హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

'ఖషోగ్జీ' మృతదేహాన్ని ముక్కలు చేసి.. బ్యాగుల్లో తరలించారు: టర్కీ ఛానెల్ సంచలనం

'ఖషోగ్జీ' మృతదేహాన్ని ముక్కలు చేసి.. బ్యాగుల్లో తరలించారు: టర్కీ ఛానెల్ సంచలనం

ఖషోగ్జీ మరణానికి ముందు చివరిసారిగా ఇస్తాంబుల్‌లోని సౌదీ కార్యాలయంలోకి వెళ్తూ కనిపించాడు. ఆ తర్వాత రెండు వారాల పాటు ఆయన ఆచూకీ తెలియరాలేదు. చివరకు ఆయన హత్యకు గురైనట్టు తేలింది.

  సౌదీ జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్జీ హత్య ఉదంతంలో మరో సంచలన విషయం వెలుగుచూసింది. ఖషోగ్జీ మృతదేహాన్ని ముక్కలు చేసి బ్యాగుల్లో వాటిని తరలించినట్టు టర్కీకి చెందిన సీ ఛానెల్ వెల్లడించింది. అంతేకాదు, దానికి సంబంధించిన సీసీటీవి ఫుటేజీని కూడా ఆదివారం ప్రసారం చేసింది.

  ఇస్తాంబుల్‌లోని సౌదీ రాయబార కార్యాలయం నుంచి ముగ్గురు వ్యక్తులు ఐదు సూట్‌కేసులు, రెండు పెద్ద క్యారీ బ్యాగ్స్‌లో ఖషోగ్జీ మృతదేహాన్ని తరలించినట్టు సీ ఛానెల్ ప్రసారం చేసిన సీసీటీవి ఫుటేజీలో స్పష్టంగా కనిపించింది. వాటిని ఓ మినీ బస్‌లో ఓ గ్యారేజ్ వద్దకు తీసుకెళ్లారని.. అక్కడ వాటిని బయటకు తీస్తున్న సమయంలోనూ సీసీటీవిలో రికార్డయినట్టు చెబుతున్నారు.

  ఖషోగ్జీ మరణానికి ముందు చివరిసారిగా ఇస్తాంబుల్‌లోని సౌదీ కార్యాలయంలోకి వెళ్తూ కనిపించాడు. ఆ తర్వాత రెండు వారాల పాటు ఆయన ఆచూకీ తెలియరాలేదు. చివరకు ఆయన హత్యకు గురైనట్టు తేలింది. ఈ హత్య వెనుక సౌదీ పాలక వర్గాలు ఉన్నాయన్నది ప్రధాన ఆరోపణ.కాగా, జర్నలిస్ట్ ఖషోగ్జీ వాషింగ్టన్ పోస్ట్‌కు కంట్రిబ్యూటర్‌గా పనిచేస్తున్నారు. సౌదీ ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు ఎక్కుపెడుతున్నందునే ఆయన్ను హత్య చేశారన్న ఆరోపణలున్నాయి. ఖషోగ్జీని హత్య చేయించడానికి 15మందితో కూడిన సౌదీ టీమ్‌ ఇస్తాంబుల్‌కి వచ్చిందని టర్కీ అధికారులు చెబుతున్నారు. ఖషోగ్జీని హత్య చేసి ముక్కలు ముక్కలు చేసి యాసిడ్‌లో కరిగించారని మీడియాలో కథనాలు వచ్చాయి.

  ఇది కూడా చదవండి: అదృశ్యం కాదు హత్య: సౌదీ జర్నలిస్ట్ ఖషోగ్జీ మిస్సింగ్ విషాదాంతం!

  First published:

  Tags: Crime, Saudi Arabia

  ఉత్తమ కథలు