షాంపూ, మేకప్‌తో ముందస్తు మరణం -వాటిలోని థాలేట్ వల్ల ఏటా లక్ష మంది బలి - NYU షాకింగ్ రిపోర్ట్

షాంపూలో కెమికల్స్

నిత్యజీవితంలో అనివార్యంగా ఉపయోగించే వస్తువుల వల్ల మనిషి తొందరగా చనిపోతున్నాడని, షాంపూ, మేకప్ లాంటి సౌందర్య సాధనాల్లో ఉండే రసాయనాల వల్ల ఆయువు తగ్గిపోతున్నదని సైంటిస్టులు పేర్కొన్నారు. ప్రపంచ ప్రఖ్యాత న్యూయార్క్ యూనివ్సిటీ అనుబంధ మెడికల్ స్కూల్ వారు వేల మంది నుంచి డేటాను సేకరించి ఈ నిర్ధారణకు వచ్చారు. రోజువారీ వస్తువుల్లో కెమికల్స్ దుష్ఫ్రభావం వల్ల ఒక్క అమెరికాలోనే ఏటా 1లక్ష మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు అధ్యయనంలో తేలింది...

  • Share this:
ఆధునిక యుగంలో సర్వం రసాయనమయం(everywhere chemicals)అనే మాట తెలిసిందే. పెరిగిన జనాభాకు సరిపడా వస్తువుల్ని అందుబాటులో ఉంచాలంటే తప్పనిసరిగా వాటిని ప్రాసెస్ చేయాల్సిన క్రమంలో అన్ని చోట్లా రసాయాల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. కాగా, సౌందర్య సాధనాల్లోని ప్రమాదకర రసాయనాలు వినియోగదారులపై అతి తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నట్లు మరోసారి నిరూపణ అయింది. రోజువారీగా మనం వాడే వస్తువుల్లో రసాయనాల వల్ల తలెత్తే విపరీతాలపై తరచూ హెచ్చరికలు వెలువడుతున్నా, ఇప్పుడు మాత్రం నిరూపిత ఆధారాలు, పక్కా గణాంకాలతో ఓ రిపోర్టు బయటికొచ్చింది..

తల స్నానానికి వాడే షాంపూలు, ముఖానికి వాడే మేకప్ లాంటి సౌందర్య సాధనాల వల్ల మనిషి ఆయుష్షు తగ్గిపోతున్నట్లు సైంటిస్టులు తేల్చారు. షాపూ, మేకప్, ఆహాన్ని నిల్వచేసే కంటైనర్లు, పెర్ఫ్యూమ్, చిన్నపిల్లల ఆటబొమ్మలు ఇంకా వందలాది ఉత్పత్తుల్లో ప్రమాదకర రసాయనాలు అనుకున్నదానికంటే తీవ్రంగానే మనిషిపై ప్రభావం చూపుతున్నట్లు నిర్ధారణ అయింది. ఆయా ఉత్పత్తుల్లో రసాయన ధాతువులైన థాటేల్స్ వల్ల వినియోగదారుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోందని తాజా అధ్యయనంలో తేలింది..

covaxin: వచ్చే నెల నుంచే పిల్లలకు వ్యాక్సిన్ పంపిణీ -ముందుగా వీరికే -ఇంకా అనుమతి రాలేదన్న కేంద్ర మంత్రి


ప్రఖ్యాత న్యూయార్క్ యూనివర్సిటీకి అనుబంధంగా కొనసాగుతోన్న ‘న్యూయార్క్ యూనివర్సిటీ లాంగాన్ హెల్త్ అకాడమీ’కి చెందిన సైంటిస్టులు, నిపుణుల బృందం.. కెమికల్ విపరీతాలపై ఫస్ట్ హ్యాడ్ పరిశీలనలో గుర్తించిన అంశాలతో రూపొందించిన రిపోర్టును ప్రముఖ‘ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్’జర్నల్ ప్రచురించింది. న్యూయార్క్ కేంద్రంగా సాగిన ఆ అధ్యయనంలో, 55 నుంచి 64 సంవత్సరాల వయసున్న 5వేల మంది డేటాను విశ్లేషించి నిపుణులు కీలక నిర్ధారణలకు వచ్చారు..

షాంపూ, మేకప్ ఇంకా ఇతర వస్తులు సుదీర్ఘకాలం పాటు నిల్వ ఉండేలా వాటిలో కొన్ని రసాయనాలను కలుపుతారన్నది తెలిసిందే. సదరు వస్తువులను వాడినప్పుడు థాలేల్స్ అని పిలిచే ఆ రసాయనాలు మన ఒంట్లోకి ప్రవేశించి, హార్మోన్ల పనితీరును ప్రభావితం చేస్తాయని, మెదడు, రోగ నిరోధక వ్యవస్థలతోపాటు పునరుత్పత్తి వ్యవస్థపైనా ఆ థాలేల్స్ ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని, దాంతో గుండె సంబంధిత, మధుమేహం, స్థూలకాయం లాంటి జబ్బులు తలెత్తుతాయని స్టడీలో తేలినట్లు నిపుణులు చెప్పారు.

ప్రకాశ్ రాజ్ ప్యానెల్ పచ్చి అబద్ధాలు - 20ఏళ్లుగా MAA Elections అధికారిని నేనే: కృష్ణమోహన్ -అక్రమాలపై యాక్షన్ ఉంటుందా?


రోజువారీ వస్తువుల్లో రసాయనాల వల్ల మనుషులు బతకాల్సిన దానికంటే ముందుగానే బకెట్ తన్నేస్తున్నారని, థాలేట్స్ వల్ల ఆయుష్షు తగ్గిపోయి చనిపోతున్నవారి సంఖ్య అమెరికాలో ఏటా 91వేల నుంచి 1.07లక్షలుగా ఉందని అధ్యనానికి నేతృత్వం వహించిన లియోనార్డో ట్రాసాండే(న్యూయార్క్ వర్సిటీ లాంగోన్ సెంటర్ ఫర్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ హజార్డ్స్ విభాగం డైరెక్టర్) తెలిపారు. కాగా, ఎప్పటిలాగే ఈ రిపోర్టును కూడా పాశ్రామివర్గాలు లైట్ తీసుకున్నాయి.

షాంపూలు, మేకప్ సాధనాల వల్ల ముందస్తు మరణాలు సంభవిస్తున్నట్లు న్యూయార్క్ వర్సిటీ అనుబంధ సైంటిస్టులు రాసిన స్టడీ రిపోర్టును అమెరికన్ కెమిస్ట్రీ కౌన్సిల్ కొట్టిపారేసింది. అమెరికాలోని కెమికల్, ప్లాస్టిక్, క్లోరిన్ పరిశ్రమలకు ఈ కెమిస్ట్రీ కౌన్సిల్ ప్రాతినిధ్యం వహిస్తున్నది. డాక్టర్ లియోనార్డో బృందం జరిపిన అధ్యయనంలో ‘కచ్చితంగా నిరూపితమయ్యే అంశాలు లేవు’అని కౌన్సిల్ పేర్కొంది. అయితే, కౌన్సిల్ వాదనతో విభేదిస్తూ.. షాంపూ లాంటి వస్తువుల వల్ల మనుషులకు ప్రమాదం లేదని కంపెనీలు నిరూపించలేవుకదా? అని అన్నారు.
Published by:Madhu Kota
First published: