భారత అమ్ములపొదిలోకి కొత్తగా S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్(Air Defense System) చేరింది. అయితే ఇది పాకిస్తాన్(Pakistan) నుంచి ఎదురయ్యే దాడులను అడ్డుకోనుందని నిపుణులు పేర్కొన్నారు. భారత S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్.. పాక్ స్టీల్త్ డ్రోన్ ZF1 S-400ను ధీటుగా ఎదుర్కొనే సామార్థ్యం ఉన్నట్లు కూడా నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ భయంకరమైన S-400 సిస్టమ్‌ను ఎదుర్కొనేందకు పాకిస్థాన్ పొరుగు దేశం అయిన చైనా సహాయం కూడా తీసుకునే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. పాకిస్తాన్, చైనాలతో(China) ఉద్రిక్తతల మధ్య తన సరిహద్దుల వెంబడి ఐదు S-400 రెజిమెంట్లను మోహరించడానికి భారత్ సిద్ధమవుతోంది. రక్షణ(Security) ఒప్పందంలో భాగంగా రష్యాలో(Russia) తయారైన S-400 విమానాలు భారత్ దిగుమతి చేసుకుంది. S-400 అనేది UAVలు, బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణుల కంటే సమర్థవంతంగా పనిచేస్తుంది. పాక్ అణ్వాయుధ దాడులను సైతం ధీటుగా ఎదుర్కొనే సామర్థ్యం భారత S-400 రక్షణ వ్యవస్థ ఉంది.
S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఫీచర్లు ఎలా ఉన్నాయంటే.. ఇది ప్రమాదకరమైన ఆపరేషన్‌ను ప్రారంభించడానికి S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది ఉపయోగపడనుంది. అంతే కాకుండా.. 40km, 120km, 250km & 400km పరిధిలోని దాడులను ధీటుగా ఎదుర్కోగలిగే లేయర్డ్ కవరేజీ క్షిపణులను కలిగి ఉంది. ఎత్తైన ప్రాంతాలు, శత్రు దుర్భేద్యమైన ప్రదేశాల్లో జరిగే దాడుల నుంచి సైన్యాన్ని S-400 క్షిపణులు రక్షించబడుతాయి. కొత్త ప్రదేశానికి తరలించిన తర్వాత కేవలం 5 నిమిషాల్లో S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను రీస్టార్ట్ చేసే ఆప్షన్ ను కూడా కలిగి ఉంది. తరచుగా మార్చడానికి వీలు కల్పిస్తూ, శత్రువుల కంట పడకుండా, దాని స్థానాన్ని గుర్తించకుండా చేయగలిగే సామార్థ్యం కలిగి ఉంటుంది.
S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎంత భయంకరమైనది.. ?
S-400 సిస్టమ్స్ సామర్థ్యాలను తక్కువగా లేదా అతిగా అంచనా వేయకూడదని నిపుణులు చెబుతున్నారు. S-400 భారతదేశం, పాక్ మధ్య ఉన్న మొత్తం సరిహద్దు గగనతలాన్ని కాపాడగలదని నివేదికలు పేర్కొంటున్నాయి. ఇక ఈ S-400 సిస్టమ్‌ను నేర కార్యకలాపాల నియంత్రణకు కూడా ఉపయోగించే అవకాశం ఉంది.
S-400 ఫీచర్లను సమర్థవంతంగా ఉపయోగించడం.. దానిని ఆపరేట్ చేసే సిబ్బంది సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుందనేది నిపుణులు చెబుతున్నారు. పాక్ తన రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేసుకునేందుకు, క్లిష్టమైన నిర్మాణాలను రక్షించడానికి S-400 డిఫెన్స్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందని కూడా నిపుణులు చెబుతున్నారు. S-400ను ఇప్పటివరకు నిజమైన పోరాట పరిస్థితుల్లో ఎప్పుడూ పరీక్షించలేదు.
భారత S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను పాకిస్తాన్ ఎలా ఎదుర్కోనుంది.. ?
S-400 కార్యకలాపాలను ఎదుర్కోవడానికి పాకిస్తాన్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ను ఉపయోగించనుందని నిపుణులు చెబుతున్నారు. భారీ లక్ష్యాల కోసం పాకిస్తాన్ ప్రత్యేకంగా స్టెల్త్ కంబాట్ డ్రోన్ ZF1ని అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. UAS గ్లోబల్ 2018లో నిర్వహించిన ద్వైవార్షిక ఆయుధ ప్రదర్శన (IDEAS)లో ZF1ను పాకిస్తాన్ ప్రదర్శించించిన విషయం తెలిసిందే.
కానీ 2019 నుంచి దీని అభివృద్ధికి సంబంధించి ఎటువంటి వార్తలు రాలేదు. ఇప్పటికే S-400ని ఉపయోగిస్తున్న చైనా, టర్కీలతో పాకిస్తాన్ చేతులు కలిపి ప్రయోజనం పొందే అవకాశం ఉంది. భారతదేశం S-400 వ్యవస్థలను అణిచివేసేందుకు చైనా & టర్కీ పరోక్షంగా పాకిస్తాన్‌కు సహాయపడతాయని నిపుణులు భావిస్తున్నారు. హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ (HGV)ని అభివృద్ధి చేయడంలో చైనా పాకిస్తాన్‌కు సహాయం చేయనుందని నివేదికలు సూచిస్తున్నాయి. గతంలో బీజింగ్.. HGV అభివృద్ధికి ఉత్తర కొరియాకు సహాయం చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Defence Ministry, Pm modi, Science