Corona to Animals: పెంపుడు జంతువులకు కరోనా సోకుతుందా?

Corona to Animals: మనుషులకు కరోనా వ్యాపించడానికి పెంపుడు జంతువులు కారణం అవుతున్నాయా అనే అంశంపై శాస్ర్తవేత్తలు పరిశోధన చేశారు. ఇందులో కొత్త విషయాలు తెలిశాయి.

news18-telugu
Updated: October 7, 2020, 11:19 AM IST
Corona to Animals: పెంపుడు జంతువులకు కరోనా సోకుతుందా?
Corona to Animals: పెంపుడు జంతువులకు కరోనా సోకుతుందా?
  • Share this:
Coronavirus in Animals: కరోనా మహమ్మారిపై ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. దీనికి వ్యాక్సిన్ కనిపెట్టే పనిలో చాలా దేశాలు నిమగ్నమయ్యాయి. ఇప్పటి వరకు ఇది మనుషులకు మాత్రమే ప్రమాదకారి అని భావించారు. కానీ ఈ వైరస్ కుక్కలు, పిల్లులు సహా ఇతర జీవజాతులకూ వ్యాపించగలదని తాజా పరిశోధనలు నిరూపిస్తున్నాయి. కానీ దీని ప్రభావంతో ఈ జంతువులు అంతగా అనారోగ్యం పాలయ్యే అవకాశం లేదని జంతు పరిశోధనా నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా పిల్లులు బలమైన రోగనిరోధక వ్యవస్థను కలిగి ఉంటాయి. అందుకే మనుషులకు వ్యాపించే కరోనా వైరస్‌కి సరైన వ్యాక్సిన్ కనిపెట్టేందుకు పిల్లులపై కూడా అధ్యయనాలు చేస్తున్నారు.

* తాజా పరిశోధలు ఏం చెబుతున్నాయి?:

పెంపుడు జంతువుల ద్వారా వైరస్‌లు మనుషులకు సోకినట్లు ఇప్పటివరకు తేలలేదు. కానీ పిల్లుల ద్వారా కొన్ని రకాల వైరస్‌లు వ్యాపిస్తాయి. వాటి నుంచి ఇతర పిల్లలులకు ఇలాంటి వైరస్‌లు సోకే అవకాశం ఉంది. తాజా అధ్యయనంలో కరోనా సోకిన కుక్కల ఎగువ శ్వాస మార్గాల (upper respiratory tracts)లో వైరస్ పెద్దగా అభివృద్ధి చెందలేదని తెలిసింది. కానీ కొన్ని ఇతర అధ్యయనాల ఫలితాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ఇప్పటి వరకు పిల్లులు, కుక్కలు వైరస్ కారణంగా ఎలాంటి అనారోగ్యమూ చెందలేదని తాజాగా పరిశోధకులు తేల్చారు. మనుషులకు కరోనా వ్యాపించడానికి పెంపుడు జంతువులు కారణమవుతున్నాయా అనే అంశంపై శాస్ర్తవేత్తలు పరిశోధన చేశారు. దీనికి సంబంధించిన రిపోర్టును మంగళవారం నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రచురించింది. కొలరాడో స్టేట్ యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ మెడిసిన్ అండ్ బయోమెడికల్ సైన్సెస్‌లో పనిచేసే నిపుణులు దీనిపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేశారు. ఈ బృందంలో ఏంజెలా ఎం.బోస్కోలాత్, ఎయిర్న్ ఇ.హార్ట్విగ్, స్టెఫానీ ఎం.పోర్టర్ సభ్యులుగా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ 10 లక్షల మందికి పైగా చనిపోయారు. పెంపుడు జంతువులకు కరోనా వ్యాపిస్తుందా లేదా అనే అంశంపై పెద్దగా పరిశోధనలు జరగలేదు.

* అధ్యయనం ఎలా చేశారు?:
పరిశోధనలో భాగంగా ముందు కుక్కలు, పిల్లులకు మత్తు మందు ఇచ్చారు. వాటి ముక్కుల ద్వారా పిపెట్లను చొప్పించి వాటికి వైరస్ ఇచ్చారు. ఆ తరువాత వాటిని వేరే కుక్కలు, పిల్లులతో కలిపి ఉంచారు. వాటి నుంచి వైరస్ ఎలా వ్యాపిస్తుందో అంచనా వేసేందుకు ఈ ప్రయోగం చేశారు. వాటి ద్వారా ఆరోగ్యంగా ఉన్న ఇరత కుక్కలు, పిల్లులకు వైరస్ సోకలేదని వారు గుర్తించారు. చైనాలోని వుహాన్‌లో వీధి పిల్లులకు వైరస్ సోకినట్లు గతంలో గుర్తించారు. అమెరికా వంటి ఇతర దేశాల్లో పిల్లులను ఇళ్లలోనే పెంచుకుంటారు. ఒకవేళ పెంపుడు జంతువులకు మనుషుల ద్వారా వైరస్ సోకినా, వాటి నుంచి ఇతర జంతువులకు కరోనా సోకే అవకాశం లేదని పరిశోధన బృందం నిరూపించింది.

* జంతువుల్లో వైరస్ లక్షణాలు ఉంటాయా?:
ఒకవేళ పిల్లలకు వైరస్ సోకినా, దాన్ని మనం గుర్తించలేమని అధ్యయన బృందంలో సభ్యురాలైన బోస్కోలాత్ చెబుతున్నారు. వాటిలో వ్యాధి లక్షణాలు మనుషుల్లో మాదిరిగా బయటపడవని ఆమె చెప్పారు. తమ ప్రయోగంలో వైరస్ ఇచ్చిన పిల్లులకు కరోనా సంక్రమించిందా లేదా అనేది తెలుసుకోవడం కూడా కష్టమేనని ఆమె అభిప్రాయపడ్డారు. కానీ పిల్లుల ద్వారా ఇతర వన్యప్రాణులకు వైరస్ సంక్రమించే అవకాశాలు ఉండొచ్చని పేర్కొన్నారు. డీర్ మైస్(ఒక రకం జింక)లకు వైరస్ సోసే అవకాశాలు ఉన్నట్టు గుర్తించామన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో పరిశోధనలు చేయాల్సి ఉందన్నారు.

ఫెర్రెట్లు (File)


* ఫెర్రెట్లపై పరిశోధన:
బయటి ప్రపంచంలో వైరస్ సోకిన వ్యక్తి నుంచి శ్వాస ద్వారా ఇతరులకు కరోనా వ్యాపిస్తుంది. జంతువుల్లో కూడా ఒకదాని నుంచి మరోదానికి ఇలా వైరస్ సంక్రమిస్తుందని చెప్పలేం. ఇప్పటి వరకు ఫెర్రెట్స్ అనే జంతువుల్లో మాత్రమే కరోనా వైరస్ సోకిన ప్రాణి నుంచి ఇతర ఫెర్రెట్లకు వైరస్ సంక్రమిస్తున్నట్లు ప్రయోగశాలలో నిరూపించారు. కానీ వీటిపై కూడా పూర్తి స్థాయిలో పరిశోధనలు జరగలేదని నిపుణులు చెబుతున్నారు. సుమారు 29 పెంపుడు ఫెర్రెట్లు ఉన్న ఒక ఇంట్లో, ఇద్దరు వ్యక్తులకు కరోనా సోకినట్లు శాస్ర్తవేత్తలు గుర్తించారు. కానీ వారి ద్వారా ఒక్క ఫెర్రెట్‌కి కూడా వైరస్ సంక్రమించలేదని వారు నిరూపించారు.‘ఆ ఇంట్లో 29 ఫెర్రెట్లు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. ఇంట్లో ఉన్న ఇద్దరు వ్యక్తులూ కరోనాతో బాధపడుతున్నారు. వైరస్ సంక్రమణకు అవకాశం ఉంది. కానీ వాటిలో ఒక్క ఫెర్రెట్‌కి కూడా కోవిడ్ సోకలేదు. ఇది నిజమైన సహజ ప్రయోగం’ అని టఫ్ట్స్ విశ్వవిద్యాలయంలో వైరాలజిస్ట్ కైట్లిన్ సావత్జ్‌కి తెలిపారు.


* సామాజికదూరమే మంచిది:
అడవి జంతువుల జన్యుక్రమానికి, వైరస్ వ్యాప్తికి సంబంధం ఉండవచ్చని శాస్ర్తవేత్తలు చెబుతున్నారు. ఫెర్రెట్ల కుంటుంబానికే చెందిన మింక్స్ అనే జీవులకు చాలా తేలికగా వైరస్ సోకుతున్నట్లు వారు గుర్తించారు. నెదర్లాండ్స్‌లోని మింక్ ఫామ్‌ల దగ్గర జంతువుల నుంచి మానవులకు వైరస్ సోకినట్టు గుర్తించారు. కానీ దీన్ని ధ్రువీకరించాల్సి ఉంది. మింక్‌ల నుంచి మనుషులకు వైరస్ సోకే అవకాశాలు ఉన్నట్టు సావత్జ్‌కి కూడా చెప్పారు. పెంపుడు పిల్లులను ఇళ్లలోనే ఉంచాలని కొలరాడో స్టేట్ రిసెర్చర్లు ప్రజలకు సూచిస్తున్నారు. కోవిడ్ సోకిన వారు పెంపుడు జంతువులకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
Published by: Krishna Kumar N
First published: October 7, 2020, 11:19 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading