తరుముకొచ్చిన మృత్యువు.. రెప్పపాటులో చావును తప్పించుకున్న దంపతులు..

అదృష్టవశాత్తు ఆ ప్రమాదంలోనూ ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో.. ఆ దంపతులు నిజంగా అదృష్టవంతులు అని చాలామంది అభిప్రాయపడుతున్నారు

news18-telugu
Updated: October 25, 2019, 6:05 PM IST
తరుముకొచ్చిన మృత్యువు.. రెప్పపాటులో చావును తప్పించుకున్న దంపతులు..
సీసీటీవిలో రికార్డయిన దృశ్యం
  • Share this:
భూమి మీద నూకలు మిగిలి ఉంటే.. ఎంతటి ప్రమాదమైనా ఏమీ చేయలేదేమో. అమెరికాలోని అరిజోనాలో జరిగిన ఘటనే ఇందుకు మంచి ఉదాహరణ.తరుముకొచ్చిన మృత్యువు నుంచి ఆ దంపతులు తృటిలో బయటపడ్డారు. ఆ దంపతుల వైపు మృత్యువులా దూసుకొచ్చిన కారును మరో కారు ఢీకొట్టడంతో.. అతి సమీపానికి వచ్చిన చావు నుంచి వారు సురక్షితంగా బయటపడగలిగారు. అరిజోనాలో ఉన్న ఫీనిక్స్‌లో ఈ ఘటన జరిగింది. స్థానిక పోలీసులు దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది.

పోలీసుల కథనం ప్రకారం.. ఫీనిక్స్‌లోని ఓ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఓ జంట తమ బిడ్డతో పాటు రోడ్డు దాటేందుకు సిద్దపడ్డారు.అలా ఒక అడుగు ముందుకేశారో లేదో.. అటుగా ఓ కారు రయ్యిమని వారి వైపు దూసుకొచ్చింది. 23 ఏళ్ల ఎర్నెస్తో ఒంటానెజ్ మద్యం మత్తులో అతివేగంగా కారు నడుపుతూ వారి మీదకు దూసుకొచ్చాడు. ఇంతలో ఎదురుగా దూసుకొచ్చినా మరో కారు ఎర్నెస్తో కారును ఢీకొట్టడంతో ఆ దంపతులు ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆ సమయానికి ఎదురుగా ఆ కారు వచ్చి ఉండకపోతే..ఆ దంపతుల ప్రాణాలు గాల్లో కలిసిపోయి ఉండేవి. అదృష్టవశాత్తు ఆ ప్రమాదంలోనూ ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో.. ఆ దంపతులు నిజంగా అదృష్టవంతులు అని చాలామంది అభిప్రాయపడుతున్నారు.

First published: October 25, 2019, 5:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading