Home /News /international /

CANADIAN WOMAN MAY BE WORLDS FIRST PATIENT TO BE DIAGNOSED WITH CLIMATE CHANGE MK GH

Climate Change: కెనడాలో వాతావరణ మార్పుతో అస్వస్థతకు గురైన వృద్ధురాలు.. ప్రపంచంలోనే మొట్టమొదటి కేసుగా నిర్ధారణ

కెనడాలోని బ్రిటీష్​ కొలండియా ప్రావిన్స్​కు చెందిన డెబ్బై ఏళ్ల వృద్ధురాలు శ్వాసకోశ సమస్యతో బాధపడుతోంది. సదరు రోగిని వైద్యులు పరీక్షించగా ‘వాతావరణ మార్పు’ సమస్యతో బాధపడుతున్నట్లుగా నిర్ధారించారు.

కెనడాలోని బ్రిటీష్​ కొలండియా ప్రావిన్స్​కు చెందిన డెబ్బై ఏళ్ల వృద్ధురాలు శ్వాసకోశ సమస్యతో బాధపడుతోంది. సదరు రోగిని వైద్యులు పరీక్షించగా ‘వాతావరణ మార్పు’ సమస్యతో బాధపడుతున్నట్లుగా నిర్ధారించారు.

కెనడాలోని బ్రిటీష్​ కొలండియా ప్రావిన్స్​కు చెందిన డెబ్బై ఏళ్ల వృద్ధురాలు శ్వాసకోశ సమస్యతో బాధపడుతోంది. సదరు రోగిని వైద్యులు పరీక్షించగా ‘వాతావరణ మార్పు’ సమస్యతో బాధపడుతున్నట్లుగా నిర్ధారించారు.

ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న వాతావరణ మార్పుల వల్ల అనేక దేశాలు తీవ్ర స్థాయిలో నష్టపోతున్నాయి. ఈ పరిస్థితి కెనడాలో దారుణంగా ఉంది. అక్కడ జూన్​లో సంభవించిన అడవి మంటల కారణంగా తీవ్ర వేడిగాలులు వీస్తున్నాయి. తద్వారా, వాతావరణంలో వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా, వాతావరణ మార్పులతో ఇబ్బంది పడుతున్న మొట్టమొదటి రోగిని కెనడియన్​ ప్రభుత్వం గుర్తించింది. బహుశా ప్రపంచంలో నమోదైన మొట్టమొదటి కేసుగా దీన్ని గుర్తించవచ్చని వైద్యులు చెబుతున్నారు.

కెనడాలోని బ్రిటీష్​ కొలండియా ప్రావిన్స్​కు చెందిన డెబ్బై ఏళ్ల వృద్ధురాలు శ్వాసకోశ సమస్యతో బాధపడుతోంది. సదరు రోగిని వైద్యులు పరీక్షించగా ‘వాతావరణ మార్పు’ సమస్యతో బాధపడుతున్నట్లుగా నిర్ధారించారు. ఇటీవల కూటెనేస్​లో చెలరేగిన అడవి మంటల వల్ల ఆమెకు ఉబ్బసం, ఆస్తమాతో పాటు ఊపిరి పీల్చుకోవడం కష్టతరమైందని కెనడా టైమ్స్​ కాలమిస్ట్​ వార్తాపత్రిక కూడా నివేదించింది. దీనిపై ఆమెకు చికిత్స చేస్తున్న డాక్టర్​ మెరిట్ మాట్లాడుతూ “పేషెంట్​కు ఇప్పటికే గుండె జబ్బు ఉంది. ఆమె ఎలాంటి ఎయిర్ కండిషనింగ్ లేని ఇంట్లో నివసిస్తోంది. దీంతో, ఆమె ఆరోగ్య సమస్యలన్నీ తీవ్రమయ్యాయి. ఆమె అనారోగ్య సమస్యలతో పాటు ఇటీవల చోటుచేసుకున్న వాతావరణ మార్పులు ఆమె పరిస్థితిని మరింత దిగజార్చాయి. ఇటువంటి కేసు గత పదేళ్లలో ఎప్పుడూ చూడలేదు.”అని డాక్టర్ మెరిట్ అన్నారు.

40 రెట్లు పడిపోయిన గాలి నాణ్యత..

బ్రిటీష్ కొలంబియా జూన్‌లో భయంకరమైన హీట్‌వేవ్ పరిస్థితులను ఎదుర్కొంది. 500 మంది మరణాలకు కారణమైంది. సాధారణంగా ఆమోదించే దానికంటే గాలి నాణ్యత 40 రెట్లు పడిపోయిందని నివేదికలు పేర్కొన్నాయి. తద్వారా, గతంలో కంటే ఎక్కువ మంది కెనడియన్లు వేడి తరంగాలు, అడవి మంటల వల్ల తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలను ఎదుర్కొంటున్నారు. జూన్​ నెలలో సంభవించిన అడవి మంటల కారణంగా కెనడాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జూన్​ 29న 49.6 డిగ్రీల సెల్సియస్​ నమోదైంది. అధిక ఉష్ణోగ్రతల వల్ల కెనడా, యూఎస్​లో వందలాది మంది మరణించారు. ఇక, గ్లాస్గోలో జరిగిన కాప్​ 26 సదస్సులో వాతావరణ ప్రభావం–ప్రజారోగ్యం అనే అంశంపై వాడివేడిగా చర్చలు జరిగాయి. ఈ సమావేశాల్లోపర్యవరణాన్ని పరిరక్షించడానికి, కాలుష్యాన్ని నియంత్రించడానికి కఠిన చర్యలు తీసుకోవాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు.
Published by:Krishna Adithya
First published:

Tags: Air Pollution

తదుపరి వార్తలు