హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Charles III : బ్రిటన్ లో కొత్త శకం..రాజుగా ఛార్లెస్‌ అధికార ప్రకటన

Charles III : బ్రిటన్ లో కొత్త శకం..రాజుగా ఛార్లెస్‌ అధికార ప్రకటన

బ్రిటన్ రాజు ఛార్లెస్‌ 3

బ్రిటన్ రాజు ఛార్లెస్‌ 3

King Charles III : లండన్ లోని చారిత్రక సెయింట్ జేమ్స్ ప్యాలెస్‌లో జరిగిన కార్యక్రమంలో ఛార్లెస్‌ సతీమణి క్వీన్‌ కాన్సర్ట్‌ కెమిల్లా కుమారుడు ప్రిన్స్ విలియమ్‌ సహా అతి కొద్ది మంది అతిథుల సమక్షంలో రాజుగా ఛార్లెస్‌(Charles)పేరును అధికారికంగా ప్రకటించారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Charles Named King At Royal Ceremony : బ్రిటన్(Britain)​ రాజ చరిత్ర(Royal Family)లో నూతన శకం ఆరంభమైంది. ఏడు దశాబ్దాలకుపైగా సుదీర్ఘ కాలంపాటు బ్రిటన్‌ను పాలించిన క్వీన్ ఎలిజబెత్‌-2(Queen Elizabeth 2) గురువారం కన్నుమూసిన నేపథ్యంలో ఆమె పెద్ద కుమారుడు, వేల్స్‌ మాజీ యువరాజు ఛార్లెస్‌(73)ను బ్రిటన్ నూతన రాజుగా అధికారికంగా ప్రకటించారు. లండన్ లోని చారిత్రక సెయింట్ జేమ్స్ ప్యాలెస్‌లో జరిగిన కార్యక్రమంలో ఛార్లెస్‌ సతీమణి క్వీన్‌ కాన్సర్ట్‌ కెమిల్లా కుమారుడు ప్రిన్స్ విలియమ్‌ సహా అతి కొద్ది మంది అతిథుల సమక్షంలో రాజుగా ఛార్లెస్‌(Charles)పేరును అధికారికంగా ప్రకటించారు. ఈ కార్య‌క్ర‌మానికి సుమారు 200 మంది హాజ‌రయ్యారు. బ్రిట‌న్ ప్ర‌ధాని లిజ్ ట్ర‌స్‌తో పాటు ఆరుగురు మాజీ ప్ర‌ధానులు కూడా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఛార్లెస్‌-3ను రాజుగా ప్ర‌క‌టించిన త‌ర్వాత ఆయ‌న స‌ద‌రు డాక్యుమెంట్‌పై సంత‌కం చేశారు. సంబంధిత పత్రంపై బ్రిటన్‌ ప్రధాని, కాంటర్‌బరీ ఆర్చిబిషప్‌, లార్డ్ ఛాన్స్‌లర్, పలువురు సీనియర్లు సంతకాలు చేశారు. అంతకుబుందు ఛార్లెస్‌ ను రాజుగా ప్రకటించేందుకు సీనియర్‌ మంత్రులు, న్యాయమూర్తులు, మత పెద్దలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మొదట బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ మరణాన్ని అధికారికంగా ప్రకటించిన తర్వాత శాసనకర్తలందరూ కొత్త రాజుకు తమ విధేయత తెలిపారు. తర్వాత అధికారికంగా ప్రకటన చేశారు. సంబంధిత డాక్యుమెంట్ పై ఛార్లెస్‌ సంత‌కం చేయ‌డానికి రూమ్‌లో ఉన్న అంద‌రూ గాడ్ సేవ్ ద కింగ్ అని నినాదం చేశారు. ఇకపై ఛార్లెస్​ను కింగ్​ ఛార్లెస్​-3(King  Charles III)గా పిలుస్తారు. ఆయన భార్య కామిలాను క్వీన్ కాన్సర్ట్‌ పేరుతో వ్యవహరిస్తారు. దాదాపు 240 కోట్ల జనాభా కలిగిన 56 స్వతంత్ర దేశాల కామన్‌వెల్త్ కూటమికి ఛార్లెస్ నాయకుడు అవుతారు. వీటిలో 14 దేశాలకు, బ్రిటన్‌కు ఆయన అధినేతగా ఉంటారు.

రాజుగా ప్ర‌మాణం చేసిన కింగ్ ఛార్లెస్ త‌న త‌ల్లి మ‌ర‌ణ‌వార్త‌పై ప్ర‌క‌ట‌న చేశారు. జీవిత కాలం ప్రేమ‌ను పంచాల‌ని, నిస్వార్థ సేవ చేయాల‌ని త‌న త‌ల్లి ఎలిజబెత్ త‌న‌కు నేర్పిన‌ట్లు ఛార్లెస్ తెలిపారు. త‌న త‌ల్లి రాజ్యాన్ని ఏలిన స‌మ‌యం, ఆమె అంకిత భావం, ఆమె భ‌క్తి అసాధార‌ణ‌మైన‌వ‌ని అన్నారు. ఇది విషాద‌క‌ర స‌మ‌య‌మే అయినా, ఆమె విశ్వ‌స‌నీయ‌మైన జీవితానికి థ్యాంక్స్ చెబుతున్న‌ట్లు కింగ్ ఛార్లెస్ తెలిపారు. అలాగే తన భార్య కెమిల్లా తనకెప్పుడూ మద్దతుగా ఉన్నారని తెలిపారు. ఒక రాజుగా తన బాధ్యతల గురించి పూర్తి అవగాహనతో ఉన్నానని ఛార్లెస్‌ చెప్పారు.

Free Stay : రూపాయి ఖర్చు లేకుండా..మన దేశంలోని ఆ ఆశ్రమాల్లో ఫ్రీ షెల్టర్,ఉచితంగానే భోజనం కూడా

కాగా, కింగ్ ఛార్లెస్ పట్టాభిషేకానికి మాత్రం కొన్ని నెలల సమయం పడుతుందని భావిస్తున్నారు. పట్టాభిషేకానికి అనుసరించే ప్రక్రియ సుదీర్ఘంగా ఉండడమే ఇందుకు కారణమని బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ వెల్లడించింది. క్వీన్ ఎలిజబెత్‌ను 1952 ఫిబ్రవరిలో రాణిగా ప్రకటించగా పట్టాభిషేకం 1953 జూన్‌ లో జరిగింది. 900 ఏళ్లుగా పట్టాభిషేక మహోత్సవం జరుగుతున్న వెస్ట్‌మినిస్టర్ అబేలోనే ఈసారి ఛార్లెస్‌ ప్రమాణ స్వీకారం జరగనుంది. ఈ పట్టాభిషేకంతో బ్రిటన్‌ 40వ రాజుగా ఛార్లెస్‌ చరిత్ర పుటల్లో నిలవనున్నారు.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Britain, Queen Elizabeth II, Uk

ఉత్తమ కథలు