అంతా అనుకున్నట్టే జరుగుతోంది. అమెరికా సేనలు వైదొలిగిన తరువాత ఆఫ్ఘనిస్థాన్‌ను కైవసం చేసుకున్న తాలిబన్లు.. అక్కడ ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేశారు. అయితే అంతా గందరగోళంగా ఉన్న ఆప్ఘనిస్థాన్‌కు ఆర్థికంగా అదుకోవడానికి చైనా ముందుకు వచ్చే అవకాశం ఉందని.. ఆ దేశంలోని ఖనిజ సంపదపై డ్రాగన్ దేశం కన్నేసిందని కొన్ని వారాలుగా వార్తలు వస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ సర్కార్ ఏర్పడిన కొన్ని గంటల వ్యవధిలోనే ఆ దేశానికి భారీ ఆర్థిక సాయం ప్రకటించింది చైనా. ఆఫ్ఘనిస్తాన్‌కు 31 మిలియన్ డాలర్ల(దాదాపు రూ. 220 కోట్ల రూపాయలు) సహాయాన్ని చైనా బుధవారం ప్రకటించింది, ఆ దేశంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు అరాచకాన్ని అంతం చేయడానికి ఇది అవసరమని పేర్కొంది.
ఆఫ్ఘనిస్తాన్‌పై పొరుగు దేశాల విదేశాంగ మంత్రుల మొదటి సమావేశంలో పాల్గొన్న చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి, ఆఫ్ఘనిస్తాన్ అవసరాలకు అనుగుణంగా 200 మిలియన్ యువాన్ (USD 31 మిలియన్) విలువైన ధాన్యాలు, శీతాకాల సామాగ్రి, టీకాలు, ఔషధాలను అందిస్తుందని వెల్లడించారు.
పాకిస్తాన్ ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఇరాన్, తజికిస్తాన్, తుర్కన్మిస్థాన్, ఉజ్బెకిస్తాన్ విదేశాంగ మంత్రులు కూడా పాల్గొన్నారు, పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషి నిర్వహించిన సమావేశానికి రష్యా మాత్రం దూరంగా ఉంది. తన ప్రజల అవసరాల మేరకు చైనా ఆఫ్ఘనిస్తాన్‌కు 200 మిలియన్ యువాన్ (USD 31 మిలియన్) విలువైన ధాన్యాలు, శీతాకాల సామాగ్రి, టీకాలు, మందులు అందిస్తుందని వాంగ్ తెలిపారు.
ఇందులో భాగంగా మొదట విడతలో ఆఫ్ఘన్ ప్రజలకు 3 మిలియన్ వ్యాక్సిన్ మోతాదులను విరాళంగా ఇవ్వాలని చైనా నిర్ణయించిందని వాంగ్ చెప్పారు. చైనా-దక్షిణ ఆసియా దేశాల అత్యవసర సరఫరాల రిజర్వ్‌ల కింద ఆఫ్ఘనిస్థాన్‌కు మరింత అంటువ్యాధి నిరోధక మందులు, అత్యవసర సామగ్రిని అందించడానికి సిద్ధంగా ఉన్నామని చైనా తెలిపింది.
KTR: టీఆర్ఎస్ నేతలకు గుడ్ న్యూస్ చెప్పిన కేటీఆర్.. త్వరలోనే వారికి పదవులు..
kiara advani: కియారా అద్వానీలా ఉన్న యువతి.. అట్రాక్ట్ అవుతున్న ఫ్యాన్స్.. ఇంతకీ ఎవరామె..
ఆఫ్ఘనిస్థాన్ తన ఆర్థిక వ్యవస్థ మరియు సమాజాన్ని పునర్నిర్మించడానికి, ఉగ్రవాద గ్రూపులు, అక్రమ మాదకద్రవ్యాల వ్యాపారంతో పోరాడటానికి చైనా ఈ ప్రాంతంలోని దేశాలతో కలిసి పనిచేస్తుందని వాంగ్ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే కొన్ని గంటల క్రితమే ముల్లా మొహమ్మద్ హసన్ అఖుండ్ నేతృత్వంలోని కఠినమైన తాత్కాలిక ప్రభుత్వాన్ని తాలిబాన్లు ఏర్పాటు చేశారు.
మరోవైపు ఆఫ్ఘనిస్థాన్‌లోని తాలిబన్లతో చైనా చాలాకాలం నుంచి స్నేహం కొనసాగిస్తోంది. తాలిబన్ సీనియర్ నాయకుడు ముల్లా అబ్దుల్ ఘనీ బరదార్ నేతృత్వంలోని తాలిబాన్ ప్రతినిధి బృందం జూలైలో చైనా సందర్శించి చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌తో చర్చలు జరిపింది. ఇక తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్‌ను ఆక్రమించుకున్న వెంటనే అమెరికా ఆ దేశానికి సంబంధించి అన్ని అకౌంట్లను నిలిపేసింది. దీంతో ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం మరింత ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. ఈ పరిస్థితి నుంచి ఆ దేశాన్ని గట్టెక్కించి తమ ప్రయోజనాలు నెరవేర్చుకునేందుకు చైనా ముందుకొచ్చింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Afghanistan, China, Taliban