Home /News /international /

China Three-Child Policy: చైనాలో కొత్త చట్టం.. ముగ్గురు పిల్లలను కనేందుకు గ్రీన్ సిగ్నల్.. ప్రోత్సహకాలు కూడా..

China Three-Child Policy: చైనాలో కొత్త చట్టం.. ముగ్గురు పిల్లలను కనేందుకు గ్రీన్ సిగ్నల్.. ప్రోత్సహకాలు కూడా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

చైనా తాజాగా కీలక చట్టానికి ఆమోద ముద్ర వేసింది. ముగ్గురు పిల్ల‌లను కనేందుకు అనుమతులు ఇచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి.

    చైనా ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ముగ్గురు పిల్ల‌లను కనేందుకు అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు కీలక చట్టానికి ఆమోద ముద్ర వేసింది చైనా.
    చైనాలో నేష‌న‌ల్ పీపుల్స్ కాంగ్రెస్ 13వ స్టాండింగ్ క‌మిటీ స‌మావేశాలు తాజాగా ముగిశాయి. ఈ స‌మావేశాల్లో ప‌లు కీల‌క బిల్లుల‌ను ఆమోదించారు. పలు చట్టాలను సవరించారు. ఈ నేపథ్యంలో జనాభా, కుటుంబ నియంత్ర‌ణ చ‌ట్టాన్ని కూడా స‌వ‌రించారు. ఇందులో భాగంగా ముగ్గురు పిల్ల‌ల విధానానికి గ్రీన్ సిగ్న‌ల్ లభించింది. ఆ చ‌ట్టాల‌కు సంబంధించిన అమ‌లు ప‌త్రాల‌పై చైనా అధ్య‌క్షుడు జీ జిన్‌పింగ్ సంత‌కం చేసి ఆమోద ముద్ర వేశారు.
    Dinosaurs in china: చైనాలో బయటపడిన రెండు డైనోసర్ల అవశేషాలు.. ఎంత పెద్దగా ఉన్నాయంటే..
    China-Talibans: చైనా వక్రబుద్ధి.. తాలిబన్లతో స్నేహానికి అప్పుడే తహతహ..

    ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశంగా చైనా ఉంది. దీంతో జనాభాను నియంత్రించాలన్న లక్ష్యంతో ఆ దేశం గతంలో వన్ చైల్డ్ పాలసీని ప్రవేశ పెట్టింది. ఈ పాలసీని దాదాపు 40 ఏళ్ల పాటు అమలు చేసింది చైనా. కానీ ఈ పాలసీ అమలు విజయవంతంగా సాగినా.. ఆ దేశానికి కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. కొత్తగా పుట్టుకలు ఆగిపోవడంతో ఇప్పుడు దేశంలో యువత సంఖ్య తగ్గిపోగా.. వృద్ధుల సంఖ్య మాత్రం విపరీతంగా పెరిగిపోయింది. ఇలానే కొనసాగితే రానున్న రోజుల్లో తమకు ఇబ్బందులు తప్పవని భావించిన చైనా.. వన్ చైల్డ్ పాలసీకి మార్పులు చేసి టూ చైల్డ్ పాలసీని 2016లో తీసుకువచ్చింది. ప్రస్తుతం త్రీ చైల్డ్ పాలసీని అమలులోకి తీసుకువచ్చింది.

    ముగ్గురు పిల్లలను కనే వారికి ప్రోత్సాహం..
    ముగ్గురు పిల్లల పాలసీని తీసుకువచ్చిన చైనా.. తాజాగా ముగ్గురు పిల్లలను కనే దంపతులకు తోడ్పాటు ఇవ్వనుంది. ఇన్సూరెన్స్, ఫండింగ్‌, ట్యాక్సేష‌న్‌, ఎడ్యుకేష‌న్‌, హౌజింగ్‌, ఎంప్లాయిమెంట్‌లో వారికి చేయూత‌ ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇదిలా ఉంటే.. పిల్లను పెంచడం భారంగా మారిన నేపథ్యంలో ఒక్కో శిశువుకు 1.50 లక్షల డాలర్లను ప్రభుత్వం తల్లిదండ్రులకు అందించాలని చైనాలోని నిపుణులు సూచిస్తున్నారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Children, China

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు