CAN OMICRON INFECT YOU TWICE EXPERTS SAY VERY MUCH POSSIBLE OMICRON REINFECTION DETAILS HERE MKS
Omicron reinfection : ఒమిక్రాన్ మళ్లీ సోకుతుందా? ఒంట్లో అది లేకుంటే అంతే గతి?
ప్రతీకాత్మక చిత్రం
పలు దేశాల్లో ఒమిక్రాన్ కారణంగా కేసులు విపరీతంగా పెరిగి.. ఆరోగ్య వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతోంది. మరోవైపు.. ఒమిక్రాన్ వేరియంట్‌కు సంబంధించి ప్రజల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకే వ్యక్తి రెండు మార్లు కరోనా బారినపడతారా (రీఇన్ఫెక్షన్) అనేది ప్రస్తుతం అనేక మందిని వేధిస్తున్న ప్రశ్న. అయితే..
ఒమిక్రాన్.. గతేడాది సెప్టెంబర్ లో సౌతాఫ్రికా నుంచి పుట్టుకొచ్చిన ఈ కరోనా వైరస్ కొత్త వేరియంట్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసులు, మరణాలు మళ్లీ పెరగడానికి కారణమైంది. ఇండియాలోనూ దీని ప్రభావం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంది. అమెరికా, యూరప్ దేశాల్లోనైతే ఒమిక్రాన్ దెబ్బకు ప్రపంచ రికార్డుస్థాయిలో రోజుకు కొత్తగా 13లక్షల కేసులు వచ్చాయి. ఈక్రమంలోనే ఒమిక్రాన్ గురించి అనేక అనేక షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి..
అనేక దేశాల్లో ఒమిక్రాన్ కారణంగా కేసులు విపరీతంగా పెరిగి.. ఆరోగ్య వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతోంది. మరోవైపు.. ఒమిక్రాన్ వేరియంట్‌కు సంబంధించి ప్రజల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకే వ్యక్తి రెండు మార్లు కరోనా బారినపడతారా (రీఇన్ఫెక్షన్) అనేది ప్రస్తుతం అనేక మందిని వేధిస్తున్న ప్రశ్న. అయితే.. రీఇన్ఫెక్షన్ సాధ్యమేనని నిపుణులు చెబుతున్నారు.
ఒమిక్రాన్ సోకిన తొలిసారి వ్యాధి తీవ్రత తక్కువగా ఉండి రోగనిరోధక శక్తి పూర్తిస్థాయిలో ఉద్దీపన చెందని సందర్భాల్లో మరోమారు దీని బారిన పడే అవకాశం కచ్చితంగా ఉంటుందని అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఎరిక్ ఫేగల్ తెలిపారు. ఇక రోగనిరోధకశక్తి బలహీనంగా ఉండే (ఇమ్యూనోకాంప్రమైజ్డ్) వ్యక్తుల్లోనూ ఒమిక్రాన్ రీఇన్ఫెక్షన్కు ఆస్కారం ఉందని పేర్కొన్నారు. ‘‘రెండు మార్లు ఒమిక్రాన్ బారినపడ్డ ఘటనలు ఇటీవల కొన్ని వెలుగు చూశాయి. కాబట్టి.. జాగ్రత్తగా ఉండండి’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.
‘ఒమిక్రాన్చాలా వేగంగా వ్యాపిస్తోంది.. అయితే.. రోగిలోని ఇమ్యూనిటీని మాత్రం కావాల్సిన స్థాయిలో స్టిమ్యులేట్ చేయట్లేదు. ఫలితంగా మరోమారు కొత్త మహమ్మారి బారిన పడే అవకాశం ఉంది’ అని న్యూజెర్సీ మెడికల్ స్కూల్ శాస్త్రవేత్త స్టాన్లీ వైస్ పేర్కొన్నారు. సాధారణంగా ఓ వ్యక్తికి వ్యాధి సోకిన అనంతరం..రోగ నిరోధకశక్తి పూర్తిస్థాయిలో ఉద్దీపన చెంది మరోమారు అదే వ్యాధి బారినపడకుండా రక్షిస్తుంది. అంటువ్యాధుల విషయంలో సాధారణంగా కనిపించే దృశ్యం ఇది. అయితే, ఒమిక్రాన్ విషయంలో మాత్రం ఇది ఆశించిన స్థాయిలో జరగట్లేదని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.