గల్ఫ్ కార్మికుల వేతనాల్లో మార్పుల్లేవ్.. పార్లమెంట్ లో కీలక ప్రకటన చేసిన కేంద్ర ప్రభుత్వం

పార్లమెంటు భవనం

సొంత ఊళ్లో ఉపాధి లేక, కుటుంబ కష్టాలను తీర్చేందుకు లక్షలాది మంది పౌరులు గల్ఫ్ దేశాల బాట పడుతున్న సంగతి తెలిసిందే. ఆ దేశాల్లో కఠిన చట్టాలను భరిస్తూ, కష్టాన్ని పంటిబిగువున ఓర్చుకుంటూ గల్ఫ్ కార్మికులు కుటుంబ సభ్యుల కోసం చెమటోడ్చుతుంటారు

  • Share this:
    సొంత ఊళ్లో ఉపాధి లేక, కుటుంబ కష్టాలను తీర్చేందుకు లక్షలాది మంది పౌరులు గల్ఫ్ దేశాల బాట పడుతున్న సంగతి తెలిసిందే. ఆ దేశాల్లో కఠిన చట్టాలను భరిస్తూ, కష్టాన్ని పంటిబిగువున ఓర్చుకుంటూ గల్ఫ్ కార్మికులు కుటుంబ సభ్యుల కోసం చెమటోడ్చుతుంటారు. వచ్చిన డబ్బును వచ్చినట్టే తమ ఇళ్లకు పంపిస్తుంటారు. అలాంటి కార్మికులకు ఆరు నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీరని కష్టాన్ని మిగుల్చుతోంది. ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లే కార్మికులకు కనీస వేతనాలను తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం పట్ల గల్ఫ్ కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పలు గల్ప్ సంఘాలు ఎంపీల మద్దతను కూడగట్టి గల్ప్ కార్మికుల కష్టాలను పార్లమెంట్ దృష్టికి తీసుకొచ్చింది.

    ఆరునెలల క్రితం సెప్టెంబర్ 2020 లో ఆరు అరబ్ గల్ఫ్ దేశాలకు వెళ్లే  కార్మికుల కనీస వేతనాలను (మినిమమ్ రెఫరల్ వేజెస్) తగ్గిస్తూ భారత ప్రభుత్వం సర్క్యులర్లను జారీ చేసిన సంగతి తెలిసిందే. వాటిని రద్దుచేయాలనీ, వాటి స్థానంలో పాత చట్టాలనే కొనసాగించాలని గల్ఫ్ కార్మికులు కొన్ని నెలలుగా కేంద్రానికి విన్నపించుకుంటున్నారు. అయితే ఈ విన్నపాలపై కేంద్రం స్పందించింది. పార్లమెంట్లో ఓ ప్రకటన చేసింది. ప్రస్తుతానికి గల్ఫ్ కార్మికులకు కనీస వేతనాలను (మినిమమ్ రెఫరల్ వేజెస్) ను సవరించే ప్రతిపాదన ఏదీ లేదని, కోవిడ్ వలన ఉత్పన్నమైన ఆర్ధిక  పరిస్థితుల దృష్ట్యా అన్ని విషయాలను పరిగణలోకి తీసుకొని ఇటీవల సమీక్షించామని విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వి. మురళీధరన్ బుధవారం లోక్ సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
    ఇది కూడా చదవండి: నా డబ్బు.. నా ఇష్టమంటూ.. 60 ఏళ్ల వృద్ధ డాక్టర్ నిర్వాకం.. అమ్మాయిలతో చాటింగ్ కోసం రూ.70 లక్షలు..!

    30 నుండి 50 శాతం వేతనాలను తగ్గిస్తూ జారీచేసిన సర్కులర్ల ప్రభావం రాబోయే కాలంలో గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న 88 లక్షల మంది భారతీయ కార్మికులు, ఉద్యోగుల ఆదాయంపై ప్రభావం చూపుతుందని ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షులు మంద భీంరెడ్డి అన్నారు. ఖతార్ ప్రభుత్వం అన్ని దేశాల కార్మికులకు 1,000 రియాళ్ళ కనీస వేతనం, వసతికి 500 రియాళ్ళు, భోజనానికి 300 రియాళ్ళు ఇవ్వాలని చట్టం చేసిందని, భారత ప్రభుత్వం తమ కార్మికులను 728 రియాళ్లకే (200 డాలర్లు) పంపిస్తామని చెప్పడం వల్ల గల్ఫ్ కార్మికులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మానవతా హృదయంతో కేంద్రం స్పందించి తమ నిర్ణయాన్ని సమీక్షించుకోవాలని మంద బీంరెడ్డి కోరారు.
    ఇది కూడా చదవండి: చేయని నేరానికి 20 ఏళ్లు జైల్లోనే మగ్గిపోయిన విష్ణు.. 43 ఏళ్ల వయసులో నిర్దోషిగా విడుదలయ్యాక ప్రస్తుతం ఏం చేస్తున్నాడంటే..
    Published by:Hasaan Kandula
    First published: