సింహానికి మహిళ పిడిగుద్దులు... పెంపుడు కుక్క కోసం...

America : ఓ వైపు సింహం చెరలో పెంపుడు కుక్క ఉంది. వదిలేస్తే అది ఆహారం అయిపోయింది. ఆ మహిళ ప్రాణాలకు తెగించింది.

news18-telugu
Updated: December 7, 2019, 11:05 AM IST
సింహానికి మహిళ పిడిగుద్దులు... పెంపుడు కుక్క కోసం...
సింహానికి మహిళ పిడిగుద్దులు... పెంపుడు కుక్క కోసం...
  • Share this:
California : కాలిఫోర్నియా దక్షిణాన జరిగిందీ ఘటన. ఓ మహిళ పెంచుకుంటున్న కుక్కపై కన్నేసిన పర్వత సింహం మెల్లిగా ఆ కుక్క దగ్గరకు వచ్చింది. ఒక్కసారిగా దానిపైకి ఉరికింది. కుక్క అరుపులు విన్న దాని యజమాని... సింహాన్ని చూసి కూడా భయపడకుండా ఇంట్లోంచీ బయటికొచ్చింది. సింహాన్ని తరిమేందుకు గట్టిగా అరిచింది. అయినప్పటికీ సింహం కుక్కను వదల్లేదు. ఆమె కుక్కను విడిపించేందుకు కుక్క కాళ్లను పట్టుకొని బలవంతంగా తనవైపుకి లాగింది. అయినా సింహం తన పంజా ఉచ్చుతోపాటూ, నోటి నుంచీ కుక్కను వదల్లేదు. ఇక లాభం లేదనుకున్న ఆమె... సింహం దగ్గరకు వెళ్లి... పిడికిలి బిగించి... సింహం ఎడమ బుగ్గపై గట్టిగా ఒక్కటిచ్చింది. అంతే... దవడ పక్కకుపోయినట్లు ఫీలైంది సింహం. కుక్కను వదిలేసింది. ఆమె వైపు కోపంగా చూసింది. ఆమెపైకి ఉరికింది. ఆమె కూడా అలాగే ఎదురుతిరిగి... సింహాన్ని పిడిగుద్దులు గుద్దింది. ఆ గలాటాలో ఆమెకు చిన్నపాటి గాయాలయ్యాయి. కుక్కను లాక్కున్న ఆమె గట్టిగా అరుస్తూ కేకలు వెయ్యడంతో... సింహానికి ఒకింత భయం వేసింది. అక్కడి నుంచీ వెళ్లిపోయింది.

సింహం నోట్లో బాగా నలిగిపోయిన ఆ కుక్క ప్రాణాలు విడిచింది. ఆమె స్థానిక ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ పొందుతోంది. ఐతే... పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తులో కొత్త విషయం తెలిసింది... మరోచోట ఆ సింహం... మరో కుక్కను గాయపరిచిందని తెలిసింది. ఇప్పుడా పర్వత సింహం కోసం ఓ హెలీకాప్టర్‌తో సెర్చ్ చేస్తున్నారు. అలాగే జంతువుల్ని బంధించే అటవీ అధికారులు కూడా రంగంలోకి దిగారు. ఐతే... ప్రస్తుతం ఆ సింహం ఎక్కడుందో మాత్రం తెలియట్లేదు.

 

ప్రేమను పంచాలంటున్న బాలీవుడ్ బ్యూటీ అష్నూర్ కౌర్


ఇవి కూడా చదవండి :

Health : ప్రోటీన్స్ ఉండే ఆహారం ఎక్కువగా తినవచ్చా? తింటే ఏమవుతుంది?Health : బేబీ ఆయిల్ బెనిఫిట్స్... ప్రతి ఒక్కరికీ ప్రయోజనకరమే...

Health Tips : త్రిఫల చూర్ణం ప్రయోజనాలేంటి... ఎలా వాడాలి?

Health Tips : పింటో బీన్స్‌ తినండి... ఈ ప్రయోజనాలు పొందండి

Health Tips : డయాబెటిస్‌కి ఆవకాడోతో చెక్... ఇలా చెయ్యండి
First published: December 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు