మెట్రో రేట్ల పెంపుతో విధ్వంసం.. చిలీలో ఎమర్జెన్సీ విధింపు

చిలీలో మెట్రో టికెట్ రేట్లను పెంచుతూ ఇటీవల ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 800 నుంచి 830 పెసోలకు పెంచింది.

news18-telugu
Updated: October 19, 2019, 3:41 PM IST
మెట్రో రేట్ల పెంపుతో విధ్వంసం.. చిలీలో ఎమర్జెన్సీ విధింపు
ప్రతీకాత్మక చిత్రం (Reuters)
  • Share this:
చిలీలో ఎమర్జెన్సీ విధిస్తూ అధ్యక్షుడు సెబాస్టియన్ పినేరా ప్రకటన చేశారు. భద్రత మొత్తం సైన్యానికి అందిస్తున్నట్టు ప్రకటించారు. చిలీలో మెట్రో టికెట్ రేట్లను పెంచడంతో ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. ఆ నిరసనలు హింసాత్మకంగా మారాయి. భారీగా బస్సులను తగలబెట్టారు. ఏకంగా 12 మెట్రో స్టేషన్లను పూర్తిగా ధ్వంసం చేశారు. గంట గంటకూ ప్రజల్లో ఆందోళనల స్థాయి పెరిగిపోవడం, విధ్వంసం జరుగుతుండడంతో శుక్రవారం నుంచి అత్యయిక పరిస్థితి విధిస్తున్నట్టు చిలీ అధ్యక్షుడు ప్రకటించారు. మేజర్ జనరల్ జేవియర్‌కు దేశ భద్రత బాధ్యతలను అప్పగించారు. ‘ఎమర్జెన్సీ విధించడానికి కారణం ఒక్కటే. శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల భద్రతే ముఖ్యం.’అని అధ్యక్షుడు సెబాస్టియన్ పినేరా ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

దేశంలో ఎమర్జెన్సీ ప్రాధమికంగా 15 రోజుల పాటు అమల్లో ఉంటుంది. ప్రజలు గుంపులు గుంపులుగా తిరగడానికి వీల్లేదు. గుమిగూడి ప్రదర్శనలు చేయడం కూడా నిషేధం. ఎమర్జెన్సీ నేపథ్యంలో ఈ వారాంతంలో జరగాల్సిన ఫుట్ బాల్ మ్యాచ్‌లను జాతీయ ఫుట్ బాల్ అసోసియేషన్ రద్దు చేసింది. ప్రస్తుతం ఎలాంటి కర్ఫ్యూ విధించలేదని మేజర్ జనరల్ జేవియర్ ఇటురిగా ప్రకటించారు.

చిలీలో మెట్రో టికెట్ రేట్లను పెంచుతూ ఇటీవల ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 800 నుంచి 830 పెసోలకు పెంచింది. అది కూడా రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో. గత జనవరిలో 20 పెసోలు పెంచింది. పెట్రో ధరల పెరుగుదల వల్ల ఈ పెంపు తప్పడం లేదని ప్రభుత్వం చెబుతోంది. అయితే టికెట్ రేట్ల పెంపును వ్యతిరేకిస్తూ విద్యార్థులు ఉద్యమం లేవనెత్తారు. అది ప్రజా ఉద్యమంగా మారింది. ఆందోళనకారులు రోడ్డెక్కి హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు.

జగన్ ఫొటోకు జనసేన ఎమ్మెల్యే పాలాభిషేకంFirst published: October 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>