Krishna Kumar NKrishna Kumar N
|
news18-telugu
Updated: August 28, 2019, 9:19 AM IST
చిరుతతో సెల్ఫీ (Image : YT - T&T Creative Media)
Cheetah : ఆఫ్రికా దేశం... టాంజానియా... సెరెంజెటీ సఫారీలో పర్యాటకులకు వింత అనుభవం ఎదురైంది. ఓ ఫ్యామిలీ... జీప్ లోంచీ రెండు చిరుతపులులను చూస్తుండగా... వాటిలో ఒకటి దగ్గరకు వచ్చి ఏకగా జీప్ టాప్ ఎక్కింది. అక్కడ తెరచివున్న సన్ రూఫ్ నుంచీ వాళ్లను నిశితంగా చూసింది. ఐతే... వాళ్ల గైడ్ మాత్రం భయపడవద్దని వాళ్లకు సూచించాడు. "ఇలాంటి సమయంలోనే మనం సెల్ఫీ తీసుకోవాలి" అంటూ సెల్ఫీ తీసుకున్నాడు. అతను అంత ధైర్యంగా సెల్ఫీ తీసుకోవడానికి కారణం... ఆ రెండు చిరుతపులులూ... అంతకు ముందే... తమకు కావాల్సిన జంతువుల్ని వేటాడి... హాయిగా తిన్నాయి. ఇక వాటికి ఆహారంపై ఆసక్తి లేదు. అందువల్ల అవి మనుషుల జోలికి రావు. ఈ సంగతి గైడ్కి తెలుసు. వాటి పరిస్థితిని క్యాష్ చేసుకొని... సెల్ఫీ తీసుకున్నాడు. ఈ అనుభవాన్ని తమ జీవితంలో మర్చిపోలేమన్నారు ఆ టూరిస్ట్ ఫ్యామిలీ సభ్యులు.
Published by:
Krishna Kumar N
First published:
August 28, 2019, 9:19 AM IST