Video : గాల్లో నిలబడిన పక్షి... వైరల్ అవుతున్న వీడియో...

Male Kestrel Bird : పక్షులన్నాక గాల్లో ఎగరగలవు. గద్దల లాంటివి... రెక్కలు ఊపకుండానే... కొంతసేపు... గాల్లో తేలుతూ వెళ్లగలవు. ఐతే... ఆ పక్షి మాత్రం... తల ఏమాత్రం కదపకుండా గాల్లో నిలబడగలగడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

Krishna Kumar N | news18-telugu
Updated: August 30, 2019, 10:10 AM IST
Video : గాల్లో నిలబడిన పక్షి... వైరల్ అవుతున్న వీడియో...
ప్రతీకాత్మక చిత్రం
Krishna Kumar N | news18-telugu
Updated: August 30, 2019, 10:10 AM IST
అడవుల్లో తిరుగుతూ... జంతువులు, పక్షుల్ని పరిశోధించే ఆంటోనీ రాబెర్ట్స్ ఇటీవల మగ కెస్ట్రెల్ పక్షిని వీడియో తీశారు. వేల్స్... ఏంజెల్సీలోని... సౌత్ స్టాక్ ఐలాండ్ దగ్గర ఆయన కెమెరాతో షూట్ చేస్తున్నప్పుడు ఆ పక్షి... చేపల వేటలో తలమునకలై ఉంది. చేపల్ని కనిపెట్టేందుకు ఆ పక్షి గాల్లో తేలుతూ... ఒకే చోట స్థిరంగా ఉంటూ... ఎదురుగా వస్తున్న జోరు గాలిని కూడా తట్టుకుంటూ ఉంది. ఐతే... ఆ జోరు గాలికి... పక్షి మొత్తం అటూ ఇటూ కదిలిపోతోంది గానీ... పక్షి తల మాత్రం నిలకడగానే ఉంది. అంత బలమైన ఈదురుగాలులు వస్తే... ఎదురు నిలవడం చాలా కష్టం. కానీ ఆ పక్షి... చేపల వేటలో భాగంగా... చేపల కోసం నీటిలోకి నిశితంగా చూస్తూ ఉండటం వల్ల... తల కదపకుండా... శ్రద్ధ మొత్తం నీటిపైనే పెట్టింది.


ఇప్పుడీ వీడియో వైరల్ అయ్యింది. చేపల కోసం పక్షులు ఎంత ఏకాగ్రతతో వేటాడతాయో ఈ వీడియో ద్వారా అర్థమవుతోంది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో వస్తున్న గాలుల్ని ఆ పక్షి తట్టుకొని గాల్లో స్థిరంగా నిలబడటమేకాక... తలను కదపకుండా ఉండటం గొప్ప విషయం అంటున్నారు ఆంటోనీ రాబెర్ట్స్.

First published: August 30, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...