హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Chicago Man: ఏడాదంతా అతడికి అదే పని.. గడ్డ కట్టే చలిలోనూ అతడు వదల్లేదు..

Chicago Man: ఏడాదంతా అతడికి అదే పని.. గడ్డ కట్టే చలిలోనూ అతడు వదల్లేదు..

Chicago Man: చికాగోకు చెందిన డాన్‌ ఓ కానర్‌ బస్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు‌. ఇంటికి వస్తే ప్రశాంతంగా ఉండనివ్వకపోవడం.. ఆఫీస్‌కు వెళితే అధికారులు ఒత్తిడి తేవడం.. దీనికి తోడూ రోజు 12 గంటలకు పైగా బస్‌ నడపడంతో తీవ్ర ఒత్తిడికి లోనయ్యేవాడు. దాని బారి నుంచి తప్పించుకోవాడానికి అతడు భిన్నంగా ఆలోచించాడు. అదేంటంటే..

ఇంకా చదవండి ...

  అతడొక బస్ డ్రైవర్. ప్రతీ రోజు 12 గంటల డ్యూటీ. విధులు ముగిసిన తర్వాత తీవ్ర మానసికంగానూ, శారీరకంగానూ తీవ్ర ఒత్తిడికి లోనయ్యేవాడు. అయితే తన ఒత్తిడిని వదిలించుకోవడానికి అతడు భిన్నంగా ఆలోచించాడు. ఒత్తిడిని దూరం చేయడానికి కొంతమంది స్విమ్మింగ్‌ను మార్గంగా ఏంచుకుంటారు. అయితే స్విమ్మింగ్‌ చేసేవాళ్లు మహా అయితే నెల రోజులు కంటిన్యూగా చేయగలుగుతారు. కానీ ఈ బస్‌డ్రైవర్‌ మాత్రం 365 రోజుల నుంచి ప్రతీరోజు లేక్‌ మిచిగాన్‌లో ఈత కొట్టడానికి వస్తూనే ఉన్నాడు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. చికాగోకు చెందిన డాన్‌ ఓ కానర్‌ అనే వ్యక్తి బస్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అతడు 12 గంటల వరకు విధులు నిర్వహించడంతో ప్రతీ రోజు ఒత్తిడిగా ఫీల్ అయ్యేవాడు. ఇంటికి వస్తే ప్రశాంతంగా ఉండొచ్చని అనుకునేలోపు ఇంట్లో కూడా ప్రశాంతత లేకపోవడంతో ఏం చేయాలో అర్థం కాలేదు. అయితే మొదటి కరోనా వేవ్ సమయంలో కరోనా మహమ్మారితో అమెరికా మొత్తం లాక్‌డౌన్‌ ఉండడంతో అతనికి పని తగ్గిపోయింది. ఆ సమయంలో అతడు ఓ రోజు సరదాగా ఈతకు వెళ్లాడు.

  అతడు ఆ రోజు ఈతకు వెళ్లి వచ్చిన తర్వాత తన మనస్సుకు ప్రశాంతంగా అనిపించడంతో పాటు ఒత్తిడిని జయించినట్లు అయిందని తెలిపాడు. అయితే అతడు అప్పటి నుంచి ప్రతీ రోజు ఈతకు వెళ్లి తన ఒత్తిడిని తగ్గించుకునే వాడు. గతేడాది సరిగ్గా ఇదే రోజున మాంట్రోస్‌ హార్బర్‌లో ఉన్న లేక్‌ మిషిగాన్‌కు చేరుకొని దూకడం ప్రారంభించాడు. నేటికి అతను ఈత కొట్టడం ప్రారంభించి 365 రోజులు అయింది. అప్పటినుంచి కాలాలు మారుతున్నా తన పని మాత్రం ఆపలేదు. గడ్డకట్టే చలిలోనూ వచ్చి నదిలో దూకడంతో గడ్డకట్టిన నీళ్లతో దాదాపు 20 సార్లు దెబ్బలు తగలడంతో పాటు ఒంటినిండా గాట్లు పడేవి. అంత బాధను ఓర్చుకొని తన పని కానిచ్చి వెళ్లిపోయేవాడు.

  అలా సరిగ్గా నిన్న(శనివారంతో) ఏడాది పూర్తి కానుండడంతో కానర్‌ సంతోషంలో ఉన్నాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. ఓ వైపు కరోనా.. మరో వైపు ఒత్తిడి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో మానసిక ప్రశాంతతను పొందడానికి లేక్‌ మిషిగాన్‌ను ఏంచుకున్నట్లు తెలిపాడు. 365 రోజులుగా నదిలో దూకుతున్న ప్రతీసారి కొత్తగానే కనిపించేదన్నాడు. కానర్‌ చేసిన పని ఇప్పుడు అక్కడ హాట్‌టాపిక్‌గా మారింది.

  First published:

  Tags: America

  ఉత్తమ కథలు