Home /News /international /

CANADA FIVE INDIAN STUDENTS KILLED IN ROAD ACCIDENT IN ONTARIO PAH

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు భారతీయ విద్యార్థుల మృతి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. భారత సంతతికి చెందిన ఐదుగురు విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటనను భారత్ హైకమిషనర్  అజయ్ బిసారియా ధృవీకరించారు.

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. భారత సంతతికి చెందిన ఐదుగురు విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటనను భారత్ హైకమిషనర్  అజయ్ బిసారియా ధృవీకరించారు.

Road Accident In Canada: కెనడాలోని (Canada)ఒంటారియో ల్ హృదయ విదారక సంఘటన చోటు చేసుకుంది. ఒంటారియో లోని జరిగిన రోడ్డుప్రమాదంలో భారత సంతతికి చెందిన ఐదుగురు విద్యార్థులు సంఘటన స్థలంలోనే చనిపోయారు. వీరిలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

వీరిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. భారత కాల మానం ప్రకారం... శనివారం టోరంటో లోని ఒంటారియోలో(Ontario) విద్యార్థులు తెల్లవారు జామున 3.45 నిముషాలకు ప్రయాణిస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. ఈ విష‌యాన్ని భారత హైకమిషనర్ అజయ్ బిసారియా (India's High Commissioner Ajay Bisaria) సోమవారం ధృవీకరించారు.

కెనడాలోని (Canada) విద్యార్థులు శనివారం టొరంటో సమీపంలో ఆటో వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. టోరంటో సమీపంలో తెల్లవారు జామున విద్యార్థులు ఆటోలో ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం తెల్లవారు జామున ప్రమాదం జరిగింది.

ఈ ఘటనలో స్పాట్ లోనే ఐదుగురు మృతి చెందారు. మరొ ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించారు. ఈ విష‌యాన్ని భారత హైకమిషనర్ అజయ్ బిసారియా (India's High Commissioner Ajay Bisaria) సోమవారం ధృవీకరించారు.

మృతి చెందిన విద్యార్థులలో.. హర్‌ప్రీత్ సింగ్ (Harpreet Singh), జస్పిందర్ సింగ్ (Jaspinder Singh), కరణ్‌పాల్ సింగ్ (Karanpal Singh), మోహిత్ చౌహాన్ (Mohit Chouhan), పవన్ కుమార్‌ (Pawan Kumar)లుగా గుర్తించారు. బాధిత కుటుంబాలకు సమాచారం చేరవేసేందుకు ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశారు. బాధితుల స్నేహితులను కలిసి, సహయక చర్యలను చేపట్టాలని అజయ్ బిసారియా ఆదేశించారు. అదే విధంగా.. ఈ ఘ‌ట‌న‌పై భారత హైక‌మిష‌న‌ర్ అజయ్ బిసారియా తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా బాధిత కుటుంబాలకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేాశారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Canada, Road accident

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు