మరోసారి ప్రపంచాన్ని రక్షించడానికి సిద్దమైన హెల్‌బాయ్‌

హెల్‌బాయ్‌.. ఈ  సినిమా పేరు తెలియని హాలీవుడ్ అభిమానులు ఉండరని చెప్పోచ్చు. అంత పాపులర్ హెల్‌బాయ్ ఆకారం, ఆయన తీరు. కొమ్ములు కత్తిరించిన తల, భారీ ఆకారం, ఎర్రటి చర్మంతో ఉంటాడు హెల్‌బాయ్. హాలీవుడ్‌‌ సినిమా ప్రేక్షకులను హెల్‌బాయ్ ఇప్పటికే రెండు సార్లు అలరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి హెల్‌బాయ్‌ సందడి చేసేందుకు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు

news18-telugu
Updated: December 21, 2018, 11:18 AM IST
మరోసారి ప్రపంచాన్ని రక్షించడానికి సిద్దమైన హెల్‌బాయ్‌
హెల్‌బాయ్‌/ ట్విటర్
  • Share this:
హెల్‌బాయ్‌.. ఈ  సినిమా పేరు తెలియని హాలీవుడ్ అభిమానులు ఉండరని చెప్పోచ్చు. అంత పాపులర్ హెల్‌బాయ్ ఆకారం, ఆయన తీరు. కొమ్ములు కత్తిరించిన తల, భారీ ఆకారం, ఎర్రటి చర్మంతో ఉంటాడు హెల్‌బాయ్. హాలీవుడ్‌‌ సినిమా ప్రేక్షకులను హెల్‌బాయ్ ఇప్పటికే రెండు సార్లు అలరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి హెల్‌బాయ్‌ సందడి చేసేందుకు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అందులో భాగంగా చిత్ర బృందం ‘హెల్‌బాయ్‌’ కి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేసింది.

అమెరికన్ డార్క్‌ హార్స్‌ కామిక్స్‌ క్యారెక్టర్స్‌లో ఒకటి హెల్‌బాయ్‌ క్యారెక్టర్. దీనికి సంబంధించిన మొదటి సినిమా 1993లో విడుదలై విశేషాదరణ పొందింది. మానవజాతిని అంతం చేసి, ఏలాగైన తమ సామ్రాజ్యాన్ని సృష్టించుకోవాలని ఆరాటపడే దుష్టశక్తులను  ఏవిధంగా  హెల్‌బాయ్‌ ఎదుర్కొన్నాడన్నదే ఈ సినిమా కథ.

ఆ తర్వాత 2004లో మరో సినిమా హెల్‌బాయ్‌‌కి సిక్వెల్‌గా వచ్చింది. చివరగా హెల్‌బాయ్‌ 2: ది గోల్డెన్‌ ఆర్మీ 2008లో వచ్చింది. ఇప్పుడు మూడో చిత్రం వస్తోంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ తాజా చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్‌ 12న రాబోతుంది.  డేవిడ్‌ హార్బర్‌, ఇయాన్‌ మెక్‌షానే, మిల్లా జవోవిచ్‌,  షషాలేన్‌, డేనియల్‌ డేకిమ్‌లు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను  నెయిల్‌మార్షల్‌ దర్శకత్వం వహిస్తున్నారు. దీనికి సంబంధించిన ట్రైలర్‌ను ఇక్కడ చూడోచ్చు.

Photos: శాన్వీ శ్రీవాత్సవ హాట్ ఫోటోస్
 
First published: December 21, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading