కెనడాకు చెందిన 64 ఏండ్ల విన్స్స్టన్ బ్లాక్‌మోర్ సంసార సాగరంలో మునిగితేలుతున్నారు. ఒకరా ఇద్దరూ ఆయనకు ఏకంగా 27 మంది భార్యలు ఉన్నారు. 150 మంది పిల్లలు ఉన్నారు. ఈ విషయాన్ని ఆయన సంతానంలోని ఓ కుమారుడే వెల్లడించాడు. తాను ప్రపంచంలోనే ఎక్కువ పోలిగామస్ (తండ్రికి ఎక్కువ మంది భార్యలు) కుటుంబానికి చెందిన వాడినని మెర్లిన్ బ్లాక్‌మోర్ తెలిపాడు. 19 ఏళ్ల తర్వాత అతడు ఈ విషయాన్ని వెల్లడించాడు. కెనడా.. బ్రిటీష్ కొలంబియాలోని బౌంటిఫుల్ ఈ జంబో ఫ్యామిలీ ఉంటోంది. ఈ విషయాన్ని మెర్లిన్ ఓ వీడియో ద్వారా ప్రపంచానికి తెలియజేశాడు.
తాను చాలా కాలంగా ఈ విషయాన్ని దాచిపెడుతూ వస్తున్నానని, అయితే వెల్లడించాలని ఇటీవలే నిర్ణయించుకున్నానని మెర్లిన్ చెప్పాడు. దీనిపై టిక్‌టాక్‌లో వీడియోలు చేశాడు. “ఈ విషయం గురించి మాట్లాడాలని ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నా. ఇప్పుడు మాట్లాడే పొజిషన్‌కు వచ్చాడు. ప్రపంచం అన్ని విషయాలు తెలుసుకోబోతోంది” అని మెర్లిన్ మొదలుపెట్టాడు.
కుటుంబం పెద్దగా ఉండడంతో సొంత స్కూల్‌కే పిల్లలు వెళతారని అతడు వెల్లడించారు. టీనేజీ వచ్చాక తల్లుల దగ్గర కాకుండా పిల్లలు మోటెల్లో కలిసి ఉంటారని అన్నాడు.
మెర్లిన్తో పాటు అతడి ఇద్దరి సోదరులు మురే, వారెన్ కూడా సోషల్ మీడియాలో తమ కుటుంబం గురించిన వివరాలు తెలిపారు. విన్స్స్టన్తో 27 మంది భార్యలు ఉన్నా.. కానీ 22 మంది పిల్లలే వద్ద ఉంటున్నారని తెలిపారు. ఆ 22 మందిలో 16 మంది ఆయననే పెళ్లి చేసుకున్నారనే షాకింగ్ విషయాన్ని తెలిపారు. ప్రతి ఇంట్లో పిల్లలకు ఇద్దరు తల్లులు ఉంటారని, ఒకరు పై ఫ్లోర్లో, మరొకరు కింద అంస్తులో ఉంటారని చెప్పారు.
బర్త్‌డే పార్టీలు విడివిడిగా చేసుకున్నా.. ఫ్యామిలీ రియూనియన్, థ్యాంక్స్ గివింగ్ పార్టీలకు మాత్రం కుటుంబ సభ్యులు మొత్తం హాజరువుతారట. వీరి కోసం ఒక పెద్ద హాల్ బుక్ చేస్తారట.
తండ్రి విన్స్టన్తో 2017లోనే మెర్లిన్ బంధాలు తెంచేసుకున్నాడు. ఎక్కువ వివాహాలు చేసుకున్నందుకు అప్పట్లో విన్‌స్టన్‌కు ఆరు నెలల హౌజ్ అరెస్ట్ శిక్ష సైతం పడింది. ఈ వివరాలు వెల్లడించిన ముగ్గురు పిల్లలు భారీ కుటుంబం నుంచి వేర్వేరుగా ఉంటున్నా.. తమ బ్రదర్స్, సిస్టర్స్‌తో మాట్లాడుతూనే ఉన్నారు.