Home /News /international /

CHILL DONALD CHILL GRETA THUNBERG TROLLS TRUMP WITH HIS OWN WORDS DETAILS HERE MS

US POLLS 2020: ‘చిల్ డొనాల్డ్.. చిల్..’ రివేంజ్ తీర్చుకున్న గ్రెటా థన్బర్గ్

అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్నది. బైడెన్ విజయం దాదాపు ఖాయమైపోయినట్టే. ఇక ఇది చూసి ట్రంప్ ఆగమాగమవుతున్నాడు. తాజాగా పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్బర్గ్.. డొనాల్డ్ ట్రంప్ కు షాకిచ్చారు. ఆమె గతంలో ఆయన చేసిన గేలికి రివేంజ్ తీర్చుకున్నారు.

ఇంకా చదవండి ...
  • News18
  • Last Updated :
    అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్నది. బైడెన్ విజయం దాదాపు ఖాయమైపోయినట్టే. ఇక ఇది చూసి ట్రంప్ ఆగమాగమవుతున్నాడు. సాధారణంగానే వివాదాస్పద వ్యాఖ్యలు, ట్వీట్లు చేసే ట్రంప్.. ఇక ఎన్నికల ఓటమిని భరించలేకపోతున్నాడు. అందుకే ట్విట్టర్ లో ఇష్టారీతిన పోస్టులు పెడుతున్నాడు. ఇప్పటికే ట్విట్టర్.. ఆయన పోస్ట్ చేసిన పలు వివాదాస్పద ట్వీట్లను తొలగించిన విషయం విదితమే. కాగా, తాజాగా ఆయనకు యువ పర్యావరణవేత్త గ్రెటా థన్భర్గ్ మరో షాకిచ్చారు. గతంలో ఆయన చేసిన గేలికి.. తాజాగా ఆమె రివేంజ్ తీర్చుకున్నారు.

    అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ సందర్భంగా కౌంటింగ్ ప్రక్రియపై ట్రంప్ వివాదాస్పద ట్వీట్ చేసిన విషయం విదితమే. ‘కౌంటింగ్ ప్రక్రియను ఆపండి’అంటూ ఆయన ట్వీట్ చేయగా.. దానిపై డెమొక్రాట్లు మండిపడుతున్నారు. అయితే మరోవైపు గ్రెటా మాత్రం.. ‘చిల్.. డొనాల్డ్ చిల్..’ అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. గతంలో ఆమె కు ఒక అవార్డు వచ్చిన సందర్భంలో ట్రంప్ ట్వీట్ చేసిన మాదిరిగానే ఆమె కూడా ట్వీట్ చేసి తన రివేంజ్ తీసుకుంది.









    2019 లో పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్బర్గ్ కు ఒక సంస్థ అవార్డు ఇవ్వగా.. దానిపై ట్రంప్ స్పందిస్తూ.. ‘చాలా హాస్యాస్పదం.. గ్రెటా తన యాంగర్ మేనేజ్మెంట్ సమస్యను పరిష్కరించుకోవాలి. ఆ పై స్నేహితులతో పాత ఫ్యాషన్ సినిమాకు వెళ్లండి.. చిల్.. గ్రెటా చిల్’ అంటూ ట్వీట్ పెట్టారు.





    ఇక ఇప్పుడు అదే థన్బర్గ్.. ట్రంప్ పోస్టు చేసిన స్టాప్ ది కౌంట్ ట్వీట్ పై అచ్చం అదే లా పోస్టు చేశారు. ‘చాలా హస్యాస్పదం. డొనాల్డ్ తన యాంగర్ మేనేజ్మెంట్ సమస్యపై పోరాడాలి. ఆపై స్నేహితుడితో పాత ఫ్యాషన్ సినిమాకు వెళ్లాలి. చిల్.. డొనాల్డ్ చిల్..’ అంటూ ట్వీట్ చేసి రివేంజి తీర్చుకున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టులు ట్విట్టర్ లో ట్రెండింగ్ లో ఉన్నాయి.





    పలువురు మేమ్ క్రియేటర్స్ ఈ రెండు పోస్టులను కలిపి జోకులు వేస్తున్నారు. ఇందుకు సంబంధించిన కామెడీ క్లిప్స్ ను పోస్టు చేస్తూ ఈ ట్వీట్లను వైరల్ చేసే పనిలో తలమునకలయ్యారు.
    Published by:Srinivas Munigala
    First published:

    Tags: Donald trump, US Elections 2020, Us news

    తదుపరి వార్తలు