ఈ రోజుల్లో పాఠశాలల్లో వ్యాయామానికి కూడా కొంత సమయం కేటాయించడం సాధారణ విషయం. కానీ వ్యాయామంలో భాగంగా స్కూల్ పిల్లలతో ఐస్ వాటర్‌తో స్నానం చేయిస్తున్న సంఘటన వైరల్ అవుతోంది. ఇదంతా విద్యార్థుల ఆరోగ్యం కోసమేనని యాజమాన్యం చెబుతోంది. కానీ ఇది మన దగ్గర కాదు. మంచు ఎక్కువగా కురిసే సైబీరియాలోని పాఠశాల విద్యావిధానంలో ఇవన్నీ ఒక భాగంగా ఉన్నాయి. సైబీరియన్ కిండర్ గార్టెన్ పాఠశాల విద్యార్థులందరూ ప్రతిరోజూ ఉదయం తప్పకుండా ఒక బకెట్ ఐస్ వాటర్‌తో స్నానం చేయాలి. మంచు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలు వేడి ఆవిరితో చేసే సానా బాత్ (hot sauna) తరువాత, 25 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు ఇలా చన్నీటి స్నానం చేయాలి. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్లో వైరల్‌గా మారుతున్నాయి.
ఇలాంటి రోజువారీ వ్యాయామం పిల్లలను ఆరోగ్యంగా ఉంచుతుందని పాఠశాల ఉపాధ్యాయులు, అధికారులు చెబుతున్నారు. ఐస్ వాటర్ స్నానం వల్ల విద్యార్థులు ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉంటారని స్థానికులు నమ్ముతారు. దీంతోపాటు చలికి తట్టుకునేలా శ్వాస సంబంధ వ్యాయామాలు కూడా పిల్లలకు నేర్పిస్తారు.
* బలవంతం ఉండదు:
పిల్లలు ఇళ్లలో సానా బాత్ చేసి వచ్చాక, చల్లటి నీటితో స్నానం చేయాల్సి ఉంటుందని అక్కడి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అధికారులు తెలిపారు. ఈ సంప్రదాయ చన్నీటి స్నానం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని అక్కడి పాఠశాల ఉపాధ్యాయులు చెబుతున్నారు. ‘‘వాతావరణం మారుతున్న సమయాల్లో పిల్లలు ఫ్లూ ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని డాక్టర్లు చెప్పారు. ప్రస్తుతం ఇక్కడ మంచు కురుస్తోంది. ఇలాంటి వాతావరణాన్ని తట్టుకునేందుకు కొత్తరకం వ్యాయామాలు చేయాలి. అప్పుడే పిల్లలు మరింత చురుకుగా, తెలివిగా ఉంటారు. పాఠశాల విద్యార్థులందరూ ప్రతి ఉదయం ఐస్ వాటర్‌తో స్నానం చేయాల్సి ఉంటుంది. కానీ మేము ఎవరినీ బలవంతం చేయం” అని ప్రీ స్కూల్ టీచర్, స్విమ్మింగ్ కోచ్ ఒక్సానా కబోట్కో తెలిపారు.
ఇది కూడా చదవండి: Zodiac signs: ఏ రాశి వారికి ఎలాంటి భయాలు ఉంటాయి... తెలుసుకోండి
అక్కడ కూడా అంతే:
భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లోని హన్జా లోయ (hunza valley)లో కూడా ప్రజలు ఇలాగే చల్లటి నీటితోనే స్నానం చేస్తారు. అక్కడ కూడా చుట్టూ మంచు పర్వతాలే ఉంటాయి. ఎప్పుడూ మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతే ఉంటుంది. హన్జా వ్యాలీలో ప్రజలకు ఏ వ్యాధులూ రావట్లేదు. అక్కడి వాళ్లు 100 ఏళ్లకు పైగా జీవిస్తున్నారు. ముసలివాళ్లు కూడా యంగ్ ఏజ్ వాళ్లలా కనిపిస్తున్నారు. వాళ్ల ఆరోగ్య రహస్యాల్లో... చల్లటి నీటితో స్నానం చేయడం కూడా ఒకటని పరిశోధనల్లో తేలింది.
Published by:Krishna Kumar N
First published:January 23, 2021, 11:19 IST