిఉంచాలంటూ ఆదేశాలు ఇచ్చింది. ఈ పవిత్ర మాసంలో సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ముస్లింలు ఉపవాసం చేస్తారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా ఉపవాస దీక్షచేసినట్లు తేలితే కాన్‌సన్‌ట్రేషన్( రీ ఎడ్యుకేషన్) శిబిరాలకు తరలిస్తున్నారు. ఒక అంచనా ప్రకారం ప్రతి కుటుంబం నుంచి ఒకరు ఈ శిబిరాలకు వెళ్లి వారాల తరలబడి పాఠాలు చెప్పించుకునే పరిస్థితి. కానీ చైనా ప్రభుత్వ విధానాలతో ప్రజల మధ్య మతపరమైన గొడవలకు దారితీస్తుందని ఉయిఘర్‌ మైనార్టీ వారు చెబుతున్నారు. గత కొన్నేళ్లుగా ఇదే విషయంపై ఘర్షణలు చెలరేగడంతో కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోయారని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో క్సింజియాంగ్‌ ప్రాంతానికి ఉగ్రవాద ముప్పు ఉందని ప్రభుత్వం చెబుతుంది. మరోవైపు చైనా ప్రభుత్వం ఉపవాస దీక్షలపై నిషేధం విధిస్తుండటాన్ని ఇస్లామిక్ గ్రూపులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మతస్వేచ్ఛను అడ్డకోకూడదని చైనాను హెచ్చరిస్తున్నాయి.

    First published:

    Tags: China, International, Muslim Minorities, Ramzan, World

    ఉత్తమ కథలు