Srilanka Blasts : సీసీటీవి ఫుటేజీ విడుదల.. బ్యాగుతో చర్చిలోకి వెళ్లి ఆత్మాహుతికి పాల్పడ్డ యువకుడు..

Srilanka Blasts : ఉగ్ర పేలుళ్లకు సంబంధించి శ్రీలంక పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు జరుపుతున్నారు. కొలంబోలోని ఓ ధనవంతుల ముస్లిం కుటుంబానికి చెందిన ఇద్దరు సోదరులు దాడుల్లో పాలుపంచుకున్నట్టుగా అనుమానిస్తున్నారు.

news18-telugu
Updated: April 24, 2019, 11:04 AM IST
Srilanka Blasts : సీసీటీవి ఫుటేజీ విడుదల.. బ్యాగుతో చర్చిలోకి వెళ్లి ఆత్మాహుతికి పాల్పడ్డ యువకుడు..
భుజానికి బ్యాగుతో చర్చిలోకి వెళ్తున్న అనుమానితుడు..
  • Share this:
శ్రీలంకలో పేలుళ్లు ఆ దేశంలో భయోత్పాతాన్ని సృష్టించాయి. ఎప్పుడు ఎక్కడ మళ్లీ బాంబుల మోత వినాల్సి వస్తుందోనన్న భయంలో అక్కడి ప్రజలు ఉన్నారు. ముందస్తు సమాచారం ఉన్నా ఉగ్రదాడులను అడ్డుకోలేకపోవడంతో.. ఇకముందైనా ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తుందా? అన్న సందేహాలు వారిని వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజా పేలుళ్లకు సంబంధించి ఓ సీసీటీవి ఫుటేజీ బయటకు వచ్చింది.నెగొంబోలోని సెయింట్ సెబాస్టియన్ వద్ద పేలుళ్లకు ముందు సీసీటీవి దృశ్యాలను ఓ శ్రీలంకన్ టీవీ ఛానెల్ మంగళవారం బయటపెట్టింది. వీడియోలో ఓ అనుమానితుడు భుజాలకు ఓ బ్యాగ్ తగిలించుకుని చర్చిలోకి వెళ్లడం కనిపించింది. చర్చి ప్రవేశ ద్వారం వైపు వెళ్తున్న క్రమంలో.. తాతతో కలిసి నడుస్తున్న ఓ చిన్నారి ఎదురుపడటంతో.. చేతితో ఆమె బుగ్గపై అతను సున్నితంగా టచ్ చేశాడు.

పేలుళ్ల అనంతరం AFP న్యూస్ ఏజెన్సీతో మాట్లాడిన ఆ చిన్నారి తాత ఫెర్నాండో.. అతనే ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడని చెప్పారు.అతని వయసు కాస్త అటు ఇటుగా 30 ఉంటుందని.. భుజానికి అంత పెద్ద బ్యాగు తగిలించుకురావడంతో.. చర్చిలోకి లగేజీతో ఎందుకు వెళ్తున్నాడని తాము ఆశ్చర్యపోయామని చెప్పారు. తమకు ఎదురుపడిన సమయంలో అతనిలో ఎలాంటి ఆందోళన గానీ భయం గానీ లేదని.. ప్రశాంతంగా కనిపించాడని తెలిపారు.


చర్చిలో అందరూ ప్రార్థనలు చేస్తున్న సమయంలో.. అతను లోపలికి ప్రవేశించాడు. కాసేపటికి ఆత్మాహుతి దాడికి పాల్పడటంతో చర్చి రక్తసిక్తమైంది. ప్రార్థనలు జరుపుతున్నవారి శరీరాలు ముక్కలు ముక్కలై తెగిపడ్డాయి. చర్చి పైకప్పు పూర్తిగా ధ్వంసమైంది.కాగా, ఉగ్రదాడులు తమ పనే అని అమాక్ ఏజెన్సీ ద్వారా ఐసిస్ ప్రకటించింది. దాడులకు పాల్పడ్డ ఎనిమిది మంది ఫోటోలను కూడా విడుదల చేసింది. అందులో వారు ముఖాలకు ముసుగులతో కనిపించారు. ఒక వ్యక్తి మాత్రం ముసుగు లేకుండా.. చేతిలో రైఫిల్‌తో, గుబురు గడ్డంతో కనిపించాడు. అదే ఫోటోలో ముగ్గురు ఉగ్రవాదులు కత్తులు పట్టుకుని ఉన్నారు. దాడులకు సంబంధించి ఈ ఎనిమిది మంది ఐసిస్ చీఫ్ అబూ బకర్ అల్ బాగ్దాదికి ప్రతిజ్ఞ చేస్తున్న వీడియోను కూడా విడుదల చేసింది. షాంగ్రీ-లా, సిన్నమాన్, కింగ్స్‌బరీ హోటల్స్‌ వద్ద దాడులు చేసిన ఉగ్రవాదులను అబు ఒబెదా, అబు బరారా, అబు మౌక్తర్‌లుగా ఐసిస్ ప్రకటించింది.

ఉగ్ర పేలుళ్లకు సంబంధించి శ్రీలంక పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు జరుపుతున్నారు. కొలంబోలోని ఓ ధనవంతుల ముస్లిం కుటుంబానికి చెందిన ఇద్దరు సోదరులు దాడుల్లో పాలుపంచుకున్నట్టుగా అనుమానిస్తున్నారు. వీరిని నేషనల్ తౌహీత్ జమాత్ గ్రూపుకు చెందినవారిగా అనుమానిస్తున్నారు. కాగా, శ్రీలంక పేలుళ్లలో ఇప్పటివరకు 315మంది మృతి చెందగా.. 500 పైచిలుకు మంది గాయపడ్డారు.

ఇది కూడా చదవండి : Srilanka Blasts : భారత్ కూడా శ్రీలంకను హెచ్చరించింది.. అయినప్పటికీ..
First published: April 24, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading