క్యాట్ వాక్‌తో అదరగొట్టిన పిల్లి... ర్యాంపుపై మోడల్స్‌ షాక్...

Cat-Walk, Literally : ఫ్యాషన్‌ షోలలో మోడల్స్ ర్యాంప్‌పై క్యాట్ వాక్ చెయ్యడం కామన్. అలాంటిది క్యాటే (పిల్లి) వచ్చి క్యాట్ వాక్ చేస్తే ఆశ్చర్యమే.

Krishna Kumar N | news18-telugu
Updated: May 5, 2019, 9:25 AM IST
క్యాట్ వాక్‌తో అదరగొట్టిన పిల్లి... ర్యాంపుపై మోడల్స్‌ షాక్...
క్యాట్ వాక్ చేస్తున్న పిల్లి (Image : Youtube)
  • Share this:
అది మొరాకోలోని మరకేష్ నగరం. అక్కడ క్రిస్టియన్ డియోర్ క్రూయిజ్‌ షో జరుగుతోంది. మోడల్స్ న్యూ డిజైన్లను ప్రదర్శిస్తూ... ర్యాంప్‌పై క్యాట్ వాక్ చేస్తూ ముందుకెళ్తున్నారు. అదే సమయంలో... ఓ క్యాట్ (పిల్లి) ర్యాంపు పైకి ఎంటరైంది. మోడల్స్‌ని చూసి ఏ మాత్రం భయపడని ఆ పిల్లి... క్యాట్ వాక్ చేసింది. అంతే... అందరూ ఆశ్చర్యపోయారు. వావ్ ఇట్సే క్యాట్ వాక్ అంటూ ఆ పిల్లిని తమ మొబైల్ కెమెరాల్లో బంధించారు. అనుకోని అతిథిలా వచ్చిన ఆ క్యాట్... మోడల్స్ పక్క నుంచీ వాక్ చేస్తూ... చివరకు ఆడియన్స్ దగ్గరకు వెళ్లింది. దాంతో మోడల్స్, డ్రెస్సెస్ కంటే... ఆ పిల్లే సెంటరాఫ్ ఎట్రాక్షన్ అయిపోయింది. ఆ పిల్లి సరిగా నడవలేదనీ, మోడల్స్‌కి అడ్డుగా వెళ్లిందనీ, దానికి సరైన ట్రైనింగ్ ఇవ్వలేదనీ కొందరు జోక్స్ వేశారు. యూట్యూబ్‌లోని ఆ వీడియో ఇప్పుడు వైరల్ అయిపోయింది.


ఫెలైన్ ఫ్యాషనిస్టా షోపై నెటిజన్లు కూడా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఆ పిల్లిపై ట్విట్టర్‌లో ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి.


కొంతమందైతే పిల్లి బొమ్మ కూడా వేసి మరీ ఫెలైన్ ఫ్యాషనిస్టాలో క్యాట్ వాక్‌పై కామెంట్లు పెడుతున్నారు.


ఇవి కూడా చదవండి :

టీడీపీ ఓడితే ఏపీలో మళ్లీ ఎన్నికలు... చంద్రబాబు వ్యూహం అదేనా... భయపెడుతున్న 20 సర్వేలు...

వైఎస్ జగన్... ఏపీ ముఖ్యమంత్రి... నేమ్‌ ప్లేట్ రెడీ అవుతుంది...

నేడు CBSE 10th ఫలితాలు విడుదల... ఎలా చెక్ చేసుకోవాలంటే...

నేడు ఏపీలో గ్రూప్ -2 స్క్రీనింగ్ టెస్ట్... 447 పోస్టులు... ఒక్కో పోస్టుకీ 660 మంది పోటీ
First published: May 5, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు